ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ కవాసకి తన బైక్ల శ్రేణిలో ఐకానిక్ జెడ్1 మోటార్‌సైకిల్ 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో భారత మార్కెట్లలోకి కవాసకి Z650RS లిమిటెడ్ ఎడిషన్ బైక్‌ను కంపెనీ లాంచ్ చేసింది. భారత్‌లో కేవలం 20 యూనిట్లు మాత్రమే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి.
ప్రత్యేకమైన లుక్స్‌తో..!
కవాసకి Z650RS లిమిటెడ్ ఎడిషన్ బైక్ ప్రత్యేకమైన లుక్స్‌తో మరింత ఆకర్షణీయంగా కన్పించనుంది. ఈ బైక్‌కు ప్రత్యేకమైన ఫైర్‌క్రాకర్ రెడ్ కలర్ స్కీమ్‌తో వస్తుంది. అంతేకాకుండా గోల్డ్ అల్లాయ్ వీల్స్‌తో బైక్‌కు చక్కని కాంట్రాస్ట్‌ను జోడించాయి. స్టాండర్డ్ Z650RS బైక్ ఇంజిన్ మాదిరిగానే 649cc, సమాంతర-ట్విన్ ఇంజన్ లిమిటెడ్ ఎడిషన్‌కు శక్తినిస్తుంది. ఇది 67 బీహెచ్‌పీ వద్ద 8,000 rpmను ఉత్పత్తి చేయనుంది. 6,700 rpm వద్ద 64 Nm టార్క్‌ను అందిస్తోంది. ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు.
ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే..!
ఫీచర్ల విషయానికి వస్తే, Z650RS సెమీ-డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ (రెండు అనలాగ్ డయల్స్‌తో), ఆల్-LED ఇల్యూమినేషన్‌తో రానుంది. డ్యూయల్-ఛానల్ ABS వ్యవస్థను కల్గి ఉంది. కవాసకి Z650RS లిమిటెడ్ ఎడిషన్ బైక్ ముందు భాగంలో 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, వెనుక భాగంలో ప్రీలోడ్ అడ్జస్టబిలిటీతో బ్యాక్-లింక్‌ని పొందుతుంది. 300 మిమీ డ్యూయల్ ఫ్రంట్ డిస్క్‌లు, 220 ఎంఎం సింగిల్ రియర్ డిస్క్ బ్రేకింగ్ వ్యవస్థను మరింత దృడంగా మార్చుతాయి.
ధర ఎంతంటే..!
కవాసాకి స్పెషల్ ఎడిషన్ Z650RS ధర రూ. 6.79 లక్షలు ( ఢిల్లీ ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. ఈ ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్ బైక్ భారత్‌లో కేవలం 20 యూనిట్లు మాత్రమే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. కవాసకి ఇండియా సైట్ నుంచి కొనుగోలుదారులు బుకింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. డెలివరీలు మార్చి 2022 నుండి ప్రారంభం కానున్నాయి.
చదవండి: వాహనదారులకు షాకింగ్ న్యూస్..! మరోసారి ఇంధన ధరల పెంపు..ఎప్పటి నుంచంటే..?
Comments
Please login to add a commentAdd a comment