ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థులను వెనక్కి పంపించడంపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్
సుష్మాస్వరాజ్‌కు కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: ఉన్నత చదువుల కోసం అమెరికా వెళ్లిన తెలుగు విద్యార్థులను వెనక్కి పంపించడంపై విదేశాంగ శాఖ మంత్రి సుష్మాస్వరాజ్‌కు రాష్ట్ర పంచాయతీరాజ్, ఐటీ శాఖ మంత్రి కె.తారకరామారావు లేఖ రాశారు. చట్టబద్ధంగా హైదరాబాద్‌లోని అమెరికా కాన్సులేట్ వారు ఇచ్చిన వీసా, అనుమతి పత్రాలన్నీ ఉన్నా తెలంగాణ విద్యార్థులను వెనక్కి పంపడం వల్ల అన్యాయం జరిగిందన్నారు. అమెరికాలో విద్య కోసం విద్యార్థులు వివిధ బ్యాంకుల నుంచి రుణాలు తీసుకున్నారని, ఇప్పుడు వారంతా అప్పుల్లో కూరుకుపోయి, ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్నారని పేర్కొన్నారు.
అమెరికా అధికారులు విద్యార్థులతో ప్రవర్తించిన తీరుపై కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని అమెరికా ప్రభుత్వంతో మాట్లాడి సమస్యను పరిష్కరించాలని సుష్మను కోరారు. అవసరమైతే సుష్మాస్వరాజ్‌ను తాను స్వయంగా కలుస్తానని కేటీఆర్ చెప్పారు.