సాక్షి, అమరావతి: హంగేరీ వేదికగా జరిగిన రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత్ రెజ్లర్ ప్రియా మాలిక్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి అభినందించారు. దేశానికి మరో పురస్కారం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ‘‘హంగేరిలో జరిగిన ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరపున బంగారు పతకం సాధించినందుకు ప్రియా మాలిక్‌కు నా హృదయపూర్వక అభినందనలు’’ అని ట్వీట్ చేశారు.
రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత ప్రియామాలిక్ విజయహాసం
కాగా హంగేరీలో జరుగుతున్న రెజ్లింగ్ పోటీల్లో 73 కేజీల విభాగంలో ఫైనల్‌లో ప్రియా మాలిక్ విజయం సాధించి గోల్డ్‌మెడల్ కైవసం చేసుకుంది. ఆమె 5-0తో బెలారస్ రెజ్లర్‌ను ఓడించి పసిడిని ఖాతాలో వేసుకుంది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో కూడా భారత రెజ్లర్లపై భారీ అంచనాలే ఉన్నాయి. 57 కేజీల విభాగంలో రవి కుమార్ దహియా, 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా, 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా పురుషుల జాబితాలో పోటీ పడనుండగా మహిళల విభాగంలో సీమా, వినేశ్ ఫోగర్, అన్షు, సోనమ్ బరిలో దిగబోతున్నారు.ప్రియా మాలిక్ విజయమై సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.
Another day, another laurel to the nation! My hearty congratulations to Priya Malik on clinching gold for India at World Cadet wrestling championship in Hungary. #priyamalik
— YS Jagan Mohan Reddy (@ysjagan) July 25, 2021
Comments
Please login to add a commentAdd a comment