2025 కవాసకి కొత్త బైక్.. రేటెంతో తెలుసా? | 2025 Kawasaki Ninja ZX 4RR Launched in India | Sakshi
Sakshi News home page

2025 కవాసకి కొత్త బైక్.. రేటెంతో తెలుసా?

Published Fri, Nov 15 2024 5:06 PM | Last Updated on Fri, Nov 15 2024 5:50 PM

2025 Kawasaki Ninja ZX 4RR Launched in India

కవాసకి ఇండియా తన జెడ్ఎక్స్-4ఆర్ఆర్ బైకును కొత్త కలర్ ఆప్షన్‌లో లాంచ్ చేసింది. దీని ధర రూ. 9.42 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఇండియా). ఇది ఇప్పుడు లైమ్ గ్రీన్/ఎబోనీ/బ్లిజార్డ్ వైట్ అనే కొత్త రంగులో అందుబాటులో ఉంది. ఈ కొత్త బైక్ 2024 మోడల్ కంటే రూ. 32,000 ఖరీదైనది.

కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ బైక్ 399సీసీ లిక్విడ్-కూల్డ్, ఇన్‌లైన్-ఫోర్ ఇంజన్‌ పొందుతుంది. ఇది 14500 rpm వద్ద 77 Bhp పవర్, 13000 rpm వద్ద 39 Nm టార్క్ అందిస్తుంది. ఇంజిన్ 6 స్పీడ్ గేర్‌బాక్స్‌తో లభిస్తుంది.

2025 కవాసకి నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ ట్విన్ ఎల్ఈడీ హెడ్‌లైట్స్, అప్‌స్వెప్ట్ టెయిల్‌ లాంప్, టెన్సిల్ స్టీల్ ట్రేల్లిస్ ఫ్రేమ్ వంటివి పొందుతుంది. యూఎస్డీ ఫోర్క్, బ్యాక్-లింక్ మోనోషాక్ కలిగిన ఈ బైక్ 17 ఇంచెస్ వీల్స్ కలిగి ఉంటుంది. సుమారు 189 కేజీల బరువున్న కొత్త కవాసకి బైక్ గ్రౌండ్ క్లియరెన్స్ 135 మిమీ.

నింజా జెడ్ఎక్స్-4ఆర్ఆర్ బైక్ స్పోర్ట్, రోడ్, రెయిన్ లేదా కస్టమ్ అనే నాలుగు రైడ్ మోడ్‌లను పొందుతుంది. ట్రాక్షన్ కంట్రోల్, డ్యూయెల్ ఛానల్ ఏబీఎస్, కలర్డ్ టీఎఫ్టీ డిస్ప్లే వంటివి కూడా ఈ బైకులో చూడవచ్చు. ఇది కేవలం పరిమిత సంఖ్యలో మాత్రమే అందుబాటులో ఉంటాయి. కంపెనీ అధికారిక డీలర్‌షిప్‌లలో బుకింగ్‌లను స్వీకరించడం ప్రారంభించింది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement