కవాసాకి కొత్త స్పోర్ట్స్‌ బైక్‌.. ధర ఎంతో తెలుసా! | Kawasaki Vulcan S India Launch Soon | Sakshi
Sakshi News home page

కవాసాకి కొత్త స్పోర్ట్స్‌ బైక్‌

Published Wed, Dec 27 2017 3:58 PM | Last Updated on Wed, Dec 27 2017 4:16 PM

Kawasaki Vulcan S India Launch Soon - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ:  కవాసాకి ఇండియా  కొత్త బైక్‌లాంచింగ్‌పై సూచనలు అందించింది.  త్వరలోనే స్పోర్టీ క్రూయిజర్‌ను  ఇండియాలో త్వరలో లాంచ్‌ చేయబోతోంది.  తన అధికారిక వెబ్ సైట్లో   ఈ విషయాన్ని వెల్లడించింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న  మోడల్‌ వుల్కాన్‌ 650ఎస్‌ క్రూయిజర్‌ గా  భావిస్తున్నారు. 2018 ఫిబ్రవరిలో జరగనున్న   ఆటో ఎక్స్‌పోలో దీన్ని లాంచ్‌ చేయనుందని సమాచారం. దీని ధర రూ. 5.5 లక్షలుగా ఉంటుందని అంచనా.

'ఎర్గో ఫిట్' సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వస్తున్న ఈ స్పోర్ట్స్ బైక్ రైడర్లకు  భిన్నమైన అనుభూతిని ఇవ్వనుంది.ముందువైపు  ట్రెడిషనల్‌ టెలిస్కోపిక్ ఫోర్క్స్‌ , వెనుకవైపు సెట్-సెట్ ఎడ్జస్టబుల్‌ మోనోషాక్ సస్పెన్షన్, లైట్‌ వైట్‌ చక్రాలు, హై ట్రాక్షన్‌​ టైర్లను అమర్చింది. యాంటి లాక్‌ బ్రేకింగ్‌ సిస్టం లాంటి స్టాండర్డ్‌ ఫీచర్‌తోపాటు  649 సీసీ ట్విన్‌ మోటార్‌,  సిక్స్‌ స్పీడ్‌ ట్రాన్స్‌మిషన్‌   తదితర ఫీచర్లు ప్రధానంగా  ఉంటాయి. ఇప్పటికే మార్కెట్‌లో అందుబాటులో ఉన్న నింజా 650, జెడ్‌ 650 పోలిన  ఫీచర్లను పోలిన ,మోటార్‌, ఇంజీన్‌ అమర్చింది. అయితే  62.8 ఎన్‌ఎం, 6600 ఆర్‌పీఎం టార్క్‌లాంటి భిన్నమైన ఫీచర‍్లను  జోడించింది.
హార్లే-డేవిడ్సన్ స్ట్రీట్ 750 ,  స్ట్రీట్ రాడ్ మోడల్‌ విభాగంలో  త్వరలో లాంచ్‌ కానున్న రాయల్ ఎన్‌ఫీల్డ్‌ 650సీసీ  ట్విన్ సిలిండర్ క్లాసిక్ బైక్‌కు  పోటీ ఇవ్వనుంది.




 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement