సౌదీ కంపెనీ నిర్బంధంలోని కార్మికులను విడిపించండి
కేంద్ర మంత్రి సుష్మాకు కేటీఆర్ లేఖ
సాక్షి, హైదరాబాద్: సౌదీ అరేబియాలోని అల్–హజ్రీ ఓవర్సీస్ కంపెనీ నిర్బంధంలో ఉన్న 29 మంది రాష్ట్ర కార్మికులకు విముక్తి కల్పించి, స్వదేశానికి రప్పించేందుకు సహకరించాలని విదేశీ వ్యవహారాల మంత్రి సుష్మా స్వరాజ్‌కు రాష్ట్ర ఎన్‌ఆర్‌ఐ విభాగం మంత్రి కె.తారకరామా రావు సోమవారం లేఖ రాశారు. కార్మికులను కంపెనీ యాజమాన్యం ఓ గదిలో నిర్బంధించిందని ఆయన కేంద్ర మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్మికులను భారత్ పంపించేందుకు కంపెనీ ఒక్కొక్కరి నుంచి రూ.50 వేలు డిమాండ్ చేస్తోందన్నారు. కార్మికులు స్థానిక కార్మిక కోర్టుని ఆశ్రయించగా, కంపెనీ సొంత ఖర్చులతో 3 రోజుల్లో కార్మికులను స్వదేశానికి పంపించా లని తీర్పు ఇచ్చిందన్నారు. అయినా, కంపెనీ యాజమాన్యం కార్మి కులను ఓ గదిలో నిర్బందంలో ఉంచిందన్నారు. సౌదీలోని కంజీ నగరం అల్ సఫానియా ప్రాంతంలో ఈ కార్మికులు ఉన్నారని తెలిపారు.
డీఎన్‌ఏ టెస్టు కోసం అబుదాబీకి
ఇదిలా ఉండగా అబుదాబీలో జరిగిన ఓ అగ్నిప్రమాదంలో మృతిచెందిన నలుగురు రాష్ట్ర కార్మికుల మృతదేహాలను డీఎన్‌ఏ పరీక్షల ద్వారా గుర్తించేందు కోసం రక్త నమూనాలు అందజేసేందుకు వారి కుటుంబ సభ్యులు మంగళవారం శంషాబాద్ విమానాశ్రయం నుంచి అబు దాబీకి వెళ్లనున్నారు. కేటీఆర్ ఆదేశాల మేరకు వారికి పాస్‌పోర్టు, వీసా ఏర్పాట్ల ను పూర్తి చేసినట్లు సాధారణ పరిపాలన విభాగం ఓ ప్రకటనలో తెలిపింది.