భారత్‌లో రూ.13.49 లక్షల బైక్ లాంచ్: బుకింగ్స్ షురూ | Kawasaki Ninja 1100SX Launched at Rs 13 49 Lakh | Sakshi
Sakshi News home page

భారత్‌లో రూ.13.49 లక్షల బైక్ లాంచ్: బుకింగ్స్ షురూ

Published Sat, Dec 21 2024 9:20 PM | Last Updated on Sat, Dec 21 2024 9:24 PM

Kawasaki Ninja 1100SX Launched at Rs 13 49 Lakh

కవాసకి దేశీయ మార్కెట్లో 2025 నింజా 1100ఎస్ఎక్స్ లాంచ్ చేసింది. దీని ధర రూ.13.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభమైనప్పటికీ.. డెలివరీలు వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.

నింజా 1100ఎస్ఎక్స్ బైక్ లిక్విడ్ కూల్డ్, 1099సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 9000 rpm వద్ద, 136 హార్స్ పవర్ & 7600 rpm వద్ద 113 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌ పొందుతుంది. కాబట్టి ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.

చూడటానికి కవాసకి నింజా దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇది కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఇందులో ట్విన్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, షార్ప్ అండ్ అగ్రెసివ్ ఫ్రంట్ ఫెయిరింగ్ వంటివన్నీ ఉన్నాయి. ఇందులో 4.3 ఇంచెస్ TFT డిస్‌ప్లే ఉంటుంది. ఇది కాల్స్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వంటి వాటిని చూపిస్తుంది. అంతే కాకుండా ఈ బైకులో క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, మల్టిపుల్ పవర్ మోడ్‌లు, హ్యాండిల్‌బార్ మౌంటెడ్ USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా ఉన్నాయి.

ఇదీ చదవండి: రూ.5 లక్షలు పెరిగిన ధర.. ఇప్పుడు ఈ కారు రేటెంతో తెలుసా?

మార్కెట్లో లాంచ్ అయిన కొత్త కవాసకి నింజా 1100ఎస్ఎక్స్ బైకుకు ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. అయితే ధర పరంగా ట్రయంఫ్ రోడ్-బియాస్డ్ టైగర్ 900 జీటీ పోటీపడుతోంది. కాగా ఈ బైక్ కోసం కవాసకి డీలర్‌షిప్‌లలో రూ. 50,000 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement