
కవాసకి తన నింజా లైనప్‌లోని మూడు మోడళ్లపై గొప్ప డిస్కౌంట్స్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్స్ ఆన్-రోడ్ ధరకు వర్తించే వోచర్‌ల రూపంలో లేదా డీలర్‌షిప్‌ల వద్ద యాక్ససరీస్, సర్వీస్ ప్యాకేజీలను కొనుగోలు చేయడానికి ఉపయోగించవచ్చు.
నింజా 300, నింజా 500 కొనుగోలుపైన వినియోగదారుడు రూ. 10000 వోచర్ పొందవచ్చు. అయితే నింజా 650 కొనుగోలుపైన రూ. 25000 వోచర్ పొందవచ్చు. కవాసకి తన బైకులపై డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందించడం ఇదే మొదటిసారి కాదు. గత నెలలో కూడా ఇలాబీటి ఆఫర్స్ ప్రకటించింది.
కవాసకి నింజా 650 బైక్ ధర రూ.7.16 లక్షలు. నింజా 300, నింజా 500 ధరలు వరుసగా రూ.3.43 లక్షలు, రూ.5.24 లక్షలు. ఆకర్షణీయమైన డిజైన్ కలిగిన ఈ బైక్స్.. అప్డేటెడ్ ఫీచర్స్ పొందుతాయి. పర్ఫామెన్స్ పరంగా కూడా ఇవి చాలా ఉత్తమంగా ఉంటాయని తెలుస్తోంది. కవాసకి అందిస్తున్న ఈ ఆఫర్స్ సెప్టెంబర్ 1 నుండి 30 వరకు మాత్రమే చెల్లుతాయి.
Comments
Please login to add a commentAdd a comment