సాక్షి, న్యూఢిల్లీ: యమహా మోటార్ (ఐఐఎం) కొత్త బైక్‌ను లాంచ్ చేసింది. ఎఫ్‌జెడ్ సీరిస్‌కు కొనసాగింపుగా మెరుగైన బ్రేకింగ్ సిస్టంతో యమహా ఎఫ్‌జెడ్ 25 పేరుతో శుక్రవారం విడుదల చేసింది. ఫేజర్ 250 ఇంజీన్‌తో దీన్ని రూపొందించింది. అలాగే పాత మోడ్‌లో 5 స్పోక్ అల్లాయ్‌వీల్స్‌తో పోలిస్తే కొత్తగా ప్రారంభించిన బైక్‌లో స్పోర్టీ 10- స్పోక్ అల్లాయ్ వీల్స్‌ను జోడించింది. ఈ కొత్త వెర్షన్ బైక్‌ను రూ. 86,042 (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ధరకు విడుదల చేసింది.
తమ లేటెస్ట్ బైక్ మెరుగైన బ్రేకింగ్ వ్యవస్థతో మంచి పనితీరు సామర్థ్యాన్ని ఇస్తుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. 149 సి.సి. 4-స్ట్రోక్ ఇంజిన్, 220 ఎంఎం హైడ్రాలిక్ సింగిల్ రియర్ డిస్క్ బ్రేక్, 282 మిమీ ఫ్రంట్ బ్రేక్ ఫీచర్ల కారణంగా వాహనం స్టెబిలిటీ, కంట్రోల్ మెరుగుపడుతుందని పేర్కొంది.
దాదాపు పది సంవత్సరాల క్రితం భారత్‌లో లక్షలాదిమందికి పైగా వినియోగదారులను ఆకర్షించామని, ఈ కొత్త వెర్షన్ ద్వారా మరింతమంది కస్టమర్లు ఈ కోవలో చేరనున్నారనే విశ్వాసాన్ని యమహా మోటార్ ఇండియా సేల్స్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ (సేల్స్ అండ్ మార్కెటింగ్) రాయ్ కురియన్ చెప్పారు. తమ కొత్త బైక్ లుక్, అధునాతనమైన ఇంజీన్ టెక్నాలజీ, ఫ్యూయల్ మేనేజ్ పాత, కొత్త వినియోగదారులకు ఉత్తేజపరుస్తుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment