మెరిసిన తెలుగు తేజాలు | జేఈఈ అడ్వాన్స్‌డ్ టాప్ 10లో ఐదు ర్యాంకులు మనోళ్లకే | Sakshi
Sakshi News home page

మెరిసిన తెలుగు తేజాలు

Published Mon, Jun 13 2016 1:55 AM | Last Updated on Mon, Sep 4 2017 2:20 AM

జేఈఈ అడ్వాన్స్‌డ్ టాప్ 10లో ఐదు ర్యాంకులు మనోళ్లకే

సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో తెలుగు విద్యార్థులు సత్తా చాటారు. టాప్ 100 ర్యాంకుల్లో 29 ర్యాంకులను మనోళ్లే కైవసం చేసుకున్నారు. టాప్ 10 ర్యాంకుల్లో ఏకంగా 5 ర్యాంకులను సాధించారు. మే 22న నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష ఫలితాలు, ఆల్ ఇండియా ర్యాంకులను ఐఐటీ గువాహటి ఆదివారం ప్రకటించింది. జేఈఈ మెయిన్‌లో దేశంలోనే అత్యధిక మార్కులను సాధించిన తెలుగు విద్యార్థులు.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో మాత్రం మొదటి మూడు ర్యాంకులను సాధించలేకపోయారు. రాజస్థాన్‌లోని జైపూర్‌కు చెందిన అమన్ బన్సాల్ మొదటి ర్యాంకు సాధించగా.. హరియాణా యమునానగర్‌కు చెందిన భవేశ్ డింగ్రా 2వ ర్యాంకు సాధించాడు.

జైపూర్‌కే చెందిన కునాల్ గోయల్ మూడో ర్యాంకు సాధించాడు. టాప్ 10 ర్యాంకుల్లో 4, 5, 7, 8, 10 ర్యాంకులను తెలుగు విద్యార్థులు సాధించారు. వీరంతా అబ్బాయిలే కావడం గమనార్హం. ఎన్‌ఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ మెయిన్‌లో దేశంలోనే అత్యధిక మార్కులు(345) సాధించిన తాళ్లూరి సాయితేజ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో ఐదో ర్యాంకు సాధించాడు. జేఈఈ మెయిన్‌లో టాప్-5 విద్యార్థుల జాబితాలో లేని దుగ్గాని జీవితేశ్ జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో నాలుగో ర్యాంకు సాధించాడు. ఓబీసీ నాన్ క్రీమీలేయర్ (ఎన్‌సీఎల్) కేటగిరీలో జాతీయ స్థాయిలో జీవితేశ్ మొదటి స్థానంలో నిలిచాడు. ఇదే కేటగిరీలో టాప్-20లో 8 మంది తెలుగు విద్యార్థులే ఉన్నారు.

 ఓపెన్‌లో 75 మార్కులొస్తే ర్యాంకు..
జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను 372 మార్కులకు (ఫిజిక్స్-124, కెమిస్ట్రీ-124, మ్యాథ్స్-124) నిర్వహించారు. ఇందులో ప్రతి సబ్జెక్టులో 10 శాతం మార్కులు, మొత్తంగా 372 మార్కులకు కనీసం 35 శాతం(130కిపైగా) మార్కులు వస్తేనే అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించినట్లు పరిగణిస్తామని ఐఐటీ గువాహటి ప్రకటించింది. అయితే ర్యాంకుల ఖరారు సందర్భంగా మాత్రం ప్రతి సబ్జెక్టులో కనీస అర్హత మార్కులను మార్చలేదు. కానీ మొత్తం మార్కుల్లో రావాల్సిన కనీస అర్హత మార్కులను భారీగా తగ్గించింది. ఓపెన్ కేటగిరీలో 20 శాతం మార్కులు సాధించిన వారికి ర్యాంకులను కేటాయించింది. అంటే ఓపెన్‌లో 75 మార్కులు సాధించిన వారిని అర్హులుగా ప్రకటించి ర్యాంకులను కేటాయించింది. అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ తదితర కేటగిరీల్లోనూ మొత్తం మార్కుల్లో కనీస అర్హత మార్కులను తగ్గించింది.

 సర్వర్ డౌన్‌తో తంటాలు
ఆదివారం ఉదయం 10 గంటలకు ఫలితాలు విడుదల చేస్తామని ఐఐటీ గువాహటి ముందుగానే ప్రకటించింది. తీరా ర్యాంకులు వెలువడే సమయానికి సర్వర్ డౌన్ కావడంతో విద్యార్థులు ఆందోళనకు గురయ్యారు. మధ్యాహ్నం కొంతసేపు వెబ్‌సైట్ పని చేసింది. ఆ తర్వాత మళ్లీ డౌన్ అయింది. ఎట్టకేలకు సాయంత్రానికల్లా విద్యార్థులు తమ ర్యాంకులను తెలుసుకున్నారు.

 

 ఓపెన్ కేటగిరీలో టాప్ ర్యాంకర్లు..

ర్యాంకు      పేరు          ప్రాంతం

1           

అమన్ బన్సాల్           జైపూర్

2            

భవేష్ డింగ్రా               

యమునానగర్

3             

కునాల్ గోయల్       

జైపూర్

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement