సాక్షి, ముంబై: బెనెల్లీ గ్రూప్‌కు చెందిన హంగేరియన్ వాహన తయారీ సంస్థ కీవే సరికొత్త ఉత్పత్తులతో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. కొత్త బ్రాండ్‌ను సిక్స్‌టీస్ 300ఐ, వియోస్ట్ 300లను రెండు మోడల్స్‌ను ఇండియన్ మార్కెట్‌లో లాంచ్ చేసింది. వీటి ప్రారంభ ధర రూ.2,99,000 లుగా ఉండనున్నాయి. వాటిల్లో ఒకటి రెట్రో క్లాసిక్ మోడల్ అయితే, రెండోది మ్యాక్సీ-స్కూటర్. రూ. 10,000 ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే రెండేళ్ల అనిలిమిటెడ్ వారంటీకూడా ఉంది. కేరళలోని త్రివేండ్రంలో ఇప్పటికే ఒక బ్రాంచ్‌ను ఓపెన్ చేసింది.
1999లో ఏర్పాటు చేసిన కీవే కంపెనీ అధునాతన టెక్నాలజీతో రెట్రో క్లాసిక్ స్కూటర్‌ను తీసుకొస్తున్నామని వెల్లడించింది. కీవే కనెక్ట్ సిస్టమ్, సిమ్ కార్డు టెక్నాలజీతో ఈ స్కూటర్లు పనిచేస్తాయి. అంటే ఇంటిగ్రేటెడ్ జీపీఎస్ యూనిట్ కీవే యాప్‌కు కనెక్ట్ అయితే వెహికల్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఇంజిన్‌ను రిమోట్ స్విచ్ ఆఫ్ చేయడం, జియో-ఫెన్స్‌ను సెటప్ రైడ్ రికార్డ్స్ మేనేజ్, స్పీడ్ లిమిట్, కమ్యూనిటీ రైడ్‌లో లొకేషన్ సమాచారాన్ని స్నేహితులతో షేర్ చేసే అవకాశాన్ని కూడా అందిస్తోంది.
కీవే సిక్స్‌టీస్ 300ఐ ఫీచర్లు
రెట్రో క్లాసిక్ స్కూటర్ లో 278 సీసీ సింగిల్-సిలిండర్, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 6500 ఆర్‌పీఎం వద్ద గరిష్టంగా 18.7 హెచ్‌పీ పవర్, 6000 ఆర్‌పీఎం వద్ద 22ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 120/70-12 టైర్లు, డ్యూయల్-ఛానల్ ABSతో డిస్క్ బ్రేక్‌లు, స్ప్లిట్-సీట్, డ్యూయల్ ఎల్‌ఈడీ బ్రేక్ లైట్లు, సిగ్నల్ లైట్లతో కలిపి ఫుల్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్ ఇతర ఆకర్షణలు ఇంకా మల్టీ-ఫంక్షన్ ఇగ్నిషన్ స్విచ్ ఎలక్ట్రిక్ స్టార్టర్, అండర్-సీట్ స్టోరేజ్ యాక్సెస్, స్టీరింగ్ లాక్ వంటి స్పెసిఫికేషన్లు కూడా లబ్యం. మ్యాట్ లైట్ బ్లూ, మ్యాట్ వైట్, మ్యాట్ గ్రే కలర్స్‌లో ఇది లభ్యం.
కీవే వియోస్ట్ 300 ఫీచర్లు
యాంగ్యులర్ బాడీవర్క్‌తో కూడిన ఏరోడైనమిక్ డిజైన్‌తో కూడిన మ్యాక్సీ స్కూటర్ ఇది. 12 లీటర్ల ఫ్యుయెల్ ట్యాంక్, 278సీసీ లిక్విడ్-కూల్డ్ ఫోర్-స్ట్రోక్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 6500 ఆర్‌పీఎంవద్ద 18.7హెచ్‌పీ గరిష్ట పవర్‌ను, 6000ఆర్‌పీఎం వద్ద 22ఎన్‌ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నాలుగు ఎల్‌ఈడీ, ప్రొజెక్టర్లు, డీఆర్‌ఎల్ హెడ్‌లైట్‌లు, టర్న్ ఇండికేటర్ సిగ్నల్‌లు, కాంటినెంటల్ బెల్ట్ డ్రైవ్ సిస్టమ్, డిస్క్ బ్రేక్‌లు, టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్‌లు, డ్యూయల్-ఛానల్ ABSలు ఇతర ఫీచర్లు. మ్యాట్ బ్లాక్, మ్యాట్ బ్లూ, మ్యాట్ వైట్ అనే మూడు రంగుల్లో ఈ స్కూటరు లభిస్తుంది.
Benelli | Keeway India cordially invites you to our newest dealership in Trivandrum. Come witness the roar.
— KeewayIndia (@keeway_india) June 1, 2022
Visit: Benelli | Keeway - Trivandrum
NH 66 Bypass, Chackai, Anayara. P.O, Trivandrum - 695029, Kerala.#Trivandrum #BenelliIndia #KeewayIndia #India pic.twitter.com/xCaELTIFZq
అలాగే 2022 చివరికి నాలుగు కేటగిరీల్లో మొత్తం ఎనిమిది ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేయాలని కీవే భావిస్తోంది. ముఖ్యంగా హై-ఎండ్ స్కూటర్లు, క్రూయిజర్‌లు, స్పోర్ట్ మోటార్‌సైకిళ్లు, రెట్రో-స్ట్రీట్ బైక్స్‌పై దృష్టిపెట్టినట్టు కీవే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఝబఖ్ తెలిపారు.
The #Vieste300 is a modern powerhouse with a chiselled design, made to ease your city commute. Experience its brilliant performance first hand. Starts at ₹ 2.99 Lakhs* with 2-Year Unlimited KMS warranty ,Book yours online at ₹ 10 000 only from https://t.co/TZ4YeukZv3 T&C* Apply pic.twitter.com/Xiyn0EvPia
— KeewayIndia (@keeway_india) May 31, 2022
Comments
Please login to add a commentAdd a comment