షిండర్స్ లిస్ట్‌తో అక్షయ్ సినిమా పోలిక... | Akshay film comparison with sindars list ... | Sakshi
Sakshi News home page

షిండర్స్ లిస్ట్‌తో అక్షయ్ సినిమా పోలిక...

Published Tue, Dec 1 2015 10:47 PM | Last Updated on Sun, Sep 3 2017 1:19 PM

షిండర్స్ లిస్ట్‌తో  అక్షయ్ సినిమా పోలిక...

షిండర్స్ లిస్ట్‌తో అక్షయ్ సినిమా పోలిక...

బాలీవుడ్ బాత్

అక్షయ్‌కుమార్ ‘బేబీ’ పెద్ద హిట్ అయ్యింది. ఆ తర్వాత అదే ధోరణిలో ‘ఎయిర్ లిఫ్ట్’ జనవరి 2016లో రాబోతూ ఉంది. రాజా కృష్ణ మీనన్ దర్శకుడు. టి.. సిరీస్ నిర్మాత. 1990లో ఇరాక్ కువైట్ ఆక్రమణకు పాల్పడటంతో గల్ఫ్ యుద్ధం వచ్చింది. ఆ సందర్భంగా కువైట్‌లో చిక్కుకుపోయిన భారతీయులను మన దేశానికి తీసుకురావడం ఈ కథ. అయితే ఈ కథకు స్పీల్‌బర్గ్ ‘షిండ్లర్స్ లిస్ట్’ స్ఫూర్తి కావచ్చని కొందరు వ్యాఖ్యానిస్తున్నారు.

రెండో ప్రపంచయుద్ధంలో నాజీల ఊచకోత నుంచి కొందరు యూదులను తప్పించిన షిండ్లర్స్ అనే అధికారి కథ అది. ఆ మూడ్ ఎయిర్ లిఫ్ట్‌లో కనిపించవచ్చని కొందరు భావిస్తున్నారు. ఎయిర్ లిఫ్ట్ దర్శక నిర్మాతలు దీనిని పూర్తిగా కొట్టేయకపోయినా అంత గొప్ప సినిమా మా సినిమా, ఒకే మానవోద్వేగాన్ని చూపించడంలో సారూప్యతను కలిగి ఉన్నాయని మాత్రం అంగీకరించారు.
 

 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement