2023 Kawasaki Ninja 650 sports bike launched in India, check price and features
Sakshi News home page

స్పోర్టీ లుక్‌లో 2023 కవాసాకి నింజా 650 బైక్: ధర తెలిస్తే షాకే!

Published Wed, Nov 16 2022 1:02 PM | Last Updated on Wed, Nov 16 2022 4:13 PM

2023 Kawasaki Ninja 650 launched India check price features - Sakshi

సాక్షి, ముంబై: కవాసాకి మోటార్స్‌  స్పోర్ట్స్ బైక్  లవర్స్‌ను అకట్టుకునేలా కొత్త వెర్షన్‌ బైక్‌ను  ఆవిష్కరించింది.  కొత్త 2023 కవాసాకి నింజా 650ని భారతీయ మార్కెట్లో తీసుకొచ్చింది నింజా మిడ్-లెవల్ స్పోర్ట్స్ బైక్ సెగ్మెంట్‌లో మార్కెట్‌లో మాంచి ఆదరణ పొందింది. ఈ నేపథ్యంలో సరికొత్తగా తీర్చి దిద్ది  స్పోర్టీ డిజైన్,  కొత్త ఫీచర్లు, అప్‌డేట్స్‌తో కొత్త  కవాసాకి 2023 నింజా 650నిలాంచ్‌ చేసింది. లైమ్ గ్రీన్ కలర్ ఆప్షన్‌లో అందుబాటులో ఉంటుంది.

ఇదీ చదవండి: ఆ విషయంలో మనవాళ్లు చాలా వీక్‌! మీరు అంతేనా?తస్మాత్‌ జాగ్రత్త!

2023 కవాసాకి నింజా 650   ఇంజీన్‌, ఫీచర్లు
స్పోర్టీ లుక్‌లో తీసుకొచ్చిన ఈ  బూక్‌లో 649 సీసీ పార్లల్‌-ట్విన్ ఇంజన్‌ను జత చేసింది. ఇది  8,000 rpm వద్ద 68 పవర్‌ను, 6,700 rpm వద్ద 64 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది.  అలాగే విండ్‌షీల్డ్‌ను కొత్తగా డిజైన్‌ చేసింది. కొత్త డిజిటల్ TFT కలర్ ఇన్‌స్ట్రుమెంటేషన్, కాక్‌పిట్‌కు హై-టెక్, హై-గ్రేడ్ లుక్‌, ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్‌లో ఇచ్చిన బ్లూటూత్ టెక్నాలజీతో రైడర్‌లు తమ బైక్‌ను వైర్‌లెస్‌గా కనెక్ట్ అయ్యేలా చేస్తుంది.  ఇంకా కవాసాకి ట్రాక్షన్ కంట్రోల్‌తోపాటు,  ట్విన్ ఎల్‌ఈడీ హెడ్‌లైట్లు,కొత్త డన్‌లప్ స్పోర్ట్‌మ్యాక్స్ రోడ్‌స్పోర్ట్ 2 టైర్లు అందించింది. (ఎయిర్‌పాడ్స్‌ మిస్‌, స్మార్ట్‌ ఆటో డ్రైవర్‌ ఏం చేశాడో తెలుసా?)

ధర, లభ్యత
దేశంలో ఈ బైక్‌ ధరను రూ.7.12 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ధర నిర్ణయించింది కవాసకి మోటార్స్. అన్ని అధీకృత డీలర్‌షిప్‌ల వద్ద ఇప్పటికే  కొత్త నింజా 650 బుకింగ్‌లు మొదలు కాగా,  డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement