World Cadet Wrestling Championship
-
ప్రియామాలిక్కు అభినందనలు తెలిపిన సీఎం జగన్
సాక్షి, అమరావతి: హంగేరీ వేదికగా జరిగిన రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో స్వర్ణ పతకం సాధించిన భారత్ రెజ్లర్ ప్రియా మాలిక్‌ను ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అభినందించారు. దేశానికి మరో పురస్కారం వచ్చినందుకు సంతోషంగా ఉందన్నారు. ‘‘హంగేరిలో జరిగిన ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్‌షిప్‌లో భారత్ తరపున బంగారు పతకం సాధించినందుకు ప్రియా మాలిక్‌కు నా హృదయపూర్వక అభినందనలు’’ అని ట్వీట్ చేశారు. రెజ్లింగ్ వరల్డ్ క్యాడెట్ ఛాంపియన్‌షిప్‌లో గోల్డ్ మెడల్ సాధించిన తర్వాత ప్రియామాలిక్ విజయహాసం కాగా హంగేరీలో జరుగుతున్న రెజ్లింగ్ పోటీల్లో 73 కేజీల విభాగంలో ఫైనల్లో ప్రియా మాలిక్ విజయం సాధించి గోల్డ్‌మెడల్ కైవసం చేసుకుంది. ఆమె 5-0తో బెలారస్ రెజ్లర్‌ను ఓడించి పసిడిని ఖాతాలో వేసుకుంది. ఇక టోక్యో ఒలింపిక్స్‌లో కూడా భారత రెజ్లర్లపై భారీ అంచనాలే ఉన్నాయి. 57 కేజీల విభాగంలో రవి కుమార్ దహియా, 65 కేజీల విభాగంలో భజరంగ్ పూనియా, 86 కేజీల విభాగంలో దీపక్ పూనియా పురుషుల జాబితాలో పోటీ పడనుండగా మహిళల విభాగంలో సీమా, వినేశ్ ఫోగర్, అన్షు, సోనమ్ బరిలో దిగబోతున్నారు.ప్రియా మాలిక్ విజయమై సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. Another day, another laurel to the nation! My hearty congratulations to Priya Malik on clinching gold for India at World Cadet wrestling championship in Hungary. #priyamalik — YS Jagan Mohan Reddy (@ysjagan) July 25, 2021 -
ప్రియా మాలిక్ గోల్డ్ మెడల్ గెలిచింది ఒలింపిక్స్‌లో కాదు లంబూజీ..
డర్హమ్: విశ్వక్రీడా సంబురం(టోక్యో ఒలింపిక్స్) జరుగుతున్న ప్రస్తుత తరుణంలో ఎక్కడ ఏ మెడల్ వార్త కనిపించినా అది ఒలింపిక్స్‌లోనే అనుకుని చాలా మంది ప్రముఖులు పొరబడుతున్నారు. ఈ జాబితాలో టీమిండియా క్రికెటర్లు కూడా ఉండటం విశేషం. వివరాల్లోకి వెళితే.. ప్రస్తుతం టోక్యో ఒలింపిక్స్‌తో పాటు హంగేరీలోని బుడాపెస్ట్‌లో వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీలు జరుగుతున్నాయి. ఆదివారం భారత రెజ్లర్ ప్రియా మాలిక్ వరల్డ్ క్యాడెట్ రెజ్లింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో గోల్డ్ మెడల్ సాధించింది. అయితే ఆమె ఒలింపిక్స్‌లోనే ఆ మెడల్ గెలిచిందనుకొని టీమిండియా క్రికెటర్లు ఇషాంత్ శర్మ, హనుమ విహారిలు.. సోషల్ మీడియా వేదికగా ఆమెకు కంగ్రాట్స్ చెప్పారు. వీరిలాగే ఇంకా చాలా మంది ప్రముఖులు కూడా ప్రియా మాలిక్ ఒలింపిక్స్‌లోనే మెడల్ గెలిచిందనుకొని శుభాకాంక్షలు చెప్పడం ప్రారంభించారు. దీంతో ట్విటర్లో #NotOlympics ట్రెండింగ్ అయ్యింది. కాగా, ఈ విషయం తెలుసుకున్న టీమిండియా క్రికెటర్లు.. వెంటనే తమతమ ట్వీట్లు డిలీట్ చేయడం విశేషం. ఇదిలా ఉంటే, టోక్యో ఒలింపిక్స్‌లో వెయిట్‌లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను రజత పతకం గెలిచిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఇషాంత్.. చానుకు శుభాకాంక్షలు తెలిపాడు. -
మెరిసిన భారత రెజ్లర్లు
సోఫియా (బల్గేరియా): ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు తొమ్మిది పతకాలు సాధించారు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్లో ఫ్రీస్టయిల్ బాలుర విభాగంలో ఉదిత్ (48 కేజీలు), అమన్ (55 కేజీలు), మనీశ్ గోస్వామి (65 కేజీలు), అనిరుధ్ కుమార్ (110 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. గ్రీకో రోమన్ బాలుర విభాగంలో రూపిన్ (48 కేజీలు) కాంస్యం నెగ్గగా... ప్రవీణ్ పాండురంగ పాటిల్ (55 కేజీలు) రజతం సొంతం చేసుకున్నాడు. భారత గ్రీకో రోమన్ జట్టుకు తెలంగాణకు చెందిన జి.అశోక్ కుమార్ కోచ్‌గా వ్యవహరించడం విశేషం. ఫ్రీస్టయిల్ బాలికల విభాగంలో కోమల్ (40 కేజీలు), సోనమ్ (65 కేజీలు) స్వర్ణాలు సొంతం చేసుకోగా... హనీ కుమారి (46 కేజీలు) కాంస్యం గెల్చుకుంది. -
చాంపియన్ అనిల్
సారాయెవో (బోస్నియా) : ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్ అనిల్ స్వర్ణ పతకాన్ని సాధించాడు. ఆదివారం జరిగిన 50 కేజీల ఫ్రీస్టయిల్ విభాగం ఫైనల్లో అనిల్ 10-6తో ఎఫాన్ అయిని (ఇరాన్)పై గెలుపొందాడు. అంతకుముందు సెమీఫైనల్లో అనిల్ 10-0తో తుమెంట్సోగట్ (మంగోలియా)పై, క్వార్టర్ ఫైనల్లో 12-2తో కావెచి (టర్కీ)పై విజయం సాధించాడు.