కవసాకి నింజా జెడ్‌ఎక్స్-10ఆర్‌ఆర్
పుణే : సూపర్‌బైక్‌లను తయారు చేసే కవసాకి కంపెనీ, స్థానికంగా తయారు చేసిన నింజా జెడ్‌ఎక్స్-10ఆర్, నింజా జెడ్‌ఎక్స్-10ఆర్‌ఆర్ లను మార్కెట్‌లోకి విడుదల చేసింది. వీటిని స్థానికంగా రూపొందించడంతో, వీటి ధరలను కూడా భారీగా తగ్గించింది. నింజా జెడ్‌ఎక్స్-10ఆర్ ధరను రూ.12.80 లక్షలకు తగ్గించగా.. నింజా జెడ్‌ఎక్స్-10ఆర్‌ఆర్‌ను రూ.16.10 లక్షలకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రెండు బైక్‌ల పాత ధరలు రూ.18.80 లక్షలు, రూ.21.90 లక్షలుగా ఉన్నాయి. అంటే ఇరు బైక్‌లపై ఆరు లక్షల మేర ధరను కోత పెట్టింది. ఈ ధర తగ్గింపునకు కారణంగా స్థానికంగా వీటిని అసెంబుల్ చేయడమేనని కంపెనీ తెలిపింది. పుణేకు సమీపంలోని ఛకన్ లో వీటిని అసెంబుల్ చేసినట్టు చెప్పింది. ఈ రెండు బైక్‌ల బుకింగ్స్ దేశవ్యాప్తంగా ఉన్న అన్ని కవసాకి డీలర్‌షిప్‌ల వద్ద అందుబాటులో ఉన్నాయి. అయితే ఈ స్పెషల్ ప్రీ-ఆర్డర్ ధరలు జూలై చివరి వరకే ఉంటాయని, ఆ అనంతరం మళ్లీ ధరలను పెంచుతామని కంపెనీ వెల్లడించింది.
కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే వాటిని రూపొందించినట్టు కంపెనీ తెలిపింది. కేటాయించిన ఉత్పత్తి అనంతరం బుకింగ్స్‌ను ముగుస్తాయని పేర్కొంది. ఒకవేళ ఎవరైనా కవసాకి సూపర్‌బైక్‌లను కొనుగోలు చేయాలనుకుంటే, ఇదే సరియైన సమయమని కంపెనీ చెబుతోంది.కేఆర్‌టీ ఎడిషన్‌లో ఆకుపచ్చ రంగులో కొత్త నింజా జెడ్‌ఎక్స్-10ఆర్ అందుబాటులో ఉండగా... నింజా జెడ్‌ఎక్స్-10ఆర్‌ఆర్ కేవలం నలుపు రంగులో మాత్రమే లభ్యమవుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ఈ కవసాకి నింజా జెడ్‌ఎక్స్-10ఆర్ వివిధ రంగుల ఆప్షన్లలో మూడు వేరియంట్లను ఆఫర్ చేస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న చౌకైన ఫ్లాగ్‌షిప్ సూపర్‌బైక్ ఏదైనా ఉందా? అంటే అది జెడ్‌ఎక్స్-10ఆర్ అని కంపెనీ చెబుతోంది. ఈ మోటార్‌సైకిళ్లు 998సీసీ లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో రూపొందాయి. 197బీహెచ్‌పీ, 113.4 ఎన్‌ఎం టర్క్‌ను ఇది ఉత్పత్తి చేస్తుంది. 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో దీన్ని ఇంజిన్ రూపొందింది. కవసాకి లాంచ్ కంట్రోల్, కవసాకి ట్రాక్షన్ కంట్రోల్, కవసాకి బ్రేకింగ్ కంట్రోల్, క్విక్ సిఫ్టర్, కార్నర్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్, ఏబీసీ వంటి ఫీచర్లు ఈ బైక్‌లలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment