రూ.1.32 లక్షల కవాసకి బైక్ - వివరాలు | Kawasaki New Bike W175 Street Details | Sakshi
Sakshi News home page

రూ.1.32 లక్షల కవాసకి బైక్ - వివరాలు

Published Sat, Dec 9 2023 9:28 PM | Last Updated on Sat, Dec 9 2023 9:29 PM

Kawasaki New Bike W175 Street Details - Sakshi

భారతీయ మార్కెట్లో అత్యంత ప్రజాదరణ పొందిన జపనీస్ బైక్ తయారీ సంస్థ కవాసకి.. ఎట్టకేలకు దేశీయ విఫణిలో ఓ సరికొత్త బైక్ లాంచ్ చేసింది. ఈ బైక్ దాని మునుపటి మోడల్స్ కంటే తక్కువ ధర వద్ద అందుబాటులో ఉంది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.

ఇండియన్ మార్కెట్లో విడుదలైన కొత్త కవాసకి బైక్ పేరు 'డబ్ల్యూ175 స్టీట్'. దీని ధర రూ. 1.35 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఇది దాని స్టాండర్డ్ మోడల్ కంటే కూడా రూ. 12000 తక్కువ ధరకే లభిస్తుంది. బుకింగ్స్, డెలివరీలకు సంబంధించిన వివరాలు కంపెనీ అధికారికంగా వెల్లడించలేదు.

సింపుల్ డిజైన్ కలిగిన ఈ బైక్ బ్లాక్-అవుట్ ఫినిషింగ్‌లతో చూడటానికి ఆకర్షణీయంగా ఉంటుంది. ఇందులో 177 సీసీ ఎయిర్-కూల్డ్ సింగిల్-సిలిండర్ ఇంజన్ ఉంటుంది. ఇది 13 హార్స్ పవర్, 13.2 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. పనితీరు పరంగా అద్భుతంగా ఉండవచ్చని తెలుస్తోంది.

ఇదీ చదవండి: ఈ బైక్ కొనుగోలుపై రూ.60,000 డిస్కౌంట్..

కవాసకి డబ్ల్యూ175 స్టీట్ బైక్ హాలోజన్ హెడ్‌లైట్, అనలాగ్ ఇన్‌స్ట్రుమెంటేషన్‌ వంటివి పొందుతుంది. డిజైన్, ఫీచర్స్ పరంగా అద్భుతంగా ఉన్న ఈ బైక్ తక్కువ ధర వద్ద విడులవడంతో మంచి అమ్మకాలను పొందుతుందని భావిస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement