Two-wheeler maker
-
కీవే అదిరిపోయే స్కూటర్లు: అయ్య బాబోయ్ అంత ధరా!
సాక్షి, ముంబై: బెనెల్లీ గ్రూప్‌కు చెందిన హంగేరియన్ వాహన తయారీ సంస్థ కీవే సరికొత్త ఉత్పత్తులతో భారతీయ మార్కెట్లోకి ప్రవేశించింది. కొత్త బ్రాండ్‌ను సిక్స్టీస్ 300ఐ, వియోస్ట్ 300లను రెండు మోడల్స్‌ను ఇండియన్ మార్కెట్లో లాంచ్ చేసింది. వీటి ప్రారంభ ధర రూ.2,99,000 లుగా ఉండనున్నాయి. వాటిల్లో ఒకటి రెట్రో క్లాసిక్ మోడల్ అయితే, రెండోది మ్యాక్సీ-స్కూటర్. రూ. 10,000 ప్రీ-బుకింగ్ చేసుకోవచ్చు. అలాగే రెండేళ్ల అనిలిమిటెడ్ వారంటీకూడా ఉంది. కేరళలోని త్రివేండ్రంలో ఇప్పటికే ఒక బ్రాంచ్‌ను ఓపెన్ చేసింది. 1999లో ఏర్పాటు చేసిన కీవే కంపెనీ అధునాతన టెక్నాలజీతో రెట్రో క్లాసిక్ స్కూటర్‌ను తీసుకొస్తున్నామని వెల్లడించింది. కీవే కనెక్ట్ సిస్టమ్, సిమ్ కార్డు టెక్నాలజీతో ఈ స్కూటర్లు పనిచేస్తాయి. అంటే ఇంటిగ్రేటెడ్ జీపీఎస్ యూనిట్ కీవే యాప్‌కు కనెక్ట్ అయితే వెహికల్ ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఇంజిన్‌ను రిమోట్ స్విచ్ ఆఫ్ చేయడం, జియో-ఫెన్స్‌ను సెటప్ రైడ్ రికార్డ్స్ మేనేజ్, స్పీడ్ లిమిట్, కమ్యూనిటీ రైడ్‌లో లొకేషన్ సమాచారాన్ని స్నేహితులతో షేర్ చేసే అవకాశాన్ని కూడా అందిస్తోంది. కీవే సిక్స్టీస్ 300ఐ ఫీచర్లు రెట్రో క్లాసిక్ స్కూటర్ లో 278 సీసీ సింగిల్-సిలిండర్, ఫోర్-స్ట్రోక్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 6500 ఆర్పీఎం వద్ద గరిష్టంగా 18.7 హెచ్‌పీ పవర్, 6000 ఆర్పీఎం వద్ద 22ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. 120/70-12 టైర్లు, డ్యూయల్-ఛానల్ ABSతో డిస్క్ బ్రేక్‌లు, స్ప్లిట్-సీట్, డ్యూయల్ ఎల్ఈడీ బ్రేక్ లైట్లు, సిగ్నల్ లైట్లతో కలిపి ఫుల్ ఎల్ఈడీ హెడ్‌లైట్ ఇతర ఆకర్షణలు ఇంకా మల్టీ-ఫంక్షన్ ఇగ్నిషన్ స్విచ్ ఎలక్ట్రిక్ స్టార్టర్, అండర్-సీట్ స్టోరేజ్ యాక్సెస్, స్టీరింగ్ లాక్ వంటి స్పెసిఫికేషన్లు కూడా లబ్యం. మ్యాట్ లైట్ బ్లూ, మ్యాట్ వైట్, మ్యాట్ గ్రే కలర్స్‌లో ఇది లభ్యం. కీవే వియోస్ట్ 300 ఫీచర్లు యాంగ్యులర్ బాడీవర్క్‌తో కూడిన ఏరోడైనమిక్ డిజైన్‌తో కూడిన మ్యాక్సీ స్కూటర్ ఇది. 12 లీటర్ల ఫ్యుయెల్ ట్యాంక్, 278సీసీ లిక్విడ్-కూల్డ్ ఫోర్-స్ట్రోక్ ఇంజిన్‌తో వస్తుంది. ఇది 6500 ఆర్పీఎంవద్ద 18.7హెచ్‌పీ గరిష్ట పవర్‌ను, 6000ఆర్పీఎం వద్ద 22ఎన్ఎం గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. నాలుగు ఎల్ఈడీ, ప్రొజెక్టర్లు, డీఆర్ఎల్ హెడ్లైట్లు, టర్న్ ఇండికేటర్ సిగ్నల్లు, కాంటినెంటల్ బెల్ట్ డ్రైవ్ సిస్టమ్, డిస్క్ బ్రేక్‌లు, టెలిస్కోపిక్ షాక్ అబ్జార్బర్లు, డ్యూయల్-ఛానల్ ABSలు ఇతర ఫీచర్లు. మ్యాట్ బ్లాక్, మ్యాట్ బ్లూ, మ్యాట్ వైట్ అనే మూడు రంగుల్లో ఈ స్కూటరు లభిస్తుంది. Benelli | Keeway India cordially invites you to our newest dealership in Trivandrum. Come witness the roar. Visit: Benelli | Keeway - Trivandrum NH 66 Bypass, Chackai, Anayara. P.O, Trivandrum - 695029, Kerala.#Trivandrum #BenelliIndia #KeewayIndia #India pic.twitter.com/xCaELTIFZq — KeewayIndia (@keeway_india) June 1, 2022 అలాగే 2022 చివరికి నాలుగు కేటగిరీల్లో మొత్తం ఎనిమిది ప్రొడక్ట్స్‌ను లాంచ్ చేయాలని కీవే భావిస్తోంది. ముఖ్యంగా హై-ఎండ్ స్కూటర్లు, క్రూయిజర్లు, స్పోర్ట్ మోటార్‌సైకిళ్లు, రెట్రో-స్ట్రీట్ బైక్స్‌పై దృష్టిపెట్టినట్టు కీవే ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ వికాస్ ఝబఖ్ తెలిపారు. The #Vieste300 is a modern powerhouse with a chiselled design, made to ease your city commute. Experience its brilliant performance first hand. Starts at ₹ 2.99 Lakhs* with 2-Year Unlimited KMS warranty ,Book yours online at ₹ 10 000 only from https://t.co/TZ4YeukZv3 T&C* Apply pic.twitter.com/Xiyn0EvPia — KeewayIndia (@keeway_india) May 31, 2022 -
10 కోట్ల మందికి ‘హీరో’
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ద్విచక్ర వాహన తయారీ దిగ్గజం హీరో మోటోకార్ప్ గొప్ప రికార్డు సృష్టించింది. కంపెనీ ప్రారంభమైన 1984 నుంచి ఇప్పటి వరకు మొత్తం 10 కోట్ల ద్విచక్ర వాహనాలను తయారు చేసి మరో మైలురాయిని అధిగమించింది. భారత్ నుంచి ఈ రికార్డు సాధించిన తొలి వాహన కంపెనీగా పేరు దక్కించుకుంది. ప్రపంచంలో అత్యధికంగా ద్విచక్ర వాహనాలను తయారు చేస్తున్న సంస్థగా వరుసగా 20 ఏళ్లుగా తన అగ్రస్థానాన్ని హీరో మోటోకార్ప్ పదిలపరుచుకుంది. తొలి 10 లక్షల యూనిట్లు అమ్మడానికి సంస్థకు 10 ఏళ్ల సమయం పట్టింది. 2004 నాటికి 1 కోటి, 2013 నాటికి 5 కోట్ల యూనిట్ల మార్కును చేరుకుంది. ఇక గడిచిన ఏడేళ్లలోనే 5 కోట్ల యూనిట్ల ద్విచక్ర వాహనాలను తయారు చేయడం విశేషం. సంస్థ పట్టుదల, కలల ఫలానికి ఈ మైలురాయి చిహ్నం అని హీరో మోటోకార్ప్ చైర్మన్, సీఈవో పవన్ ముంజాల్ ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు. ప్రపంచవ్యాప్తంగా కస్టమర్ల ఆదరణ, నమ్మకం, కంపెనీ సామర్థ్యానికి ఇది నిదర్శనంగా నిలుస్తుందని అన్నారు. ప్రతి ఏటా 10 మోడళ్లు..: వృద్ధి ప్రయాణాన్ని ఇలాగే కొనసాగిస్తామని పవన్ ముంజాల్ తెలిపారు. ‘నూతన మోడళ్ల పరిశోధన, అభివృద్ధికి మరిన్ని పెట్టుబడులు పెడతాం. మొబిలిటీ రంగంలో కొత్త, ప్రత్యామ్నాయ పరిష్కారాలపై దృష్టిసారిస్తాం. ప్రపంచ అవసరాల కోసం భారత్‌లో వాహనాలను తయారు చేస్తున్నాం. అంతర్జాతీయంగా మరిన్ని దేశాలకు విస్తరిస్తాం. రానున్న అయిదేళ్లపాటు కొత్త వేరియంట్లు, అప్‌గ్రేడ్స్‌తో కలిపి ఏటా 10 మోడళ్లను పరిచయం చేస్తాం’ అని తెలిపారు. సెలబ్రేషన్ ఎడిషన్ మోడల్స్.. కొత్త మైలురాయిని అందుకున్న శుభ సందర్భంగా హీరో మోటోకార్ప్ ఆరు సెలబ్రేషన్ ఎడిషన్ మోడల్స్‌ను ఆవిష్కరించింది. వీటిలో స్ప్లెండర్ ప్లస్, ఎక్స్ట్రీమ్ 160ఆర్, ప్యాషన్ ప్రో, గ్లామర్, డెస్టిని 125, మాయెస్ట్రో ఎడ్జ్ 110 ఉన్నాయి. ఫిబ్రవరి నుంచి ఇవి షోరూముల్లో అందుబాటులో ఉంటాయి. -
మార్చికల్లా మరో రెండు మోడళ్లు
ఇండియా కవాసాకి మోటార్స్ డిప్యూటీ ఎండీ నిశికవా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ద్విచక్ర వాహన తయారీలో ఉన్న జపాన్ కంపెనీ కవాసాకి భారత్‌లో ఈ ఆర్థిక సంవత్సరం మరో రెండు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనుంది. కవాసాకి భారత్‌లో ప్రస్తుతం 300 సీసీ ఆపైన మొత్తం 11 మోడళ్లను విక్రయిస్తోంది. విదేశాల నుంచి పూర్తిగా తయారైన 7 మోడళ్లను ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్ల ద్వారా, విడిభాగాలను దిగుమతి చేసుకుని అసెంబుల్ చేసి 4 మోడళ్లను బజాజ్ షోరూంల ద్వారా అమ్ముతోంది. హైదరాబాద్‌తో కలిపి కవాసాకీకి 8 ఎక్స్‌క్లూజివ్ షోరూంలు ఉన్నాయి. మార్చికల్లా మరో రెండు మోడళ్లను తీసుకొస్తామని ఇండియా కవాసాకి మోటార్స్ డిప్యూటీ ఎండీ షిగెటో నిశికవా వెల్లడించారు. 2016-17లో మూడు మోడళ్లను విడుదల చేస్తామన్నారు. ‘దేశవ్యాప్తంగా వివిధ కంపెనీల 500 సీసీ ఆపై సామర్థ్యంగల బైక్స్ నెలకు 700 అమ్ముడవుతున్నాయి. వృద్ధి రేటు 20 శాతముంది. కవాసాకి కి 10 శాతం వాటా ఉంది. 2015లో 20 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నాం’ అని తెలిపారు. శ్రీ వినాయక బజాజ్ ఏర్పాటు చేసిన కవాసాకి ఎక్స్‌క్లూజివ్ షోరూంను ప్రారంభించేందుకు బుధవారం ఆయన హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్‌లో 200 యూనిట్లు..: ప్రస్తుతం నెలకు 10 కవాసాకి వాహనాలు విక్రయిస్తున్నట్టు శ్రీ వినాయక బజాజ్ గ్రూప్ ఎండీ కె.వి.బాబుల్ రెడ్డి తెలిపారు. 2015-16లో మొత్తం 200 యూనిట్లు ఆశిస్తున్నట్టు చెప్పారు. బజాజ్ వాహనాల విక్రయం పరంగా దేశంలో టాప్-5లో ఉన్నామన్నారు. బజాజ్ టూవీలర్ల కోసం 10 షోరూంలు, త్రీ వీలర్లకు 5, కేటీఎంకు 4, కవాసాకి ఒక షోరూంను గ్రూప్ నిర్వహిస్తోంది. నెలకు 600 త్రిచక్ర, 1,100 ద్విచక్ర వాహనాలను విక్రయిస్తోంది. భారత్‌కు కవాసాకి 100-150 సీసీ టూవీలర్లు! కవాసాకి భారత్‌లో తిరిగి 100-150 సీసీ విభాగంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. 1998-2006 మధ్య బజాజ్ భాగస్వామ్యంతో ‘కాలిబర్’ బైక్‌ను విక్రయించిన సంగతి తెలిసిందే. భారత మార్కెట్‌పై ఫోకస్ చేసిన కవాసాకి తన బ్రాండ్ పాపులారిటీని వినియోగించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం ఇండోనేసియా, ఫిలిప్పైన్స్ మార్కెట్లలో 100-150 సీసీ బైక్‌లు, స్కూటర్లను అమ్ముతోంది. వీటిని భారత్‌లో ప్రవేశపెట్టేయోచన వుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఎప్పుడు వీటిని భారత్‌లో ప్రవేశపెడతారన్న ప్రశ్నకు షిగెటో నిశికవా సమాధానం దాటవేశారు.