Kawasaki Motors
-
స్పోర్టీ లుక్‌లో 2023 కవాసాకి నింజా 650 బైక్: ధర తెలిస్తే షాకే!
సాక్షి, ముంబై: కవాసాకి మోటార్స్ స్పోర్ట్స్ బైక్ లవర్స్‌ను అకట్టుకునేలా కొత్త వెర్షన్ బైక్‌ను ఆవిష్కరించింది. కొత్త 2023 కవాసాకి నింజా 650ని భారతీయ మార్కెట్లో తీసుకొచ్చింది నింజా మిడ్-లెవల్ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్లో మార్కెట్లో మాంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో సరికొత్తగా తీర్చి దిద్ది స్పోర్టీ డిజైన్, కొత్త ఫీచర్లు, అప్డేట్స్తో కొత్త కవాసాకి 2023 నింజా 650నిలాంచ్ చేసింది. లైమ్ గ్రీన్ కలర్ ఆప్షన్లో అందుబాటులో ఉంటుంది. ఇదీ చదవండి: ఆ విషయంలో మనవాళ్లు చాలా వీక్! మీరు అంతేనా?తస్మాత్ జాగ్రత్త! 2023 కవాసాకి నింజా 650 ఇంజీన్, ఫీచర్లు స్పోర్టీ లుక్‌లో తీసుకొచ్చిన ఈ బూక్‌లో 649 సీసీ పార్లల్-ట్విన్ ఇంజన్‌ను జత చేసింది. ఇది 8,000 rpm వద్ద 68 పవర్‌ను, 6,700 rpm వద్ద 64 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. అలాగే విండ్‌షీల్డ్‌ను కొత్తగా డిజైన్ చేసింది. కొత్త డిజిటల్ TFT కలర్ ఇన్స్ట్రుమెంటేషన్, కాక్‌పిట్‌కు హై-టెక్, హై-గ్రేడ్ లుక్, ఇన్స్ట్రుమెంట్ ప్యానెల్లో ఇచ్చిన బ్లూటూత్ టెక్నాలజీతో రైడర్లు తమ బైక్‌ను వైర్‌లెస్‌గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది. ఇంకా కవాసాకి ట్రాక్షన్ కంట్రోల్‌తోపాటు, ట్విన్ ఎల్ఈడీ హెడ్లైట్లు,కొత్త డన్లప్ స్పోర్ట్‌మ్యాక్స్ రోడ్‌స్పోర్ట్ 2 టైర్లు అందించింది. (ఎయిర్‌పాడ్స్ మిస్, స్మార్ట్ ఆటో డ్రైవర్ ఏం చేశాడో తెలుసా?) ధర, లభ్యత దేశంలో ఈ బైక్ ధరను రూ.7.12 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ధర నిర్ణయించింది కవాసకి మోటార్స్. అన్ని అధీకృత డీలర్‌షిప్‌ల వద్ద ఇప్పటికే కొత్త నింజా 650 బుకింగ్‌లు మొదలు కాగా, డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. -
భారత్‌లో అమ్మేది కేవలం 20 బైక్స్ మాత్రమే..! ఈ బైక్ ఎందుకంత స్పెషల్ అంటే..!
ప్రముఖ టూవీలర్ తయారీ సంస్థ కవాసకి తన బైక్‌ల శ్రేణిలో ఐకానిక్ జెడ్1 మోటార్‌సైకిల్ 50 సంవత్సరాలను పూర్తి చేసుకున్న నేపథ్యంలో భారత మార్కెట్లలోకి కవాసకి Z650RS లిమిటెడ్ ఎడిషన్ బైక్‌ను కంపెనీ లాంచ్ చేసింది. భారత్‌లో కేవలం 20 యూనిట్లు మాత్రమే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. ప్రత్యేకమైన లుక్స్‌తో..! కవాసకి Z650RS లిమిటెడ్ ఎడిషన్ బైక్ ప్రత్యేకమైన లుక్స్‌తో మరింత ఆకర్షణీయంగా కన్పించనుంది. ఈ బైక్‌కు ప్రత్యేకమైన ఫైర్‌క్రాకర్ రెడ్ కలర్ స్కీమ్‌తో వస్తుంది. అంతేకాకుండా గోల్డ్ అల్లాయ్ వీల్స్‌తో బైక్‌కు చక్కని కాంట్రాస్ట్‌ను జోడించాయి. స్టాండర్డ్ Z650RS బైక్ ఇంజిన్ మాదిరిగానే 649cc, సమాంతర-ట్విన్ ఇంజన్ లిమిటెడ్ ఎడిషన్‌కు శక్తినిస్తుంది. ఇది 67 బీహెచ్పీ వద్ద 8,000 rpmను ఉత్పత్తి చేయనుంది. 6,700 rpm వద్ద 64 Nm టార్క్‌ను అందిస్తోంది. ఇంజిన్‌కు 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో జత చేశారు. ఇతర ఫీచర్స్ విషయానికి వస్తే..! ఫీచర్ల విషయానికి వస్తే, Z650RS సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ (రెండు అనలాగ్ డయల్స్‌తో), ఆల్-LED ఇల్యూమినేషన్‌తో రానుంది. డ్యూయల్-ఛానల్ ABS వ్యవస్థను కల్గి ఉంది. కవాసకి Z650RS లిమిటెడ్ ఎడిషన్ బైక్ ముందు భాగంలో 41 మిమీ టెలిస్కోపిక్ ఫోర్క్ సస్పెన్షన్, వెనుక భాగంలో ప్రీలోడ్ అడ్జస్టబిలిటీతో బ్యాక్-లింక్‌ని పొందుతుంది. 300 మిమీ డ్యూయల్ ఫ్రంట్ డిస్క్‌లు, 220 ఎంఎం సింగిల్ రియర్ డిస్క్ బ్రేకింగ్ వ్యవస్థను మరింత దృడంగా మార్చుతాయి. ధర ఎంతంటే..! కవాసాకి స్పెషల్ ఎడిషన్ Z650RS ధర రూ. 6.79 లక్షలు ( ఢిల్లీ ఎక్స్-షోరూమ్)గా ఉండనుంది. ఈ ప్రత్యేకమైన లిమిటెడ్ ఎడిషన్ బైక్ భారత్‌లో కేవలం 20 యూనిట్లు మాత్రమే కొనుగోలుదారులకు అందుబాటులో ఉండనున్నాయి. కవాసకి ఇండియా సైట్ నుంచి కొనుగోలుదారులు బుకింగ్స్ చేసుకోవాల్సి ఉంటుంది. డెలివరీలు మార్చి 2022 నుండి ప్రారంభం కానున్నాయి. చదవండి: వాహనదారులకు షాకింగ్ న్యూస్..! మరోసారి ఇంధన ధరల పెంపు..ఎప్పటి నుంచంటే..? -
కేసీఆర్ చెప్పినట్టే జరగబోతుందా? ఆ విషయంలో జట్టు కట్టిన యమహా, కవాసాకి
భవిష్యత్తులో పెట్రోలు, డీజిల్ వాహనాలు ఉండబోవంటూ తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఇటీవల ప్రెస్మీట్లో వ్యాఖ్యానించారు. ఆయన చెప్పినట్టే ఫ్యూచర్ ఉండబోతుందా ? అంటే అవును అన్నట్టుగానే వెహికల్ ఇండస్ట్రీలో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల వరి ధాన్యం కొనుగోలు అంశంపై ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు మాట్లాడుతూ.. టెక్నాలజీ వేగంగా మారుతుందని, త్వరలో రోడ్ల మీద పెట్రోలు , డీజిల్ వాహనాలు కనపించవన్నారు. రోడ్లపై కాలుష్యం వెదజల్లని ఎలక్ట్రిక్ వెహకిల్స్ మాత్రమే తిరుగుతాయన్నారు. తాను అటువంటి కారు ఒకటి కొన్నట్టు చెప్పారు. ఆయన మాటలకు నిజం కావడానికి ఎంతో కాలం పట్టేట్టుగా లేదు. ఇంతకాలం పెట్రోలు, డీజిల్‌లను ఉపయోగించే ఇంటర్నల్ కంబస్టన్ (ఐసీ) ఇంజన్లతో కార్లు, బైకులు, స్కూటర్లు తయారు చేస్తూ వచ్చిన సంస్థలన్నీ త్వరలో వాటికి ఫుల్స్టాప్ పెట్టబోతున్నట్టు సంకేతాలు ఇచ్చాయి. అంతేకాదు కాలుష్య రహిత ఇంజన్లను తయారు చేసేందుకు వీలుగా దశబ్ధాల తరబడి ఉన్న వైరాన్ని మరిచి జట్టు కట్టేందుకు సైతం రెడీ అయ్యాయి. కలిసికట్టుగా జపాన్‌లోని ఓకహాలో నవంబరు 13,14 తేదీల్లో ఇంటర్నల్ కంబస్టన్ (ఐసీ) ఇంజన్ల తయారీ సంస్థ సదస్సులో కీలక ప్రకటన వెలువడింది. ఐసీ ఇంజన్ల తయారీలో మార్కెట్ దిగ్గజ కంపెనీలైన కవాసాకి, యమహా, టయోటా, మజ్దా, సబరు కార్పొరేషన్లు కలిసి పని చేయాలని నిర్ణయించాయి. పరస్పరం సాంకేతిక సహకారం అందించుకుంటూ ఐసీ ఇంజన్ల స్థానంలో హైడ్రోజన్ ఇంజన్లు రెడీ చేస్తామంటూ సంయుక్త ప్రకటన జారీ చేశాయి. హైడ్రోజన్ ఇంజన్ డీజిల్, పెట్రోల్‌లకు ప్రత్యామ్నాయంగా హైడ్రోజన్‌ను ఉపయోగించే టెక్నాలజీ 2018లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వచ్చింది. అంతకు ముందు 2010 నుంచే హైడ్రోజన్‌తో వాహనాలు నడిచే ఇంజన్లను తయారు చేసే సాంకేతిక పరిజ్ఞానంపై కవాసాకి ప్రయోగాలు చేస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరం ముగిసేనాటికి హైడ్రోజన్ ఫ్యూయల్ ఇంజన్ అందుబాటులోకి తేనుంది. అనంతరం ఆ టెక్నాలజీనికి మిగిలిన కంపెనీలతో మరింత సమర్థంగా మార్చి కమర్షియల్ వెహికల్స్ మార్కెట్లోకి తేవాలని నిర్ణయించారు. ఒక్కసారి ఇంజన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత హోండా, సుజుకిలను కూడా ఇందులో భాగస్వాములను చేస్తామంటున్నారు. ఈవీ హవా ఇండియాలో ఉన్న బైకుల్లో నూటికి తొంభై శాతం జపాన్ కంపెనీలు తయారు చేసిన ఐసీ ఇంజన్లతోనే తయారవుతున్నాయి. కాగా ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ స్కూటర్ల మార్కెట్ పుంజుకుంటోంది. రోజుకో కొత్త స్టార్టప్ కంపెనీ ఈవీ బైకులు, స్కూటర్లతో మార్కెట్‌ని ముంచెత్తుతున్నాయి. దీంతో ఐసీ ఇంజన్ల వాహనాల మార్కెట్‌కి కోత పడుతోంది. రిలయన్స్ సైతం ఇక రియలన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ ఏకంగా హైడ్రోజన్ ఫ్యూయల్ ఉత్పత్తి చేసే రెండు గిగా ఫ్యాక్టరీలు నిర్మించబోతున్నట్టు ప్రకటించారు. ముఖేశ్‌తో పాటు అదానీ సైతం ఈ రంగంలో పోటీ పడుతున్నారు. ఫలితంగా రాబోయే రోజుల్లో ఎలక్ట్రిక్, హైడ్రోజన్ ఫ్యూయల్ ఇంజన్ల హవా నడవనుంది. ఒకప్పటి స్టీమ్ ఇంజన్ల తరహాలోనే పెట్రోలు, డీజిల్ ఇంజన్లు మూలన పడే పరిస్థితి ఎదురుకానుంది. చదవండి:ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్.. టెస్ట్ రైడ్‌కి మీరు సిద్ధమా? -
రెట్రో లుక్స్‌లో కవాసకి నుంచి అదిరిపోయే బైక్..!
2022 Kawasaki Z650rs Launched In India: ప్రముఖ జపనీస్ ఆటో మొబైల్ దిగ్గజం కవాసకి భారత మార్కెట్లలోకి సరికొత్త కవాసకి జెడ్650ఆర్ఎస్ బైక్‌ను లాంచ్ చేసింది. రెట్రో లుక్స్‌తో కవాసకి జెడ్650ఆర్ఎస్ బైక్ ప్రియులను ఇట్టే ఆకర్షించనుంది. ఈ బైక్ రెండు కలర్ వేరియంట్స్‌తో రానుంది. కాండీ ఎమరాల్డ్ గ్రీన్,మెటాలిక్ మూండస్ట్ గ్రే కలర్స్‌తో జెడ్650ఆర్ఎస్ లభించనుంది. చదవండి: టాటా మోటార్స్ అస్సలు తగ్గట్లేదుగా! కవాసకి జెడ్1 మోడల్ స్ఫూర్తితో ఈ బైక్‌ను కంపెనీ రూపొందించనట్లు తెలుస్తోంది. ఈ బైక్ ధర రూ. 6.65 లక్షలు. (ఎక్స్-షోరూమ్). న్యూ రెట్రో కవాసకి జెడ్650ఆర్ఎస్ బైక్ తన ప్రత్యర్థి బైక్ కంపెనీ ట్రయంఫ్ ట్రైడెంట్ 660 కంటే మరింత సరసమైన ధరకే లభించనున్నట్లు తెలుస్తోంది. కవాసకి జెడ్650ఆర్ఎస్ బైక్ విషయానికి వస్తే....నియో-రెట్రో డిజైన్ థీమ్ రౌండ్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్, కొత్త మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, డిజిటల్ రీడౌట్‌తో కూడిన ట్విన్-పాడ్ అనలాగ్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్‌తో రానుంది. స్లిమ్ పిన్‌స్ట్రైప్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్‌తో రెట్రో స్టైలింగ్ వచ్చేలా చేసింది. అంతేకాకుండా పొడవైన సింగిల్ సీటు రైడర్, పిలియన్(వెనుక కూర్చొన వారికి)లకు సౌకర్యవంతంగా ఉంటుంది. కొత్త కవాసకి జెడ్650ఆర్ఎస్ బైక్ ఇంజిన్ విషయానికి వస్తే...కవాసకి జెడ్650 బైక్ మాదిరిగానే 649సీసీ ట్విన్-సిలిండరన్ ఇంజిన్‌ను కల్గింది. 67బీహెచ్పీ సామర్థ్యంతో 8000 ఆర్‌పీఎమ్‌ను ఉత్పత్తి చేస్తోంది. 6700 ఆర్పీఎమ్ వద్ద 64ఎన్ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. బైక్ వెనుకవైపు ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్‌ను ఏర్పాటుచేశారు. డ్యూయల్ ఛానల్ ఎబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కల్గి ఉంది. కవాసకి జెడ్650తో పోలిస్తే, కవాసకి జెడ్650ఆర్ఎస్ 2022 వెర్షన్ దాదాపు రూ. 41,000 ఖరీదైనది. భారత్‌లో కవాసకి జెడ్650ఆర్ఎస్ 2022 వెర్షన్ బైక్స్ ప్రీ బుకింగ్స్ నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ నుంచి బైక్‌లను డెలివరీ చేయనున్నట్లు తెలుస్తోంది. చదవండి: 2022లో హోండా బ్యాటరీ షేరింగ్ సేవలు -
‘900 సీసీ బైక్ అయినా చక్కని శబ్దం’
సాక్షి, న్యూఢిల్లీ: కుర్రకారు జోష్‌కు తగ్గట్టు జపాన్‌కు చెందిన కవసాకి మోటార్ తయారీ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త బైక్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. మంగళవారం ‘జడ్ 900 ఆర్ఎస్’ మోడల్లో బ్లాక్ కలర్ వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. 1970 ప్రాంతంలో ద్విచక్ర వాహనాల తయారీలో కొత్త ఒరవడి సృష్టించిన ఈ సంస్థ, అప్పటి థీమ్‌లను అనుసరించి ‘జడ్ 900 ఆర్ఎస్’ను తయారు చేయడం విశేషం. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన క్యాండీ టోన్ ఆరెంజ్ కలర్ వేరియంట్‌కి మంచి ఆదరణ లభించినందునే నలుపు రంగు మోడల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఇండియా కవసాకి మేనేజింగ్ డైరెక్టర్ యుటకా యంషితా చెప్పారు. జపాన్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ సంఖ్యలో తయారు చేసిన ఆరెంజ్ కలర్ వేరియంట్‌కి భారతీయ సంపన్న వర్గాల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. 15.3 లక్షల రూపాయల (ఎక్స్ షోరూం) ధర గల ఈ బైక్ 900 సీసీ సామర్థ్యం కలిగి ఉందని ఆయన తెలిపారు. బైక్ నడిచేప్పుడు వాహనదారుడికి గొప్ప అనుభూతినిచ్చేందుకు ధ్వని ట్యూనింగ్పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు తెలిపారు. తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నా లోతైన ఎగ్జాస్టర్ (సైలెన్సర్) వల్ల ఇంజన్ శబ్దం ఆస్వాదించవచ్చని అన్నారు. అప్పటి మోడళ్లలో ఒకటైన జడ్1 ను అనుకరించి కొత్త మోడళ్లకు రూపకల్ప చేసినట్టు యంషితా పేర్కొన్నారు. జడ్ 900 ఆర్ఎస్ ఫీచర్లు: నాలుగు సిలిండర్లు గల ఇంజిన్ కవసాకి ట్రాక్షన్ కంట్రోల్ ఎల్ఈడీ హెడ్ లైట్ మల్టీ ఫంక్షన్ ఎల్ఈడీ స్క్రీన్ -
హైఎండ్ బైక్‌ల విక్రయాలు పెరుగుతాయి
కోల్‌కతా: కవాసాకి మోటార్స్ ఇండియా తన హైఎండ్ బైక్స్ విక్రయాలపై పూర్తి ఆశావహంగా ఉంది. భారత్‌లో ప్రీమియం బైక్‌ల విభాగంలో మార్కెట్‌ను మరింత పెంచుకోవాలని ప్రయత్నిస్తోంది. ‘పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమలు చేసినా కూడా ఇండియాలో ప్రీమియం బైక్స్ అమ్మకాల వృద్ధిపై నమ్మకంగా ఉన్నాం. అలాగే మరొకవైపు ప్రజల ఆదాయం కూడా పెరుగుతోంది. ఇది కూడా మాకు సానుకూలాంశం’ అని కవాసాకి మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ యుతకా యమాషితా తెలిపారు. ప్రీమియం బైక్ మార్కెట్లో ప్రతి ఏడాది 30 శాతంమేర వృద్ధి నమోదు కావొచ్చని అంచనా వేశారు. కాగా కవాసాకి ప్రస్తుతం తన పుణే ప్లాంటులో 300 సీసీ– 1,400 సీసీ శ్రేణిలో ఇంజిన్ సామర్థ్యం కలిగిన బైక్స్‌ను అసెంబుల్ చేస్తోంది. కంపెనీ 2017 ఏప్రిల్ నుంచి 1,500 యూనిట్ల బైక్స్‌ను భారత్‌లో విక్రయించింది. దీనికి దేశవ్యాప్తంగా 22 డీలర్షిప్స్ ఉన్నాయి. కాగా కవాసాకి గతంలో బజాజ్ ఆటోతో కుదుర్చుకున్న సేల్స్ అండ్ సర్వీసింగ్ ఒప్పందానికి గతేడాది ఏప్రిల్‌లో ముగింపు పలికిన విషయం తెలిసిందే. -
కవాసాకి కొత్త స్పోర్ట్స్ బైక్.. ధర ఎంతో తెలుసా!
సాక్షి, న్యూఢిల్లీ: కవాసాకి ఇండియా కొత్త బైక్లాంచింగ్పై సూచనలు అందించింది. త్వరలోనే స్పోర్టీ క్రూయిజర్‌ను ఇండియాలో త్వరలో లాంచ్ చేయబోతోంది. తన అధికారిక వెబ్ సైట్లో ఈ విషయాన్ని వెల్లడించింది. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న మోడల్ వుల్కాన్ 650ఎస్ క్రూయిజర్ గా భావిస్తున్నారు. 2018 ఫిబ్రవరిలో జరగనున్న ఆటో ఎక్స్‌పోలో దీన్ని లాంచ్ చేయనుందని సమాచారం. దీని ధర రూ. 5.5 లక్షలుగా ఉంటుందని అంచనా. 'ఎర్గో ఫిట్' సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వస్తున్న ఈ స్పోర్ట్స్ బైక్ రైడర్లకు భిన్నమైన అనుభూతిని ఇవ్వనుంది.ముందువైపు ట్రెడిషనల్ టెలిస్కోపిక్ ఫోర్క్స్ , వెనుకవైపు సెట్-సెట్ ఎడ్జస్టబుల్ మోనోషాక్ సస్పెన్షన్, లైట్ వైట్ చక్రాలు, హై ట్రాక్షన్ టైర్లను అమర్చింది. యాంటి లాక్ బ్రేకింగ్ సిస్టం లాంటి స్టాండర్డ్ ఫీచర్‌తోపాటు 649 సీసీ ట్విన్ మోటార్, సిక్స్ స్పీడ్ ట్రాన్స్మిషన్ తదితర ఫీచర్లు ప్రధానంగా ఉంటాయి. ఇప్పటికే మార్కెట్లో అందుబాటులో ఉన్న నింజా 650, జెడ్ 650 పోలిన ఫీచర్లను పోలిన ,మోటార్, ఇంజీన్ అమర్చింది. అయితే 62.8 ఎన్ఎం, 6600 ఆర్పీఎం టార్క్లాంటి భిన్నమైన ఫీచర్లను జోడించింది. హార్లే-డేవిడ్సన్ స్ట్రీట్ 750 , స్ట్రీట్ రాడ్ మోడల్ విభాగంలో త్వరలో లాంచ్ కానున్న రాయల్ ఎన్ఫీల్డ్ 650సీసీ ట్విన్ సిలిండర్ క్లాసిక్ బైక్‌కు పోటీ ఇవ్వనుంది. -
కవాసకి ‘వెర్సిస్–ఎక్స్ 300’
న్యూఢిల్లీ: జపాన్‌కు చెందిన ‘కవాసకి మోటార్స్’ తాజాగా ‘వెర్సిస్–ఎక్స్ 300’ బైక్‌ను మార్కెట్లోకి తీసుకువచ్చింది. దీని ధర రూ.4.6 లక్షలు (ఎక్స్‌షోరూమ్ ముంబై/ఢిల్లీ). కంపెనీ నుంచి అందుబాటు ధరలో వస్తోన్న మూడో బైక్ ఇది. అడ్వెంచర్ టూరింగ్ మోటార్ సైకిల్స్ విభాగానికి చెందిన ఈ బైక్‌ను ఏ రోడ్డుపైనైనా ఏ సమయంలోనైనా మంచి పనితీరు కనబరచే విధంగా రూపొందించామని కంపెనీ తెలిపింది. పుణేలోని చకన్ ప్లాంటులో ఈ బైక్‌ను అసెంబుల్ చేస్తున్నామని పేర్కొంది. టూరింగ్ విభాగంలో తక్కువ ఇంజిన్ సామర్థ్యంతో (300 సీసీ) వస్తోన్న బైక్ ఇదని కవాసకి మోటార్స్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్ యుటక యమషిట తెలిపారు. లాంగ్ ట్రావెల్ సస్పెన్షన్, వైడ్ రిచ్ బార్స్, లో–సిట్, 4–స్ట్రోక్ పారెలల్ ట్విన్ సిలిండర్ ఇంజిన్, హీట్ మేనేజ్మెంట్ టెక్నాలజీ వంటి పలు ఫీచర్లను కలిగిన ఈ బైక్ తన ప్రత్యేకతలతో కస్టమర్లను ఆకర్షిస్తుందని ధీమా వ్యక్తంచేశారు. దేశవ్యాప్తంగా ఉన్న 22 షోరూమ్‌లలో వెర్సిస్–ఎక్స్ 300 బైక్స్ బుకింగ్‌లను ప్రారంభించామని తెలిపారు. -
మార్చికల్లా మరో రెండు మోడళ్లు
ఇండియా కవాసాకి మోటార్స్ డిప్యూటీ ఎండీ నిశికవా హైదరాబాద్, బిజినెస్ బ్యూరో : ద్విచక్ర వాహన తయారీలో ఉన్న జపాన్ కంపెనీ కవాసాకి భారత్‌లో ఈ ఆర్థిక సంవత్సరం మరో రెండు కొత్త మోడళ్లను ప్రవేశపెట్టనుంది. కవాసాకి భారత్‌లో ప్రస్తుతం 300 సీసీ ఆపైన మొత్తం 11 మోడళ్లను విక్రయిస్తోంది. విదేశాల నుంచి పూర్తిగా తయారైన 7 మోడళ్లను ఎక్స్‌క్లూజివ్ ఔట్లెట్ల ద్వారా, విడిభాగాలను దిగుమతి చేసుకుని అసెంబుల్ చేసి 4 మోడళ్లను బజాజ్ షోరూంల ద్వారా అమ్ముతోంది. హైదరాబాద్‌తో కలిపి కవాసాకీకి 8 ఎక్స్‌క్లూజివ్ షోరూంలు ఉన్నాయి. మార్చికల్లా మరో రెండు మోడళ్లను తీసుకొస్తామని ఇండియా కవాసాకి మోటార్స్ డిప్యూటీ ఎండీ షిగెటో నిశికవా వెల్లడించారు. 2016-17లో మూడు మోడళ్లను విడుదల చేస్తామన్నారు. ‘దేశవ్యాప్తంగా వివిధ కంపెనీల 500 సీసీ ఆపై సామర్థ్యంగల బైక్స్ నెలకు 700 అమ్ముడవుతున్నాయి. వృద్ధి రేటు 20 శాతముంది. కవాసాకి కి 10 శాతం వాటా ఉంది. 2015లో 20 శాతం వాటా లక్ష్యంగా చేసుకున్నాం’ అని తెలిపారు. శ్రీ వినాయక బజాజ్ ఏర్పాటు చేసిన కవాసాకి ఎక్స్‌క్లూజివ్ షోరూంను ప్రారంభించేందుకు బుధవారం ఆయన హైదరాబాద్ వచ్చారు. హైదరాబాద్‌లో 200 యూనిట్లు..: ప్రస్తుతం నెలకు 10 కవాసాకి వాహనాలు విక్రయిస్తున్నట్టు శ్రీ వినాయక బజాజ్ గ్రూప్ ఎండీ కె.వి.బాబుల్ రెడ్డి తెలిపారు. 2015-16లో మొత్తం 200 యూనిట్లు ఆశిస్తున్నట్టు చెప్పారు. బజాజ్ వాహనాల విక్రయం పరంగా దేశంలో టాప్-5లో ఉన్నామన్నారు. బజాజ్ టూవీలర్ల కోసం 10 షోరూంలు, త్రీ వీలర్లకు 5, కేటీఎంకు 4, కవాసాకి ఒక షోరూంను గ్రూప్ నిర్వహిస్తోంది. నెలకు 600 త్రిచక్ర, 1,100 ద్విచక్ర వాహనాలను విక్రయిస్తోంది. భారత్‌కు కవాసాకి 100-150 సీసీ టూవీలర్లు! కవాసాకి భారత్‌లో తిరిగి 100-150 సీసీ విభాగంలోకి ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. 1998-2006 మధ్య బజాజ్ భాగస్వామ్యంతో ‘కాలిబర్’ బైక్‌ను విక్రయించిన సంగతి తెలిసిందే. భారత మార్కెట్‌పై ఫోకస్ చేసిన కవాసాకి తన బ్రాండ్ పాపులారిటీని వినియోగించుకోవాలని చూస్తోంది. ప్రస్తుతం ఇండోనేసియా, ఫిలిప్పైన్స్ మార్కెట్లలో 100-150 సీసీ బైక్‌లు, స్కూటర్లను అమ్ముతోంది. వీటిని భారత్‌లో ప్రవేశపెట్టేయోచన వుందని కంపెనీ వర్గాలు వెల్లడించాయి. అయితే ఎప్పుడు వీటిని భారత్‌లో ప్రవేశపెడతారన్న ప్రశ్నకు షిగెటో నిశికవా సమాధానం దాటవేశారు.