సాక్షి, హైదరాబాద్: ఐఐటీల్లో ప్రవేశాలకోసం నిర్వహించి జేఈఈ మెయిన్ పరీక్ష పలితాల్లో తెలుగు విద్యార్థులు మెరిసారు. ఈ ఏడాది జనవరి 7వ తేదీ నుంచి 9వ తేదీ వరకు జరిగిన జేఈఈ మెయిన్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. దేశవ్యాప్తంగా 100 పర్సంటైల్ సాధించిన వారు 9 మంది ఉండగా... ఇందులో తెలుగు విద్యార్థులు నలుగురు ఉన్నారు. వీరిలో తెలంగాణకు చెందిన రొంగల అరుణ్ సిద్దార్ధ, చాగరి కౌశల్‌కుమార్‌రెడ్డి, ఏపీకి చెందిన లంధ జితేంద్ర, తాడవర్తి విష్ణు శ్రీసాయి శంకర్ ఉన్నారు. జేఈఈ మెయిన్ పరీక్ష రాసేందుకు దేశవ్యాప్తంగా 9,21,261 మంది రిజిస్ట్రేషన్ చేసుకోగా... 8,69,010 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు.
అడ్వాన్స్‌లోనూ కష్టపడతా
జేఈఈ మెయిన్‌లో వంద పర్సంటైల్ రావడం ఆనందంగా ఉంది. జేఈఈ అడ్వాన్స్‌లోనూ ఇదే తరహాలో కష్టపడి అత్యుత్తమ పర్సంటైల్ సాధిస్తా. బెస్ట్ ఐఐటీలో చదవడమే నా లక్ష్యం.
– అరుణ్ సిద్దార్ధ
ఆవిష్కరణలంటే ఇష్టం
మెయిన్‌లో మంచి స్కోర్ వచ్చింది. ఇప్పుడు నా లక్ష్యం జేఈఈ అడ్వాన్స్‌పరీక్షే. ఐఐటీ బాంబేలో చదవాలని ఉంది. కానీ అడ్వాన్స్ ర్యాంకు బట్టి వచ్చే ఐఐటీలో చేరతా. కొత్త ఆవిష్కరణలంటే ఇష్టం.
– చాగరి కౌశల్‌కుమార్‌రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment