హంగేరి అధ్యక్షురాలి రాజీనామా | Hungary President Resigns Over Pardon To Man Convicted In Sex Abuse Case, Details Inside - Sakshi
Sakshi News home page

Hungary President Resigns: హంగేరి అధ్యక్షురాలి రాజీనామా

Published Sun, Feb 11 2024 8:45 AM | Last Updated on Sun, Feb 11 2024 12:40 PM

Hungary President Resigns Pardon To Man Convicted Abuse Case - Sakshi

హంగేరి అధ్యక్షురాలు కాటలిన్ నోవాక్ తన అధ్యక్షురాలి పదవికి రాజీనామా చేస్తున్నట్లు శనివారం ప్రకటించారు. ఓ చిల్డ్రన్స్ హోమ్‌లోని చిన్న పిల్లలపై లైగింక వేధింపులకు పాల్పడిన కేసులో దోషిగా నిర్ధారించబడిన వ్యక్తికి క్షమాభిక్ష పెట్టడంపై తీసుకున్న నిర్ణయంపై పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తం అయింది. దోషి విషయంలో అధ్యక్షురాలు తీసుకున్న నిర్ణయంపై ప్రతిపక్షాలు తీవ్రస్థాయిలో ఖండిస్తూ.. నిరసన వ్యక్తం చేశాయి.

ఈ క్రమంలో అధ్యక్షురాలు కాటలిన్ నోవాక్ రాజీనామా నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. శనివారం ఆమె స్థానిక మీడియాతో మాట్లాడుతూ.. ‘నేను తప్పు చేశాను. అందుకే ఇదే  అధ్యక్షురాలిగా ఇదే నా చివరి ప్రసగం. అధ్యక్షురాలి పదవికి నేను రాజీనామా చేస్తున్నా. బాధితులకు నేను సహకరించనందుకు  క్షమాపణలు. నేను చిన్న పిల్లలు, వారి కుటుంబాలకు రక్షణకు కట్టుబడి ఉంటా’ అని ఆమె వెల్లడించారు. 

లైంగిక వేధింపుల కేసులో దోషిపై తీసుకున్న నిర్ణయంతో ప్రతిపక్షాలు, నిరసనకారుల శుక్రవారం అధ్యక్షురాలి నివాసం ముందు భారీగా చేరుకొని నిరసనలు తెలిపారు. ఈ విషయంలో ప్రతిపక్షాలు ఆమెపై ఒత్తిడి పెంచారు. దీంతో ఆమె రాజీనామా ప్రకటించినట్లు సమాచారం. ఇక .. అధ్యక్షురాలి రాజీనామాపై  మాజీ న్యాయ మంత్రి జుడిట్ వర్గా స్పందిస్తూ.. కాటలిన్‌ నోవాక్‌ ప్రజా జీవితం నుంచి తప్పుకుంటున్నారని ప్రకటించారు. 2022లో కటాలిన్‌ నోవాక్ హంగేరి దేశానికి తొలి అధ్యక్షురాలిగా ఎన్నికై సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

చిల్డ్రన్స్ హోమ్ మాజీ డిప్యూటీ డైరెక్టర్‌కు క్షమాభిక్ష పెట్టడం వివాదం రేపింది. పిల్లలపై చిల్డ్రన్స్‌ హోమ్‌.. యజమాని లైంగిక వేధింపులను కప్పిపుచ్చడానికి దోషి సహాయం చేశాడని తెలుస్తోంది. దోషికి క్షమాభిక్ష నిర్ణయాన్ని గతేడాది ఏప్రిల్‌లో తీసుకున్నప్పటికీ.. గతవారం ప్రభుత్వం ప్రకటించింది. దీంతో ఒక్కసారిగా ప్రతిపక్షాలు కటాలిన్‌ నోవాక్ తన అధ్యక్షురాలి పదవికి రాజానామా చేయాలని డిమాండ్‌ చేశారు.

చదవండి: పాక్‌లో సంకీర్ణం..!

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement