![Sonam Malik grabs gold, Komal in final at Cadet World Championship - Sakshi](/styles/webp/s3/article_images/2019/08/5/ASHOK-COACH-WINNERS.jpg.webp?itok=UthqGmH0)
పతకాలు నెగ్గిన ప్రవీణ్, రూపిన్‌లతో భారత గ్రీకో రోమన్ జట్టు కోచ్ జి.అశోక్ కుమార్ (మధ్యలో)
సోఫియా (బల్గేరియా): ప్రపంచ క్యాడెట్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో భారత రెజ్లర్లు తొమ్మిది పతకాలు సాధించారు. ఆదివారం ముగిసిన ఈ మెగా ఈవెంట్‌లో ఫ్రీస్టయిల్ బాలుర విభాగంలో ఉదిత్ (48 కేజీలు), అమన్ (55 కేజీలు), మనీశ్ గోస్వామి (65 కేజీలు), అనిరుధ్ కుమార్ (110 కేజీలు) కాంస్య పతకాలు గెలిచారు. గ్రీకో రోమన్ బాలుర విభాగంలో రూపిన్ (48 కేజీలు) కాంస్యం నెగ్గగా... ప్రవీణ్ పాండురంగ పాటిల్ (55 కేజీలు) రజతం సొంతం చేసుకున్నాడు. భారత గ్రీకో రోమన్ జట్టుకు తెలంగాణకు చెందిన జి.అశోక్ కుమార్ కోచ్‌గా వ్యవహరించడం విశేషం. ఫ్రీస్టయిల్ బాలికల విభాగంలో కోమల్ (40 కేజీలు), సోనమ్ (65 కేజీలు) స్వర్ణాలు సొంతం చేసుకోగా... హనీ కుమారి (46 కేజీలు) కాంస్యం గెల్చుకుంది.
Comments
Please login to add a commentAdd a comment