Indian Citizens In Ukraine: Air India Evacuation Flights Costing Rs 7-8 Lakh Per Hour - Sakshi
Sakshi News home page

ఉక్రెయిన్‌ నుంచి మనవాళ్లు రావాలంటే.. ఇంత ఖర్చు అవుతుందా?

Published Sun, Feb 27 2022 7:08 PM | Last Updated on Mon, Feb 28 2022 11:25 AM

Ukraine crisis: Air India evacuation flights costing RS 7-8 Lakh Per hour - Sakshi

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 16 వేల మంది భారతీయులను క్షేమంగా స్వదేశానికి తీసుకొచ్చేందుకు కేంద్రం ప్రత్యేక ఏర్పాట్లు చేసిన సంగతి మనకు తెలిసిందే. ఉక్రెయిల్‌లో ప్రస్తుతం రష్యా కొనసాగిస్తున్న దాడుల్లో ఎక్కువగా తూర్పు ప్రాంతంలోనే సాగుతున్నాయి. యూరప్‌ దేశాలపైవు ఉ‍న్న పశ్చిమ ప్రాంతంలో దాడులు తక్కువగా ఉన్నాయి. దీంతో పశ్చిమ ప్రాంతాలకు పాస్‌పోర్ట్‌ ఇతర డాక్యుమెంట్లతో రావాలంటూ ఉక్రెయిన్‌లో ఉన్న భారతీయులకు కేంద్రం సూచించింది.

అక్కడి నుంచి భారతీయులను ఎయిర్ ఇండియా విమానంలో మన దేశానికి తీసుకొని వస్తున్నారు. అయితే, అక్కడ నుంచి విమాన ప్రయాణానికి అయ్యే ఖర్చు రూ.1.10 కోట్లకు పైగా ఉంటుంది. విమానాల కాలవ్యవధిని బట్టి ఈ మొత్తం పెరుగుతుంది. రొమేనియా, హంగరీతో సహా ఉక్రెయిన్ పొరుగు దేశాల నుంచి డ్రీమ్ లైనర్ అని పిలిచే బోయింగ్ 787 విమానంతో విమానయాన సంస్థ సేవలను అందిస్తుంది. ఇప్పటికే వందలాది మంది భారతీయులను తిరిగి తీసుకువచ్చింది. డ్రీమ్ లైనర్ అని పిలిచే చార్టర్డ్ విమానాన్ని నడపడానికి అయ్యే ఖర్చు గంటకు రూ.7 నుంచి 8 లక్షల ఖర్చు అవుతుందని విమానయాన సంస్థ వర్గాలు తెలిపాయి. 

"అందుకే మనం ఎక్కడికి వెళుతున్నాము, ఎంత దూరం ప్రయాణిస్తున్నాము" అనే దానిపై ఆధారపడి ఖర్చు ఉంటుంది. ఈ మొత్తం ఖర్చులో సిబ్బంది, ఇంధనం, నావిగేషన్, ల్యాండింగ్ & పార్కింగ్ ఛార్జీలకు సంబంధించిన ఖర్చులు ఉంటాయి. ప్రస్తుతం, ఎయిర్ ఇండియా బుకారెస్ట్ (రొమేనియా), బుడాపెస్ట్ (హంగరీ)లకు విమాన సేవలను అందిస్తుంది. ఈ రెండూ ప్రదేశాలకు షెడ్యూల్ ప్రకారం ఎలాంటి సేవలు లేవు. ఫ్లైట్ ట్రాకింగ్ వెబ్సైట్ ఫ్లైట్ అవేర్ ప్రకారం.. బుడాపెస్ట్ నుంచి ముంబైకి విమానం చేరుకోవడానికి దాదాపు ఆరు గంటల పాటు సమయం పట్టింది.

అలాగే, బుడాపెస్ట్ నుంచి ఢిల్లీకి సుమారు 6 గంటలు, మరొక విమానానికి ఢిల్లీ నుంచి బుడాపెస్ట్'కు 7 గంటలకు పైగా సమయం పట్టింది. ఖర్చు గంటకు రూ.7 నుంచి 8 లక్షల మధ్య ఉంటుంది కాబట్టి, రౌండ్ ట్రిప్ కోసం మొత్తం ఖర్చు రూ.1.10 కోట్లకు పైగా ఉంటుంది. అయితే, ఈ ప్రయాణానికి అయ్యే ఖర్చులను కేంద్ర ప్రభుత్వం ప్రజల నుంచి వసూలు చేయడం లేదు. ఉక్రెయిన్ నుంచి తిరిగి వస్తున్న తమ రాష్ట్రాల ప్రజల ఖర్చులను భరిస్తామని కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ప్రకటించాయి. డ్రీమ్ లైనర్ విమానంలో 250కి పైగా సీట్లు ఉన్నాయి. ఈ విమానం సగటున గంటకు 5 టన్నుల ఇంధనాన్ని వినియోగిస్తుంది. భారతీయుల తరలింపు ప్రక్రియ పూర్తయిన తర్వాత విమానయాన సంస్థకు అయిన ఖర్చును తిరిగి చెల్లించడానికి ప్రభుత్వానికి పంపుతుందని ఆ వర్గాలు తెలిపాయి. 

(చదవండి: ఇక ఉద్యోగులు ఆఫీసులకు రావాల్సిందే.. కీలక సర్వే!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement