మార్చికల్లా మరో రెండు మోడళ్లు | he other two models by March | Sakshi
Sakshi News home page

మార్చికల్లా మరో రెండు మోడళ్లు

Published Thu, Sep 17 2015 1:40 AM | Last Updated on Sun, Sep 3 2017 9:31 AM

మార్చికల్లా మరో రెండు మోడళ్లు

మార్చికల్లా మరో రెండు మోడళ్లు

ఇండియా కవాసాకి మోటార్స్ డిప్యూటీ ఎండీ నిశికవా
 
 హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ద్విచక్ర వాహన తయారీలో ఉన్న జపాన్ కంపెనీ కవాసాకి భారత్‌లో ఈ ఆర్థిక సంవత్సరం మరో రెండు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనుంది. కవాసాకి భారత్‌లో ప్రస్తుతం 300 సీసీ ఆపైన మొత్తం 11 మోడళ్లను విక్రయిస్తోంది. విదేశాల నుంచి పూర్తిగా తయారైన 7 మోడళ్లను ఎక్స్‌క్లూజివ్ ఔట్‌లెట్ల ద్వారా, విడిభాగాలను దిగుమతి చేసుకుని అసెంబుల్ చేసి 4 మోడళ్లను బజాజ్ షోరూంల ద్వారా అమ్ముతోంది. హైదరాబాద్‌తో కలిపి కవాసాకీకి 8 ఎక్స్‌క్లూజివ్ షోరూంలు ఉన్నాయి. మార్చికల్లా మరో రెండు మోడళ్లను తీసుకొస్తామని ఇండియా కవాసాకి మోటార్స్ డిప్యూటీ ఎండీ షిగెటో నిశికవా వెల్లడించారు.

2016-17లో మూడు మోడళ్లను విడుదల చేస్తామన్నారు. ‘దేశవ్యాప్తంగా వివిధ కంపెనీల 500 సీసీ ఆపై సామర్థ్యంగల బైక్స్ నెలకు 700 అమ్ముడవుతున్నాయి. వృద్ధి రేటు 20 శాతముంది. కవాసాకి కి 10 శాతం వాటా ఉంది. 2015లో 20 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నాం’ అని తెలిపారు. శ్రీ వినాయక బజాజ్ ఏర్పాటు చేసిన కవాసాకి ఎక్స్‌క్లూజివ్ షోరూంను ప్రారంభించేందుకు బుధవారం ఆయన హైదరాబాద్ వచ్చారు.

 హైదరాబాద్‌లో 200 యూనిట్లు..: ప్రస్తుతం నెలకు 10 కవాసాకి వాహనాలు విక్రయిస్తున్నట్టు శ్రీ వినాయక బజాజ్ గ్రూప్ ఎండీ కె.వి.బాబుల్ రెడ్డి తెలిపారు. 2015-16లో మొత్తం 200 యూనిట్లు ఆశిస్తున్నట్టు చెప్పారు. బజాజ్ వాహనాల విక్రయం పరంగా దేశంలో టాప్-5లో ఉన్నామన్నారు. బజాజ్ టూవీలర్ల కోసం 10 షోరూంలు, త్రీ వీలర్లకు 5, కేటీఎంకు 4, కవాసాకి ఒక షోరూంను గ్రూప్ నిర్వహిస్తోంది. నెలకు 600 త్రిచక్ర, 1,100 ద్విచక్ర వాహనాలను విక్రయిస్తోంది.

 భారత్‌కు కవాసాకి 100-150 సీసీ టూవీలర్లు!
 కవాసాకి భారత్‌లో తిరిగి 100-150 సీసీ విభాగంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. 1998-2006 మధ్య బజాజ్ భాగస్వామ్యంతో ‘కాలిబర్’ బైక్‌ను విక్రయించిన సంగతి తెలిసిందే. భారత మార్కెట్‌పై ఫోకస్ చేసిన కవాసాకి తన బ్రాండ్ పాపులారిటీని వినియోగించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం ఇండోనేసియా, ఫిలిప్పైన్స్ మార్కెట్లలో 100-150 సీసీ బైక్‌లు, స్కూటర్లను అమ్ముతోంది. వీటిని భారత్‌లో ప్రవేశపెట్టేయోచన వుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఎప్పుడు వీటిని భారత్‌లో ప్రవేశపెడతారన్న ప్రశ్నకు  షిగెటో నిశికవా సమాధానం దాటవేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement