జడ్ 900 ఆర్‌ఎస్, బ్లాక్ కలర్ వేరియంట్
సాక్షి, న్యూఢిల్లీ: కుర్రకారు జోష్‌కు తగ్గట్టు జపాన్‌కు చెందిన కవసాకి మోటార్ తయారీ సంస్థ ఇండియన్ మార్కెట్లోకి సరికొత్త బైక్ మోడల్‌ను ప్రవేశపెట్టింది. మంగళవారం ‘జడ్ 900 ఆర్‌ఎస్’ మోడల్‌లో బ్లాక్ కలర్ వేరియంట్‌ను అందుబాటులోకి తెచ్చింది. 1970 ప్రాంతంలో ద్విచక్ర వాహనాల తయారీలో కొత్త ఒరవడి సృష్టించిన ఈ సంస్థ, అప్పటి థీమ్‌లను అనుసరించి ‘జడ్ 900 ఆర్‌ఎస్’ను తయారు చేయడం విశేషం. ఫిబ్రవరిలో ప్రవేశపెట్టిన క్యాండీ టోన్ ఆరెంజ్ కలర్ వేరియంట్‌కి మంచి ఆదరణ లభించినందునే నలుపు రంగు మోడల్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు ఇండియా కవసాకి మేనేజింగ్ డైరెక్టర్ యుటకా యంషితా చెప్పారు.
జపాన్ మార్కెట్‌ను దృష్టిలో పెట్టుకుని అతి తక్కువ సంఖ్యలో తయారు చేసిన ఆరెంజ్ కలర్ వేరియంట్‌కి భారతీయ సంపన్న వర్గాల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. 15.3 లక్షల రూపాయల (ఎక్స్ షోరూం) ధర గల ఈ బైక్ 900 సీసీ సామర్థ్యం కలిగి ఉందని ఆయన తెలిపారు. బైక్ నడిచేప్పుడు వాహనదారుడికి గొప్ప అనుభూతినిచ్చేందుకు ధ్వని ట్యూనింగ్‌పై ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నట్టు తెలిపారు. తక్కువ వేగంతో ప్రయాణిస్తున్నా లోతైన ఎగ్జాస్టర్ (సైలెన్సర్) వల్ల ఇంజన్ శబ్దం ఆస్వాదించవచ్చని అన్నారు. అప్పటి మోడళ్లలో ఒకటైన జడ్1 ను అనుకరించి కొత్త మోడళ్లకు రూపకల్ప చేసినట్టు యంషితా పేర్కొన్నారు.
జడ్ 900 ఆర్‌ఎస్ ఫీచర్లు:
నాలుగు సిలిండర్లు గల ఇంజిన్
కవసాకి ట్రాక్షన్ కంట్రోల్
ఎల్‌ఈడీ హెడ్ లైట్
మల్టీ ఫంక్షన్ ఎల్‌ఈడీ స్క్రీన్
Comments
Please login to add a commentAdd a comment