కవాసాకి నింజా 400
సాక్షి, న్యూఢిల్లీ: జపాన్ టూవీలర్ కంపెనీ కవాసాకి కొత్త మోడల్ బైక్‌ను విడుదల చేసింది. స్పోర్ట్స్ బైక్స్‌తో యూత్‌ను ఆకట్టుకుంటున్న కవాసాకి నింజా 400ను లాంచ్ చేసింది. రూ.4.69 లక్షల (ఎక్స్-ఫోరూమ్, ఢిల్లీ) ధరలో ప్రవేశపెట్టినట్లు కంపెనీ వెల్లడించింది. 300సీసీ మోడల్ కన్నా శక్తివంతమైందనీ, పరిమిత సంఖ్యలో అందుబాటులో ఉంటుందని తెలిపింది. షార్ప్ లుక్స్‌తో దేశవ్యాప్తంగా ఉన్న వివిధ వర్గాల కస్టమర్లు సులభంగా రైడింగ్ చేసేందుకు ఈ బైక్ ఎంతగానో ఉపయోగపడుతుందని కవాసాకి మోటార్స్(ఇండియా) ప్రకటించింది. అప్‌డేటెడ్ ఇంజీన్‌తో మరికొన్ని వారాల్లో డెలివరీ ప్రారంభమవుతుందని పేర్కొంది.
నింజా సిరీస్‌లో మంచి ఫ్యామిలీని సృష్టించాం. ఇప్పటి వరకు నింజా 400 మోడల్ బైకులు పరిమిత సంఖ్యలోనే అందుబాటులో ఉన్నాయి. ఎందుకంటే భారత్‌లో నింజా 300 ఇప్పటికీ మా ఫ్లాగ్‌షిప్ మోడల్‌గానే కొనసాగుతోంది. నింజా సిరీస్‌లోని మిగతా మోడళ్లతో పాటు దీన్ని కూడా కొనసాగిస్తామని కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ యుతాకా యమషిత వెల్లడించారు. చెప్పారు. అంతేకాదు ఏప్రిల్‌మాసంలో బుక్‌చేసిన వారికి స్పెషల్ ఆఫర్ కూడా ఉందని ప్రకటించారు. అయితే దీనిపై మరింత సమాచారం కోరినపుడు ఆఫర్ మొత్తాన్ని ఇంకా నిర్ణయించలేదన్నారు. సో.. ఈ ఆఫర్‌పై మరిన్ని వివరాలు షోరూంల్లోనే లభ్యం.
399 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజీన్, 48.3 బీహెచ్‌పీ, 38ఎన్‌ఎం గరిష్ట టార్క్, 6 స్పీడ్ గేర్‌బాక్స్‌లాంటివి ప్రధాన ఫీచర్లుగా ఉన్నాయి. అలాగే నింజా 300 మోడల్‌తో పోలిస్తే ప్రీమియం డిజిటల్ డిస్‌ప్లేతో కొత్త ఇన్‌స్ట్రమెంట్ క్లస్టర్‌ను అమర్చింది. గ్రీన్ కలర్‌లో కెఆర్‌టీ ఎడిషన్) ఇది అందుబాటులోఉంది. యమహా వైజెడ్‌ఎఫ్, కెటీఎం ఆర్‌సీ390 , టీవీఎస్ అపాచీ లాంటి బైక్‌లను కవాసాకి నింజా 400 గట్టి పోటీ ఇవ్వనుందని అంచనా.
Comments
Please login to add a commentAdd a comment