2022 Kawasaki Z650rs Launched In India: ప్రముఖ జపనీస్ ఆటో మొబైల్ దిగ్గజం కవాసకి భారత మార్కెట్లలోకి సరికొత్త కవాసకి జెడ్650ఆర్‌ఎస్ బైక్‌ను లాంచ్ చేసింది. రెట్రో లుక్స్‌తో కవాసకి జెడ్650ఆర్‌ఎస్ బైక్ ప్రియులను ఇట్టే ఆకర్షించనుంది. ఈ బైక్ రెండు కలర్ వేరియంట్స్‌తో రానుంది. కాండీ ఎమరాల్డ్ గ్రీన్,మెటాలిక్ మూండస్ట్ గ్రే కలర్స్‌తో జెడ్650ఆర్‌ఎస్ లభించనుంది.
చదవండి: టాటా మోటార్స్ అస్సలు తగ్గట్లేదుగా!
కవాసకి జెడ్1 మోడల్ స్ఫూర్తితో ఈ బైక్‌ను కంపెనీ రూపొందించనట్లు తెలుస్తోంది. ఈ బైక్ ధర రూ. 6.65 లక్షలు. (ఎక్స్-షోరూమ్). న్యూ రెట్రో కవాసకి జెడ్650ఆర్‌ఎస్ బైక్ తన ప్రత్యర్థి బైక్ కంపెనీ ట్రయంఫ్ ట్రైడెంట్ 660 కంటే మరింత సరసమైన ధరకే లభించనున్నట్లు తెలుస్తోంది.
కవాసకి జెడ్650ఆర్‌ఎస్ బైక్ విషయానికి వస్తే....నియో-రెట్రో డిజైన్ థీమ్ రౌండ్ ఎల్‌ఈడీ హెడ్‌ల్యాంప్, కొత్త మల్టీ-స్పోక్ అల్లాయ్ వీల్స్, డిజిటల్ రీడౌట్‌తో కూడిన ట్విన్-పాడ్ అనలాగ్ ఇన్‌స్ట్రుమెంట్ కన్సోల్‌తో రానుంది. స్లిమ్ పిన్‌స్ట్రైప్ ఫ్యూయల్ ట్యాంక్ డిజైన్‌తో రెట్రో స్టైలింగ్ వచ్చేలా చేసింది. అంతేకాకుండా పొడవైన సింగిల్ సీటు రైడర్, పిలియన్(వెనుక కూర్చొన వారికి)లకు సౌకర్యవంతంగా ఉంటుంది.
కొత్త కవాసకి జెడ్650ఆర్‌ఎస్ బైక్ ఇంజిన్ విషయానికి వస్తే...కవాసకి జెడ్650 బైక్ మాదిరిగానే 649సీసీ ట్విన్-సిలిండరన్ ఇంజిన్‌ను కల్గింది. 67బీహెచ్‌పీ సామర్థ్యంతో 8000 ఆర్‌పీఎమ్‌ను ఉత్పత్తి చేస్తోంది. 6700 ఆర్‌పీఎమ్ వద్ద 64ఎన్‌ఎమ్ గరిష్ట టార్క్‌ను ఉత్పత్తి చేయనుంది. బైక్ వెనుకవైపు ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ మోనోషాక్‌ను ఏర్పాటుచేశారు.
డ్యూయల్ ఛానల్ ఎబీఎస్ బ్రేకింగ్ సిస్టమ్‌ను కల్గి ఉంది. కవాసకి జెడ్650తో పోలిస్తే, కవాసకి జెడ్650ఆర్‌ఎస్ 2022 వెర్షన్ దాదాపు రూ. 41,000 ఖరీదైనది. భారత్‌లో కవాసకి జెడ్650ఆర్‌ఎస్ 2022 వెర్షన్ బైక్స్ ప్రీ బుకింగ్స్ నేటి నుంచి ప్రారంభంకానున్నాయి. డిసెంబర్ నుంచి బైక్లను డెలివరీ చేయనున్నట్లు తెలుస్తోంది.
చదవండి: 2022లో హోండా బ్యాటరీ షేరింగ్ సేవలు
Comments
Please login to add a commentAdd a comment