ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో రాబోయే డిసెంబర్‌లో జరిగే 8వ వార్షిక 1ఎమ్1బి (1మిలియన్ ఫర్ 1బిలియన్) యాక్టివేట్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొనడానికి తెలంగాణలోని వివిధ కాలేజీలకు చెందిన ఐదుగురు యువ ఆవిష్కర్తలు ఎంపికయ్యారు.
వీరిలో నలుగురు అమ్మాయిలు– నారాయణం భవ్య, పెమ్మసాని లిఖిత చౌదరి, సత్యవతి కోలపల్లి, మనల్ మునీర్ కాగా మరొకరు మీత్‌కుమార్ షా ఉన్నారు. వీరి ఆవిష్కరణలకు ‘1ఎమ్1బి గ్రీన్‌స్కిల్స్ అకాడమీ’ వేదికయ్యింది. ఐదు నెలలపాటు సాగిన ఈ ప్ర్రక్రియలో 200 మంది పాల్గొనగా ఐదుగురు తెలుగు విద్యార్థులు ఎంపికై యువ ప్రతిభ కు ప్రేరణగా నిలిచారు.
పట్టణ సవాళ్ల పరిష్కారం
‘మానిఫెస్టింగ్ మ్యాన్ హోల్స్’ పేరుతో పట్టణ వరదలు, సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగాప్రాజెక్ట్‌ను ఆవిష్కరించాను. భారతీయ నగరాల్లో మౌలిక సదుపాయాల
భద్రతను కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం.
– నారాయణం భవ్య
టెక్.. టూర్
‘ఇంటెలినెక్సా’ అనే నాప్రాజెక్ట్ ఎకో–టూరిజంను ఏఆర్, వీఆర్, ఏఐల ద్వారా మార్చేందుకుæవీలుగా ఫీచర్లను అందిస్తోంది. వైల్డ్ లైఫ్ ట్రైల్స్, వీఆర్ అడ్వెంచర్స్, ఎకో కెరీర్ గైడ్స్, ఎకో డైరీస్ ద్వారా మనప్రాంతాల పట్ల సమాజానికి అవగాహన కల్పించడం, గ్లోబల్ ఫోరమ్‌లపై ప్రభావం చూపడమే లక్ష్యంగా దీనిని ఆవిష్కరించాను.
– మనల్ మునీర్
లక్ష్యానికి మార్గం
‘అప్నా ఇంటర్వ్యూ క్రాకర్’ అనే నాప్రాజెక్ట్ మార్కెట్ ట్రెండ్‌లు, పోర్ట్‌ఫోలియో క్రియేషన్, ఎటిఎస్ రెజ్యూమ్ టెంప్లేట్‌లు, ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూషన్ లను అందించే ఒక వేదిక. దీని ద్వారా ఎంతోమంది తమ లక్ష్యాలు చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది.
– మీత్ కుమార్ షా
విద్యార్థులకు ప్రాక్టికల్ స్కిల్స్
‘టెక్.వెసాలియస్’ అనే నాప్రాజెక్ట్ లక్ష్యం అనాటమీ విద్యలో ఎఆర్/విఆర్ సాంకేతికత ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకురావడం. విద్యార్థులందరికీ అందుబాటులో ఉండేలా, వారిలోప్రాక్టికల్ స్కిల్స్ పెంపొందించడమే ఈ ఆవిష్కరణ లక్ష్యం.
– పెమ్మసాని లిఖిత చౌదరి
వాస్తవ అనుభూతి
నారు పోషణలో ఏఐ సాధనాలు, మెటా స్పార్క్ స్టూడియోని ఉపయోగించుకొని వాస్తవ అనుభూతిని ఎలా పొందవచ్చో నాప్రాజెక్ట్ పరిచయం చేస్తుంది. అంతేకాదు కెమెరా ట్రాకింగ్ ద్వారా వినియోగదారులకు వారి మొక్కలను సేంద్రీయంగా, వేగంగా ఎలా పెంచాలనే దానిపై లింక్‌లు, మార్గదర్శకాలను అందిస్తుంది. మొక్కల పెంపకంపై రూపొందించిన ప్రాజెక్ట్ ఇది.
– సత్యవతి కోలపల్లి
Comments
Please login to add a commentAdd a comment