
కవాసకి కంపెనీ.. దేశీయ విఫణిలో కొత్త 'నింజా 1100ఎస్ఎక్స్' బైక్ లాంచ్ చేసిన.. దాదాపు రెండు నెలల తర్వాత, 'వెర్సిస్ 1100' (Kawasaki Ninja Versys 1100)ను రూ. 12.90 లక్షల (ఎక్స్ షోరూమ్) ధర వద్ద లాంచ్ చేసింది. చూడటానికి వెర్సిస్ 1000 మాదిరిగే ఉండే.. ఈ బైక్ ఇప్పుడు శక్తివంతమైన ఇంజిన్ పొందుతుంది.
ఒకే వేరియంట్‌లో మాత్రమే అందుబాటులోకి వచ్చిన కవాసకి వెర్సిస్ 1100.. డ్యూయల్ టోన్ (మెటాలిక్ మాట్టే గ్రాఫేన్ స్టీల్ గ్రే / మెటాలిక్ డయాబ్లో బ్లాక్) ఫినిషింగ్ పొందుతుంది. ఈ బైక్ డెలివరీలు ఈ నెల (ఫిబ్రవరి 2025) చివరిలో ప్రారంభమవుతాయి.
కవాసకి వెర్సిస్ 1100లో ఉన్న అతిపెద్ద అప్డేట్ ఏమిటంటే.. 1099 సీసీ ఇంజిన్. ఇది 9000 rpm వద్ద 133 Bhp పవర్, 7600 rpm వద్ద 112 Nm టార్క్ ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్ పొందుతుంది. ఇందులో క్విక్ షిఫ్టర్ కూడా అందుబాటులో ఉంది.
కవాసకి వెర్సిస్ 1100 సస్పెన్షన్.. అవుట్‌గోయింగ్ మోడల్ 1000 మాదిరిగానే ఉంటుంది. ముందు భాగంలో ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ 43 mm USD ఫోర్క్, వెనుక భాగంలో ప్రీ-లోడ్ మరియు రీబౌండ్ సర్దుబాటుతో గ్యాస్-ఛార్జ్డ్ మోనోషాక్
ఫీచర్ల విషయానికొస్తే.. వెర్సిస్ 1100లో మల్టిపుల్ రైడింగ్ మోడ్‌లు, కార్నరింగ్ మేనేజ్‌మెంట్ ఫంక్షన్, కవాసకి ఇంటెలిజెంట్ ఏబీఎస్, సెలక్టబుల్ ట్రాక్షన్ కంట్రోల్, USB టైప్ సీ ఛార్జింగ్ పోర్ట్, అడ్జస్టబుల్ విండ్‌షీల్డ్ మొదలైనవన్నీ ఉన్నాయి. ఈ బైక్ కొనుగోలుదారులకు అదనపు పరికలు లేదా యాక్ససరీస్ కావాలంటే కొనుగోలు చేయవచ్చు. బైకును మరింత అందంగా డిజైన్ చేసుకోవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment