Air Lift
-
ముఖ్య గమనిక! హంగేరీ వచ్చే వాళ్లు ముందుగా ఈ వివరాలు ఇవ్వండి
ఉక్రెయిన్‌లో యుద్ధ సమయంలో చిక్కుకుపోయిన భారతీయులను రోమేనియా, హంగేరీల మీదుగా ఇండియాకి తీసుకువచ్చేందుకు కేంద్రం వ్యూహం రచించింది. ఈ మేరకు తగు జాగ్రత్తలు తీసుకుంటూ హంగేరీ, రోమేనియా సరిహద్దులకు చేరుకోవాలంటూ భారతీయులకు సూచనలు జారీ చేసింది. భారత ఎంబసీ నుంచి వచ్చిన సూచనలకు అనుగుణంగా ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులు కేపీపీ టైసా సరిహద్దు వద్ద హంగేరిలోకి వెళ్లేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇలా వచ్చే వారి కోసం హంగేరీలో ఉన్న ఇండియన్ ఎంబసీ కొన్ని విధి విధానాలు రూపొందించింది. అందులో భాగంగా కేపీపీ టైసా సరిహద్దుకు చేరుకోవాడనికి ముందే ఆన్లైన్లో కొన్ని పత్రాలు ఫిల్ చేయాలంటూ కోరింది. Imp Notice! Students wanting to cross border through Kpp Tysa may please fill the form -https://t.co/jmkFl3Nahn Students and other stranded in Ukraine should follow advisory & alerts issued by @IndiainUkraine @MEAIndia @BshBudapest — Indian Embassy in Hungary (@IndiaInHungary) February 24, 2022 ఉక్రెయిన్ నుంచి హంగేరీ వచ్చే భారతీయులు ముందుగా పేరు, జెండర్, పుట్టినరోజు, ఉక్రెయిన్‌లో కాంటాక్ట్ నంబర్, భారత్‌లో కాంటాక్ట్ నంబర్, ఇండియాలో అడ్రస్, ఈ మెయిల్, పాస్‌పోర్ట్ నంబరు, పాస్‌పోర్ట్ ఎక్స్పైరీ తేది, ఉక్రెయిన్‌లో అడ్రస్, దగ్గరగా ఉన్న హంగేరి సరిహద్దు తదితర వివరాలు పొందు పరచాల్సి ఉంటుంది. ఇది చాలా ముఖ్య గమనికగా హాంగేరీ లోని ఇండియన్ ఎంబసీ పేర్కొంది. చదవండి: హంగేరి, రుమేనియా బోర్డర్‌కి రండి - కేంద్రం కీలక ఆదేశాలు -
హంగేరి, రుమేనియా బోర్డర్‌కి రండి - కేంద్రం కీలక ఆదేశాలు
ఉక్రెయిన్‌లో చిక్కుకున్న భారతీయుల తరలింపుకు సంబంధించి కేంద్రం కీలక ప్రకటన చేసింది. హంగేరి, రుమేనియా దేశాలకు దగ్గరగా ఉన్న వారు సరిహద్దుల్లో ఉన్న చెక్‌పోస్టుల వద్దరు రావాలని సూచించింది. ప్రయాణించే సమయంలో తమ వాహనాలపై ఇండియన్ ఫ్లాగ్‌ను పెట్టుకోవాలని కోరింది. భారతీయుల తరలింపు కోసం గురువారం రాత్రి నుంచి కేంద్ర విదేశాంగ మంత్రి జైశంకర్ హంగరీ, స్లోవేవకియా, రుమోనియా దేశాలకు చెందిన ప్రభుత్వాలతో చర్చలు జరిపారు. భారతీయుల తరలింపుకు పూర్తి సహకారం అందిస్తామని ఆయా దేశాలు ప్రకటించాయి. దీంతో కేంద్రం వెంటనే కీలక ఆదేశాలు జారీ చేసింది. ఉక్రెయిన్‌లో ఇండియన్ ఎంబసీ నుంచి వచ్చిన సూచనలు - విద్యార్థులు హంగేరి, రుమేనియా సరిహద్దులో ఉన్న చెక్‌పోస్ట్‌కి చేరుకోవాలి - ఉక్రెయిన్ సరిహద్దు సమీపంలోని హుజూర్ద్, చెర్నీ వెస్ట్ ప్రాంతాలకు చేరుకోవాలి - స్థానిక విదేశాంగ శాఖ అధికారుల సమన్వయంతో విద్యార్థులు టీమ్‌లుగా బయల్దేరాలని సూచన - బోర్డర్ వచ్చే సమయంలో విద్యార్థులు ప్రయాణించే వాహనాలపై భారత జెండాను ఉంచుకోవాలి - బోర్డర్ వచ్చే ముందు పాస్‌పోర్ట్, ఇతర ముఖ్యమైన డాక్యుమెంట్లను వెంట తెచ్చుకోవాలి - బోర్డర్ దాటే సమయంలో ఇబ్బందులు రాకుండా సరిహద్దుల వద్ద ప్రత్యేక హెల్ప్‌లైన్ సెంటర్ల ఏర్పాటు. ఏమైనా ఇబ్బందులు ఉంటే హెల్ప్‌లైన్ సెంటర్లు సహకరిస్తాయి. - రొమేనియా రాజధాని బుచరెస్ట్‌కి 2022 ఫిబ్రవరి 26న రెండు ఎయిర్ ఇండియా ప్రత్యేక విమానాలు పంపిస్తున్న కేంద్రం. - బుచరెస్ట్ నుంచి భారత పౌరులను ఎయిర్‌లిఫ్ట్ చేసేందుకు ఏర్పాట్లు - పశ్చిమ ప్రాంతంలో ప్రస్తుతం విద్యార్థులు ఉన్న స్థావరాల దగ్గర ప్రత్యేక చెక్‌పోస్టుల ఏర్పాటు -
ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 20 వేల మంది ఇండియన్లు.. ప్రత్యేక విమానాల్లో తరలింపు
ఉక్రెయిన్ వివాదం యుద్ధం చివరి అంచులకు చేరుకోవడంతో భారత ప్రభుత్వం అప్రమత్తమైంది. ఇప్పటికే ఉక్రెయిన్‌లో ఉన్న మన వారిని స్వదేశానికి వచ్చేయాలంటూ సూచనలు జారీ చేశారు. అయితే పరిస్థితి మరింతగా విషమించడంతో భారతీయులను తీసుకొచ్చేందుకు ఉక్రెయిన్‌కి స్పెషల్ ఫ్లైట్ పంపి ఎయిర్ లిఫ్ట్ చేయాలని నిర్ణయించారు. మంగళవారం రాత్రి ఉక్రెయిన్ నుంచి ఇండియాకు తొలి బోయింగ్ విమానం రానుంది. ఈ మేరకు ఉదయం 7:40 గంటలకు ఓ ప్రత్యేక విమానం ఢిల్లీ నుంచి ఉక్రెయిన్ రాజధాని కీవ్‌కి బయల్దేరి వెళ్లింది. ఇందులో సుమారు రెండు వందల మంది వరకు ఇండియన్లను తరలించనున్నారు. మరో రెండు విమానాలను సైతం ఎయిర్ లిఫ్ట్ కోసం ఉపయోగించాలని నిర్ణయించారు. ఉక్రెయిన్‌లో సుమారు 20 వేల మంది వరకు భారతీయులు ఉన్నారని విదేశాంగ శాఖ చెబుతోంది. ఉక్రెయిన్‌లో రెండు ప్రాంతాలను స్వతంత్ర దేశాలుగా గుర్తిస్తున్నట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్ చేసిన ప్రకటనతో పరిస్థితులు మరింత తీవ్రంగా మారాయి. తాము గుర్తించిన స్వతంత్ర దేశాల రక్షణ కోసం శాంతి దళలాలను పంపుతామని పుతిన్ స్పష్టం చేశారు. మరోవైపు రష్యాపై నాటో, ఈయూతో పాటు బ్రిటన్ కూడా కఠిన ఆంక్షలు విధించాయి. ఇక ఈ వివాదంలో జోక్యం చేసుకునేందుకు ఐక్యరాజ్య సమితి ఈ రోజు అత్యవసర సమావేశం నిర్వహిస్తోంది. -
'ఆయన ఫోన్ నంబర్ అడిగేంత ధైర్యం లేదు'
బాలీవుడ్ యాక్షన్ హీరో అక్షయ్ కుమార్ మంచి జోష్‌లో ఉన్నాడు. అక్షయ్ హీరోగా తెరకెక్కిన ఎయిర్ లిఫ్ట్, కలెక్షన్ల హవా సృష్టిస్తుండగా, అక్షయ్ నటనకు ప్రశంసల వర్షం కురుస్తోంది. ఇప్పటికే 50 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టిన ఈ సినిమా 100 కోట్ల మార్క్‌ను ఈజీగా రీచ్ అయ్యేలా కనిపిస్తోంది. దీంతో పాటు తొలిసారిగా సౌత్ ప్రేక్షకులను కూడా అలరించడానికి రెడీ అవుతున్నాడు అక్షయ్ కుమార్. రజనీ కాంత్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రోబో సీక్వెల్‌గా తెరకెక్కుతున్న సినిమాలో నెగెటివ్ రోల్లో నటిస్తున్నాడు అక్షయ్. ఇప్పటికే ఈ సినిమా కోసం స్పెషల్ ట్రైనింగ్ తీసుకుంటున్న ఈ బాలీవుడ్ స్టార్, త్వరలోనే షూటింగ్లో పాల్గొనటానికి రెడీ అవుతున్నాడు. రోబో సినిమాలో కలిసి నటిస్తున్న అక్షయ్ కుమార్, రజనీ కాంత్‌లకు ఒకేసారి పద్మ అవార్డులు ప్రకటించటంతో చిత్రయూనిట్ ఆనందంగా ఉన్నారు. ఈ సందర్భంగా ఓ మీడియా సమావేశంలో అక్షయ్ చెప్పిన సమాధానం అందరిని ఆశ్యర్యానికి గురిచేసింది. రజనీ కాంత్ గారు పద్మ విభూషణ్ అందుకుంటున్నారు కదా.. మీరు ఆయనకు శుభాకాంక్షలు తెలియజేశారా అన్న ప్రశ్నకు...' నాదగ్గర రజనీ సార్ ఫోన్ నంబర్ లేదు.. ఆయన్ని ఫోన్ నంబర్ అడిగేంత ధైర్యం నాకు లేదు' అంటూ సమాధానం ఇచ్చాడు అక్షయ్ కుమార్. -
షిండర్స్ లిస్ట్‌తో అక్షయ్ సినిమా పోలిక...
బాలీవుడ్ బాత్ అక్షయ్‌కుమార్ ‘బేబీ’ పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత అదే ధోరణిలో ‘ఎయిర్ లిఫ్ట్’ జనవరి 2016లో రాబోతూ ఉంది. రాజా కృష్ణ మీనన్ దర్శకుడు. టి.. సిరీస్ నిర్మాత. 1990లో ఇరాక్ కువైట్ ఆక్రమణకు పాల్పడటంతో గల్ఫ్ యుద్ధం వచ్చింది. ఆ సందర్భంగా కువైట్‌లో చిక్కుకుపోయిన భారతీయులను మన దేశానికి తీసుకురావడం ఈ కథ. అయితే ఈ కథకు స్పీల్బర్గ్ ‘షిండ్లర్స్ లిస్ట్’ స్ఫూర్తి కావచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు. రెండో ప్రపంచయుద్ధంలో నాజీల ఊచకోత నుంచి కొందరు యూదులను తప్పించిన షిండ్లర్స్ అనే అధికారి కథ అది. ఆ మూడ్ ఎయిర్ లిఫ్ట్‌లో కనిపించవచ్చని కొందరు భావిస్తున్నారు. ఎయిర్ లిఫ్ట్ దర్శక నిర్మాతలు దీనిని పూర్తిగా కొట్టేయకపోయినా అంత గొప్ప సినిమా మా సినిమా, ఒకే మానవోద్వేగాన్ని చూపించడంలో సారూప్యతను కలిగి ఉన్నాయని మాత్రం అంగీకరించారు.