Kawasaki Ninja
-
భారత్‌లో రూ.13.49 లక్షల బైక్ లాంచ్: బుకింగ్స్ షురూ
కవాసకి దేశీయ మార్కెట్లో 2025 నింజా 1100ఎస్ఎక్స్ లాంచ్ చేసింది. దీని ధర రూ.13.49 లక్షలు (ఎక్స్-షోరూమ్). ఈ బైక్ కోసం బుకింగ్స్ ప్రారంభమైనప్పటికీ.. డెలివరీలు వచ్చే ఏడాది ప్రారంభంలో మొదలయ్యే అవకాశం ఉందని సమాచారం.నింజా 1100ఎస్ఎక్స్ బైక్ లిక్విడ్ కూల్డ్, 1099సీసీ ఇంజిన్ పొందుతుంది. ఇది 9000 rpm వద్ద, 136 హార్స్ పవర్ & 7600 rpm వద్ద 113 న్యూటన్ మీటర్ టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. కాబట్టి ఇది దాని మునుపటి మోడల్ కంటే కూడా ఉత్తమ పనితీరును అందిస్తుందని భావిస్తున్నాము.చూడటానికి కవాసకి నింజా దాని మునుపటి మోడల్ మాదిరిగా ఉన్నప్పటికీ.. ఇది కొన్ని కాస్మొటిక్ అప్డేట్స్ పొందుతుంది. ఇందులో ట్విన్ ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్‌లు, షార్ప్ అండ్ అగ్రెసివ్ ఫ్రంట్ ఫెయిరింగ్ వంటివన్నీ ఉన్నాయి. ఇందులో 4.3 ఇంచెస్ TFT డిస్ప్లే ఉంటుంది. ఇది కాల్స్, ఎస్ఎమ్ఎస్ అలర్ట్ వంటి వాటిని చూపిస్తుంది. అంతే కాకుండా ఈ బైకులో క్రూయిజ్ కంట్రోల్, ట్రాక్షన్ కంట్రోల్, మల్టిపుల్ పవర్ మోడ్లు, హ్యాండిల్‌బార్ మౌంటెడ్ USB ఛార్జింగ్ పోర్ట్ వంటివి కూడా ఉన్నాయి.ఇదీ చదవండి: రూ.5 లక్షలు పెరిగిన ధర.. ఇప్పుడు ఈ కారు రేటెంతో తెలుసా?మార్కెట్లో లాంచ్ అయిన కొత్త కవాసకి నింజా 1100ఎస్ఎక్స్ బైకుకు ప్రత్యక్ష ప్రత్యర్థులు లేదు. అయితే ధర పరంగా ట్రయంఫ్ రోడ్-బియాస్డ్ టైగర్ 900 జీటీ పోటీపడుతోంది. కాగా ఈ బైక్ కోసం కవాసకి డీలర్‌షిప్‌లలో రూ. 50,000 టోకెన్ మొత్తంతో బుక్ చేసుకోవచ్చు. -
భారత్‌లో అత్యంత ఖరీదైన బైకులు ఇవే! (ఫోటోలు)
-
ఈ బైక్స్ కొనుగోలుపై గొప్ప బెనిఫీట్స్
కవాసకి తన నింజా లైనప్‌లోని మూడు మోడళ్లపై గొప్ప డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్స్ ఆన్-రోడ్ ధరకు వర్తించే వోచర్ల రూపంలో లేదా డీలర్‌షిప్‌ల వద్ద యాక్ససరీస్, సర్వీస్ ప్యాకేజీలను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు.నింజా 300, నింజా 500 కొనుగోలుపైన వినియోగదారుడు రూ. 10000 వోచర్ పొందవచ్చు. అయితే నింజా 650 కొనుగోలుపైన రూ. 25000 వోచర్ పొందవచ్చు. కవాసకి తన బైకులపై డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందించడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో కూడా ఇలాబీటి ఆఫర్స్ ప్రకటించింది.కవాసకి నింజా 650 బైక్ ధర రూ.7.16 లక్షలు. నింజా 300, నింజా 500 ధరలు వరుసగా రూ.3.43 లక్షలు, రూ.5.24 లక్షలు. ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఈ బైక్స్.. అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతాయి. పర్ఫామెన్స్ పరంగా కూడా ఇవి చాలా ఉత్తమంగా ఉంటాయని తెలుస్తోంది. కవాసకి అందిస్తున్న ఈ ఆఫర్స్ సెప్టెంబర్ 1 నుండి 30 వరకు మాత్రమే చెల్లుతాయి. -
దేశంలో ఖరీదైన స్పోర్ట్స్ బైక్స్: ధోని ఫేవరెట్ ఏంటో తెలుసా?
యువతకు స్పోర్ట్స్ బైక్స్ అంటే యమా క్రేజ్. రోడ్లపై రయ్.. రయ్ దూసుకుపోవడం అంటే వారికి భలే సరదా. బైక్స్ కంపెనీలు కూడా కొత్త మోడల్స్‌ను మార్కెట్లో దించుతూ యువతను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. భారతదేశంలో అందుబాటులో ఉన్న ఖరీదైన కొన్ని స్పోర్ట్స్ బైక్స్ వివరాలు ఇక్కడ చూద్దాం.. బ్రాండ్ ధోని మన దేశంలో స్పోర్ట్స్ బైక్స్ లవర్స్ పేర్లు చెప్పాల్సి వస్తే మొదటి గుర్తొచ్చేది టీమిండియా మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనినే. ఖాళీ సమయాల్లో రాంచీ వీధుల్లో బైక్స్పైన చక్కర్లు కొట్టడం ధోనికి ఇష్టం. ఖరీదైన కార్లకు తోడు ఖరీదైన బైక్స్ కూడా అతని గారేజీలో కొలువై ఉంటాయి. కవాసకి నింజా హెచ్2, కాన్ఫిడరేట్ ఎక్స్ 132 హెల్‌క్యాట్, హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్‌బాయ్, డుకాటి 1098, సుజుకి హయబుస తదితర బైక్‌లు ధోని కలెక్షన్లో ఉన్నాయి. (చదవండి: బైక్ కొనుగోలుదారులకు హీరో మోటోకార్ప్ షాక్!) ఇక బాలీవుడ్ విషయానికి వస్తే జాన్ అబ్రహం పెద్ద బైక్ లవర్ అని చెప్పవచ్చు. అతని వద్ద ఉన్న బైక్స్ విలువ కోటిన్నర రూపాయల వరకూ ఉంటుందని చెబుతారు. కవాసకి నింజా జెడ్ఎక్స్-14 ఆర్, అప్రిల్లా ఆర్ఎస్వీ 4 తదితర బైక్‌లు అతని వద్ద ఉన్నాయి. షాహిద్ కపూర్ కూడా బైక్స్ లవరే. షూటింగ్ లేని సమయాల్లో అతను బైక్స్‌పైనే లాంగ్ డ్రైవ్స్‌కు వెళతాడు. షాహిద్ వద్ద బీఎండబ్ల్యూ 310 ఆర్, హార్లీ డేవిడ్సన్ ఫ్యాట్ బాయ్ లాంటి ఖరీదైన మోటార్‌సైకిల్స్ ఉన్నాయి. ఇక బైక్స్ లవర్స్ లిస్ట్‌లో మాధవన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్, సైఫ్ అలీఖాన్ తదితరులు ఉన్నారు. కవాసకి నింజా హెచ్2ఆర్ ఇంజిన్ కెపాసిటి : 998 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 216 కిలోలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 17 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 305.75 బీహెచ్పీ, 14,000 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 79,90,000 బీఎండబ్ల్యూ ఎం 1000 ఆర్ఆర్ ఇంజిన్ కెపాసిటీ : 999 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 192 కిలోలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 16.5 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 209.19 బీహెచ్పీ, 14,500 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 42,00,000 హోండా గోల్డ్‌వింగ్ ఇంజిన్ కెపాసిటి : 1,833 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 385 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 21.1 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 124.7 బీహెచ్పీ, 5,500 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 37,75,000 హార్లీడేవిడ్సన్ రోడ్ కింగ్ ఇంజిన్ కెపాసిటి : 1,746 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 375 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 22.7 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : - మన దేశంలో ధర (సుమారు) : రూ. 30,00,000 అప్రిల్లా ఆర్ఎస్వీ4 1100 ఫ్యాక్టరీ ఇంజిన్ కెపాసిటి : 1099 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 202 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 17.9 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 213.89 బీహెచ్పీ, 13,000ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 26,50,000 డుకాటీ పనిగేల్ వీ4 ఇంజిన్ కెపాసిటి : 1,103 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 198 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 16 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 211.21 బీహెచ్పీ, 13,000 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 26,27,000 బీఎండబ్ల్యూ ఆర్ 1250 అడ్వెంచర్ ఇంజిన్ కెపాసిటి : 1,254 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 268 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 30 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 134.1 బీహెచ్పీ, 7,700 ఆర్పీఎం మన దేశంలో ధర (సుమారు) : రూ. 25,00,000 ట్రయంప్ రాకెట్ 3 ఇంజిన్ కెపాసిటి : 2,458 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 304 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 18 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 165 బీహెచ్పీ మన దేశంలో ధర (సుమారు) : రూ. 22,27,000 ఇండియన్ చీఫ్ బాబెర్ డార్క్‌హార్స్ ఇంజిన్ కెపాసిటి : 1890 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 352 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 15.1 లీటర్లు మన దేశంలో ధర (సుమారు) : రూ. 21,40,000 సుజుకి హయబుస ఇంజిన్ కెపాసిటి : 1,340 సీసీ గేర్లు : 6 బండి మొత్తం బరువు : 266 కేజీలు ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ : 20 లీటర్లు మాగ్జిమమ్ పవర్ : 187.3 బీహెచ్పీ మన దేశంలో ధర (సుమారు) : రూ. 18,47,000 -
కవసాకి సూపర్‌బైక్‌ల ధర భారీగా తగ్గింపు
పుణే : సూపర్‌బైక్‌లను తయారు చేసే కవసాకి కంపెనీ, స్థానికంగా తయారు చేసిన నింజా జెడ్ఎక్స్-10ఆర్, నింజా జెడ్ఎక్స్-10ఆర్ఆర్ లను మార్కెట్లోకి విడుదల చేసింది. వీటిని స్థానికంగా రూపొందించడంతో, వీటి ధరలను కూడా భారీగా తగ్గించింది. నింజా జెడ్ఎక్స్-10ఆర్ ధరను రూ.12.80 లక్షలకు తగ్గించగా.. నింజా జెడ్ఎక్స్-10ఆర్ఆర్ను రూ.16.10 లక్షలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు బైక్‌ల పాత ధరలు రూ.18.80 లక్షలు, రూ.21.90 లక్షలుగా ఉన్నాయి. అంటే ఇరు బైక్‌లపై ఆరు లక్షల మేర ధరను కోత పెట్టింది. ఈ ధర తగ్గింపునకు కారణంగా స్థానికంగా వీటిని అసెంబుల్ చేయడమేనని కంపెనీ తెలిపింది. పుణేకు సమీపంలోని ఛకన్ లో వీటిని అసెంబుల్ చేసినట్టు చెప్పింది. ఈ రెండు బైక్‌ల బుకింగ్స్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కవసాకి డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్పెషల్ ప్రీ-ఆర్డర్ ధరలు జూలై చివరి వరకే ఉంటాయని, ఆ అనంతరం మళ్లీ ధరలను పెంచుతామని కంపెనీ వెల్లడించింది. కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే వాటిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. కేటాయించిన ఉత్పత్తి అనంతరం బుకింగ్స్‌ను ముగుస్తాయని పేర్కొంది. ఒకవేళ ఎవరైనా కవసాకి సూపర్‌బైక్‌లను కొనుగోలు చేయాలనుకుంటే, ఇదే సరియైన సమయమని కంపెనీ చెబుతోంది.కేఆర్టీ ఎడిషన్‌లో ఆకుపచ్చ రంగులో కొత్త నింజా జెడ్ఎక్స్-10ఆర్ అందుబాటులో ఉండగా... నింజా జెడ్ఎక్స్-10ఆర్ఆర్ కేవలం నలుపు రంగులో మాత్రమే లభ్యమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో ఈ కవసాకి నింజా జెడ్ఎక్స్-10ఆర్ వివిధ రంగుల ఆప్షన్లలో మూడు వేరియంట్లను ఆఫర్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో ఉన్న చౌకైన ఫ్లాగ్షిప్ సూపర్‌బైక్ ఏదైనా ఉందా? అంటే అది జెడ్ఎక్స్-10ఆర్ అని కంపెనీ చెబుతోంది. ఈ మోటార్‌సైకిళ్లు 998సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో రూపొందాయి. 197బీహెచ్పీ, 113.4 ఎన్ఎం టర్క్‌ను ఇది ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో దీన్ని ఇంజిన్ రూపొందింది. కవసాకి లాంచ్ కంట్రోల్, కవసాకి ట్రాక్షన్ కంట్రోల్, కవసాకి బ్రేకింగ్ కంట్రోల్, క్విక్ సిఫ్టర్, కార్నర్ మేనేజ్మెంట్ ఫంక్షన్, ఏబీసీ వంటి ఫీచర్లు ఈ బైక్‌లలో ఉన్నాయి. -
కొత్త బైక్: ఈ నెలలో బుక్ చేస్తే స్పెషల్ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: జపాన్ టూవీలర్ కంపెనీ కవాసాకి కొత్త మోడల్ బైక్‌ను విడుదల చేసింది. స్పోర్ట్స్ బైక్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంటున్న కవాసాకి నింజా 400ను లాంచ్ చేసింది. రూ.4.69 లక్షల (ఎక్స్-ఫోరూమ్, ఢిల్లీ) ధరలో ప్రవేశపెట్టినట్లు కంపెనీ వెల్లడించింది. 300సీసీ మోడల్ కన్నా శక్తివంతమైందనీ, పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. షార్ప్ లుక్స్‌తో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల కస్టమర్లు సులభంగా రైడింగ్ చేసేందుకు ఈ బైక్ ఎంతగానో ఉపయోగపడుతుందని కవాసాకి మోటార్స్(ఇండియా) ప్రకటించింది. అప్డేటెడ్ ఇంజీన్‌తో మరికొన్ని వారాల్లో డెలివరీ ప్రారంభమవుతుందని పేర్కొంది. నింజా సిరీస్‌లో మంచి ఫ్యామిలీని సృష్టించాం. ఇప్పటి వరకు నింజా 400 మోడల్ బైకులు పరిమిత సంఖ్యలోనే అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే భారత్‌లో నింజా 300 ఇప్పటికీ మా ఫ్లాగ్షిప్ మోడల్‌గానే కొనసాగుతోంది. నింజా సిరీస్‌లోని మిగతా మోడళ్లతో పాటు దీన్ని కూడా కొనసాగిస్తామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ యుతాకా యమషిత వెల్లడించారు. చెప్పారు. అంతేకాదు ఏప్రిల్‌మాసంలో బుక్‌చేసిన వారికి స్పెషల్ ఆఫర్ కూడా ఉందని ప్రకటించారు. అయితే దీనిపై మరింత సమాచారం కోరినపుడు ఆఫర్ మొత్తాన్ని ఇంకా నిర్ణయించలేదన్నారు. సో.. ఈ ఆఫర్‌పై మరిన్ని వివరాలు షోరూంల్లోనే లభ్యం. 399 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజీన్, 48.3 బీహెచ్పీ, 38ఎన్ఎం గరిష్ట టార్క్, 6 స్పీడ్ గేర్‌బాక్స్‌లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. అలాగే నింజా 300 మోడల్‌తో పోలిస్తే ప్రీమియం డిజిటల్ డిస్ప్లేతో కొత్త ఇన్స్ట్రమెంట్ క్లస్టర్‌ను అమర్చింది. గ్రీన్ కలర్లో కెఆర్‌టీ ఎడిషన్) ఇది అందుబాటులోఉంది. యమహా వైజెడ్ఎఫ్, కెటీఎం ఆర్సీ390 , టీవీఎస్ అపాచీ లాంటి బైక్‌లను కవాసాకి నింజా 400 గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా. -
లగ్జరీ బైక్‌లూ నడిపేస్తాం...
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: హార్లీ డేవిడ్సన్, ట్రయంఫ్, హ్యోసంగ్, కవాసాకి నింజా, డ్యుకాటీ... ఈ పేర్లు వినగానే లగ్జరీ బైకులని ఠక్కున చెప్పేస్తాం. అయితే ఇప్పుడివి మగవారికి మాత్రమే సొంతం కాదండోయ్!!. ‘మేము కూడా దూసుకుపోతాం’ అంటున్నారు మహిళలు. అవును.. లగ్జరీ, సూపర్ బైకుల రైడింగ్‌పై మహిళల్లో ఆసక్తి అంతకంతకూ పెరుగుతోంది. వీరి ఆసక్తి తగ్గట్టే మహిళల కోసం ప్రత్యేకమైన లగ్జరీ బైకులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నాయి వాహన సంస్థలు. దేశవ్యాప్తంగా ఏటా 10 వేల లగ్జరీ బైకులు అమ్ముడవుతుండగా ఇందులో మహిళ వాటా 10 శాతంగా ఉందని చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. మెట్రో నగరాల్లో మహిళల జీవన శైలి, ఆలోచన విధానాల్లో అనూహ్యమైన మార్పులొస్తున్నాయి. దీంతో మగవారితో సమానంగా వారు కూడా లగ్జరీ, సూపర్ బైకులను నడపాలని కోరుకుంటున్నారు. అయితే మనదేశంలో మహిళా బైక్ రైడింగ్ విభాగం చాలా చిన్నది. అందుకే మహిళా కస్టమర్లను ఆకర్షించడం ఇక్కడ సులువైన పని కాదంటున్నారు మార్కెట్ విశ్లేషకులు. ‘‘ప్రతి నెలా లగ్జరీ బైక్స్ కొనేందుకు మా షోరూమ్‌కు వచ్చే 15 మంది కస్టమర్లలో ఇద్దరు మహిళా కస్టమర్లు ఉంటున్నారు’’ అని హార్లీ డేవిడ్సన్ ఏపీ డీలర్ జయ్‌రామ్ ‘సాక్షి బిజినెస్ బ్యూరో’ ప్రతినిధికి చెప్పారు. ఇటీవల మార్కెట్లోకి విడుదల చేసిన ‘స్ట్రీట్ 750’ ‘సూపర్’లో లగ్జరీ బైకులు మహిళలకు సరిగ్గా సరిపోతాయన్నారు. ‘‘ఎందుకంటే వీటి ఎత్తు, బరువు మిగతా లగ్జరీ బైకులకంటే తక్కువగా ఉంటాయి. దీంతో నాలుగు ఫీట్లుండే మహిళలు ఈ బైకులపై కూర్చున్నా కూడా వారికి బ్రేకులు, గేర్లు అందుతాయి’’ అని వివరించారు. దేశ వ్యాప్తంగా హార్లీ డేవిడ్సన్ బైకులకు 2 వేల మంది మహిళా కస్టమర్లున్నారని ఆయన చెప్పారు. ‘‘లాంగ్ డ్రైవ్ కోసమే లగ్జరీ బైకులు. ఇతర బైకులు గనక 80 కి.మీ. వేగాన్ని దాటితే నియంత్రించలేం. కానీ, లగ్జరీ బైకులు 150 కి.మీ. దాటినా సులువుగా నియంత్రించొచ్చు. అందుకే హ్యోసంగ్ నుంచి 250 సీసీ క్రూజర్ బైకును ప్రత్యేకంగా మహిళల కోసమే మార్కెట్లోకి విడుదల చేశాం’’ అని చెప్పారు హోయోసంగ్ ఏపీ డీలర్ వంశీ కృష్ణ. 170 కిలోల బరువుండే ఈ బైకుపై ఆగకుండా వెయ్యి కి.మీ ప్రయాణించినా నడుం నొప్పి రాదని వంశీ కృష్ణ చెప్పుకొచ్చారు. అయితే మగవారిని ఆకర్షించినంత సులువుగా మహిళా కస్టమర్లను ఆకర్షించలేమని ఆయనన్నారు. కుటుంబ వ్యవహారాలు, బాధ్యతలు, సమాజ కోణం వంటి ఎన్నో కారణాలున్నాయన్నారు. 250 సీసీ నుంచి 1,800 సీసీ గల లగ్జరీ, సూపర్ బైకులు దేశవ్యాప్తంగా ఏటా 10 వేలు అమ్ముడవుతుండగా... వీటిలో మహిళల వాటా 10 శాతం ఉందని మార్కెట్ విశ్లేషకులు చెబుతున్నారు. వచ్చే రెండేళ్లలో లగ్జరీ బైకుల కొనుగోళ్లలో మహిళల వాటా 20-30% పెరిగే అవకాశముందన్నది వారి అంచనా. ఎత్తు, బరువు తక్కువుంటేనే..: సాధారణంగా మహిళలు నడిపే స్కూటీ పెప్ వాహనాల పొడవు 1,735 ఎంఎం, వెడల్పు 590 ఎంఎం, సీటు ఎత్తు 740 ఎంఎం ఉంటుంది. కానీ లగ్జరీ, సూపర్ బైక్స్ భిన్నమైనవి. మహిళలు వీటి ని నియంత్రించడం కొంచెం కష్టం. అందుకే మహిళల కోసం లగ్జరీ బైకుల తయారీలో బండి బరువు, ఎత్తు తగ్గింపు వంటి చిన్న మా ర్పులు చేస్తున్నారు. దీంతో మగాళ్లతో సమానంగా మహిళలూ లగ్జరీ, సూపర్ బైక్స్‌పై దూసుకుపోతున్నారు. సర్వేలు శిక్షణ కూడా... కోట్లు వెచ్చించి తయారు చేసిన వాహనాలు తీరా మార్కెట్లోకి విడుదలయ్యాక మహిళలు స్వాగతించకపోతే కంపెనీలకు నష్టమే. అందుకే మహిళలు ఎలాంటి బైకులు ఇష్టపడతారో సర్వేలు చేసి మరీ విడుదల చేస్తున్నాయి. హార్లీ డేవిడ్సన్ స్ట్రీట్ 750 బైక్‌ను మార్కెట్లోకి విడుదల చేసే ముందు మహిళలు, మగవారు ఇద్దరిలో ఈ బైక్ ఎవరికి కరెక్ట్‌గా సరిపోతుందో తెలుసుకునేందుకు దేశవ్యాప్తంగా సర్వే చేశాకే ప్రవేశపెట్టింది. బరువెక్కువగా ఉండే లగ్జరీ, సూపర్ బైకులను ఎలా నియంత్రించాలో మహిళల కోసం ప్రత్యేకమైన శిక్షణ తరగతులూ నిర్వహిస్తున్నాయి ట్రయంఫ్ వంటి కొన్నికంపెనీలు. -
కవాసాకి.. రెండు కొత్త లగ్జరీ బైకులు
న్యూఢిల్లీ: జపాన్ ఆటోమొబైల్ దిగ్గజం కవాసాకి తాజాగా జడ్1000, నింజా 1000 పేరిట భారత్‌లో రెండు ప్రీమియం సూపర్‌బైక్‌లను ప్రవేశపెట్టింది. వీటి ధర రూ. 12 లక్షలుగా (ఢిల్లీలో షోరూం ధర) ఉంటుంది. ఒక్కో మోడల్లో ఏటా కనీసం 100 బైక్‌లను విక్రయించాలని నిర్దేశించుకున్నట్లు కంపెనీ భారత విభాగం డిప్యూటీ ఎండీ నిస్కికావా షిగెటో తెలిపారు. అలాగే సెప్టెంబర్‌లో ప్రవేశపెట్టిన మరో రెండు మోడల్స్ (జడ్ఎక్స్-14ఆర్, జడ్ఎక్స్-10ఆర్) అమ్మకాలు సుమారు 50 దాకా ఉండగలవని ఆశిస్తున్నట్లు ఆయన వివరించారు. జడ్1000, నింజా 1000 బైక్‌లలో 1,043 సీసీ సామర్ధ్యం గల ఇంజిన్లు ఉంటాయి. వీటిని జపాన్ నుంచి నేరుగా దిగుమతి చేసుకుని పుణె, ఢిల్లీలోని కవాసాకి షోరూమ్‌లలో విక్రయిస్తారు. కంపెనీ ఇప్పటికే నింజా 300, నింజా 600 బైక్‌లను భారత్‌లో విక్రయిస్తోంది. వీటి రేటు రూ. 3.5 లక్షల నుంచి రూ. 5 లక్షల దాకా ఉంది.