telangana youth
-
ఐక్యరాజ్యసమితికి తెలుగు యువ ప్రతిభ
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో రాబోయే డిసెంబర్లో జరిగే 8వ వార్షిక 1ఎమ్1బి (1మిలియన్ ఫర్ 1బిలియన్) యాక్టివేట్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొనడానికి తెలంగాణలోని వివిధ కాలేజీలకు చెందిన ఐదుగురు యువ ఆవిష్కర్తలు ఎంపికయ్యారు. వీరిలో నలుగురు అమ్మాయిలు– నారాయణం భవ్య, పెమ్మసాని లిఖిత చౌదరి, సత్యవతి కోలపల్లి, మనల్ మునీర్ కాగా మరొకరు మీత్కుమార్ షా ఉన్నారు. వీరి ఆవిష్కరణలకు ‘1ఎమ్1బి గ్రీన్స్కిల్స్ అకాడమీ’ వేదికయ్యింది. ఐదు నెలలపాటు సాగిన ఈ ప్ర్రక్రియలో 200 మంది పాల్గొనగా ఐదుగురు తెలుగు విద్యార్థులు ఎంపికై యువ ప్రతిభ కు ప్రేరణగా నిలిచారు.పట్టణ సవాళ్ల పరిష్కారం‘మానిఫెస్టింగ్ మ్యాన్ హోల్స్’ పేరుతో పట్టణ వరదలు, సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగాప్రాజెక్ట్ను ఆవిష్కరించాను. భారతీయ నగరాల్లో మౌలిక సదుపాయాల భద్రతను కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. – నారాయణం భవ్యటెక్.. టూర్‘ఇంటెలినెక్సా’ అనే నాప్రాజెక్ట్ ఎకో–టూరిజంను ఏఆర్, వీఆర్, ఏఐల ద్వారా మార్చేందుకుæవీలుగా ఫీచర్లను అందిస్తోంది. వైల్డ్ లైఫ్ ట్రైల్స్, వీఆర్ అడ్వెంచర్స్, ఎకో కెరీర్ గైడ్స్, ఎకో డైరీస్ ద్వారా మనప్రాంతాల పట్ల సమాజానికి అవగాహన కల్పించడం, గ్లోబల్ ఫోరమ్‌లపై ప్రభావం చూపడమే లక్ష్యంగా దీనిని ఆవిష్కరించాను.– మనల్ మునీర్లక్ష్యానికి మార్గం‘అప్నా ఇంటర్వ్యూ క్రాకర్’ అనే నాప్రాజెక్ట్ మార్కెట్ ట్రెండ్లు, పోర్ట్‌ఫోలియో క్రియేషన్, ఎటిఎస్ రెజ్యూమ్ టెంప్లేట్లు, ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూషన్ లను అందించే ఒక వేదిక. దీని ద్వారా ఎంతోమంది తమ లక్ష్యాలు చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. – మీత్ కుమార్ షావిద్యార్థులకు ప్రాక్టికల్ స్కిల్స్‘టెక్.వెసాలియస్’ అనే నాప్రాజెక్ట్ లక్ష్యం అనాటమీ విద్యలో ఎఆర్/విఆర్ సాంకేతికత ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకురావడం. విద్యార్థులందరికీ అందుబాటులో ఉండేలా, వారిలోప్రాక్టికల్ స్కిల్స్ పెంపొందించడమే ఈ ఆవిష్కరణ లక్ష్యం. – పెమ్మసాని లిఖిత చౌదరివాస్తవ అనుభూతినారు పోషణలో ఏఐ సాధనాలు, మెటా స్పార్క్ స్టూడియోని ఉపయోగించుకొని వాస్తవ అనుభూతిని ఎలా పొందవచ్చో నాప్రాజెక్ట్ పరిచయం చేస్తుంది. అంతేకాదు కెమెరా ట్రాకింగ్ ద్వారా వినియోగదారులకు వారి మొక్కలను సేంద్రీయంగా, వేగంగా ఎలా పెంచాలనే దానిపై లింక్‌లు, మార్గదర్శకాలను అందిస్తుంది. మొక్కల పెంపకంపై రూపొందించిన ప్రాజెక్ట్ ఇది. – సత్యవతి కోలపల్లి -
గల్ఫ్ చట్టాలు తెలియక చిక్కుల్లో..
సిరిసిల్ల: దుబాయ్‌లోని చట్టాలపై అవగాహన లేక అక్కడ చిక్కుల్లో పడ్డ ఐదుగురు తెలంగాణ యువకులు మంత్రి కేటీఆర్ చొరవతో ఎట్టకేలకు సొంతూళ్ళకు రానున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకి చెందిన గుగులోత్ అరవింద్, పెద్దోళ్ల స్వామి, గొల్లపెల్లి రాము, అనిల్, నిజామాబాద్ జిల్లాకి చెందిన నరేందర్ ఐదు నెలల కిందట కంపెనీ వీసాలపై లైసెన్స్ ఏజెంట్స్ ద్వారా దుబాయ్‌కి వెళ్లారు. లేబర్క్యాంపులో వసతులు కల్పించి పని ఇచ్చినా.. వెళ్లేందుకు నిరాకరిస్తూ గొడవకు దిగారు. దాంతో లేబర్‌కోర్టు అధికారులు అక్కడి సీసీ కెమెరా పుటేజీలు పరిశీలించి వీరి ప్రవర్తన బాగా లేదని నిర్ధారించి, దేశం విడిచి పోకుండా పాస్‌పోర్టులపై ఆంక్షలు విధించారు. కాగా ఈ ఐదుగురు తిరిగి భారత్ వచ్చేందుకు దుబాయ్ ఎయిర్ పోర్టుకు వెళ్ళగా. ఆ పాస్‌పోర్టులపై ఆంక్షలు ఉండడంతో ఎయిర్‌పోర్టు అధికారులు వారిని వెనక్కి పంపారు. దీంతో వారు గల్ఫ్ ఏజెంట్ చేతిలో మోసపోయామని కేటీఆర్ ఆదుకోవాలంటూ ఎయిర్‌పోర్టు ముందు నుంచి వీడియో తీసి వైరల్ చేశారు. మంత్రి కేటీఆర్ ఆదేశాలతో... వీడియో పై మంత్రి కేటీఆర్ స్పందించారు. దుబాయ్‌లోని భారత రాయబార కార్యాలయం అధికారులకు లేఖ రాశా రు. దుబాయ్‌లోనే ఉండే గల్ఫ్ కార్మికుల రక్షణ సమితి అధ్య క్షుడు గుండెల్లి నర్సింహులు ఎంబసీ అధికారులతో మాట్లా డి, కంపెనీ ప్రతినిధులతో చర్చించారు. ఇందులో కంపెనీ తప్పిదం ఏమీ లేదని, ఉపాధి కోసం వచ్చిన సదరు యువకు ల పొరపాటుతోనే ఈ ఘటన చోటుచేసుకున్నట్లు నిర్ధారించారు. మంత్రి కేటీఆర్ చొరవతో వారికి విమాన టికెట్లను సమకూర్చగా మూడు రోజుల్లో ఇండియాకు రానున్నారు. -
గల్ఫ్ ఏజెంట్ల చేతిలో మోసపోయి.. గోస
సిరిసిల్ల: గల్ఫ్ ఏజెంట్ల చేతిలో కొందరు తెలంగాణ యువకులు మోసపోయారు. దుబాయ్ ఎయిర్ పోర్టులో చిక్కిన యువకులు ఆదివారం తమ గోడును వీడియో ద్వారా మీడియాకు పంపించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లికి చెందిన గుగులోత్ అరవింద్, ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్‌కు చెందిన పెద్దోళ్ల స్వామి, కోనరావుపేట మండలం బావుసాయిపేటకు చెందిన గొల్లపెల్లి రాము, చందుర్తి మండలం ఎన్గల్‌కు చెందిన అనిల్, నిజామాబాద్ జిల్లా మోపాల్ మండలం నర్సింగ్‌పల్లికి చెందిన నరేందర్‌లు ఐదు నెలల క్రితం కంపెనీ వీసాలపై దుబాయ్ వెళ్లారు. గల్ఫ్ ఏజెంట్లు ఇండియాలో వీసాకు ఇంటర్వ్యూలు చేసినప్పుడు చెప్పిన పని కాకుండా.. వేరే లేబర్ పని చేయిస్తున్నారని, చెప్పిన విధంగా జీతం ఇవ్వడం లేదని బాధితులు ఆరోపించారు. ఈ విషయంపై కంపెనీలో గొడవ జరిగిందని, ఇటీవల కంపెనీ హెచ్ఆర్ అధికారులు ‘మీరు క్యాంపు నుంచి వెళ్లిపోండి’అంటూ.. పాస్‌పోర్టులు ఇచ్చారని బాధితులు తెలిపారు. పాస్‌పోర్టులు చేతికి రావడంతో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి విమాన టికెట్‌కు డబ్బులు తెప్పించుకున్నామని వివరించారు. స్వస్థలాలకు వచ్చేందుకు విమాన టికెట్లు కొనుక్కొని ఎయిర్ పోర్టుకు వస్తే.. బోర్డింగ్ అయిన తరువాత ఎయిర్ పోర్టు అధికారులు ‘మీ మీద కేసులు ఉన్నాయి.. మీరు తాగి క్యాంపులో గొడవ చేశారట.. వాటిని పరిష్కరించుకుని రావాలి’అని విమాన టికెట్లు చింపేసి, వెనక్కి పంపించారని వెల్లడించారు. తమ అందరి లగేజీ ఎయిర్ పోర్టులోనే ఉందని వాపోయారు. మూడురోజులుగా ఎయిర్ పోర్టులోనే.. ఎయిర్ పోర్టులోనే మూడు రోజులుగా ఉంటున్నామని బాధి తులు తెలిపారు. అయితే ఎవరూ స్పందించడం లేదని, తిండి, నీళ్లు లేక ఎయిర్ పోర్టు పరిసరాల్లో కట్టుబట్టలతో గడుపు తున్నట్లు వివరించారు. పోలీసులు వస్తే.. పక్కకు తప్పుకుంటూ.. భయం భయంగా ఉంటున్నామని వాపోయారు. మంత్రి కేటీఆర్‌కు వినతి ఏజెంట్ల మాటలతో మోసపోయామని, తమను ఇండియాకు రప్పించేందుకు మంత్రి కేటీఆర్ సహకరించాలని వీర్నపల్లికి చెందిన యువకుడు అరవింద్ వీడియోలో కోరారు. దయచేసి తమను ఇంటికి చేరేలా చూడాలని, ఇక్కడ చాలా ఇబ్బంది పడుతున్నామని బాధితులు మంత్రిని వేడుకున్నారు. దుబాయ్‌లో చిక్కిన తెలంగాణ యువకుల గోడు సోషల్ మీడియాలోనూ వైరల్ అయింది. దీనిపై పోలీసులు ఆరా తీస్తున్నారు. -
బ్రిటిష్ కౌన్సిల్‌తో తెలంగాణ ఒప్పందం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ యువతకు విద్యారంగంలో విశ్వవ్యాప్తంగా అవకాశాలు కల్పించే లక్ష్యంతో గతంలో ఉన్న భాగస్వామ్యాన్ని కొనసాగిస్తూ ఇంగ్లండ్‌కు చెందిన బ్రిటిష్ కౌన్సిల్, రాష్ట్ర ప్రభుత్వం బుధవారం అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నాయి. మూడేళ్ల పాటు ఈ ఒప్పందం కొనసాగుతుంది. ఇందులో భాగంగా తెలంగాణ, యూకేలోని విశ్వవిద్యాలయాలు, పరిశోధన సంస్థలు, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీల మధ్య సమన్వయం కోసం తెలంగాణ ప్రభుత్వ సంస్థ రిచ్ (రీసెర్చ్ ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్), బ్రిటిష్ కౌన్సిల్ సంయుక్తంగా కృషి చేస్తాయి. అంతరిక్షం, రక్షణ, జీవ, ఔషధ, ఆహారం, వ్యవసాయం, ఆంగ్లం, సుస్థిరాభివృద్ధి వంటి రంగాల్లో రిచ్‌తో పాటు బ్రిటిష్ కౌన్సిల్ నాలెడ్జ్ పార్ట్నర్గా వ్యవహరిస్తుంది. తెలంగాణ యువతకు అవసరమైన నైపుణ్యాలు, ఉత్తమ విధానాల్లో శిక్షణ కోసం అవసరమయ్యే ఆవిష్కరణలపై యూకే, రిచ్ కలిసి పనిచేస్తాయి. ఈ ఒప్పంద కార్యక్రమంలో ఐటీ, పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, రిచ్ డైరెక్టర్ జనరల్ అజిత్ రంగ్నేకర్, తెలంగాణ, ఏపీ బ్రిటిష్ డిప్యూటీ హై కమిషనర్ ఆండ్రూ ఫ్లెమింగ్, దక్షిణ భారత విభాగం బ్రిటిష్ డైరెక్టర్ జనక పుష్పనాథన్ తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి మల్లారెడ్డి ఇంటి ముట్టడికి యూత్ కాంగ్రెస్ యత్నం
-
సాగుకు చదువుల దన్ను
ఒకపక్క– వ్యవసాయాన్ని నామోషీగా భావించి, ఐదారువేల జీతానికే పల్లెలను వదిలి పట్టణాల్లో ఉద్యోగాలు చేస్తున్న యువత.. మరోపక్క– ఉన్నత చదువులు చదివి, లక్షల్లో వేతనం వస్తున్నా.. అందులో లభించని తృప్తిని మట్టిని నమ్ముకుని పొందాలనే తపనతో ఉద్యోగాలొదిలి పల్లెబాట పడుతున్నారు మరికొందరు. పచ్చని పంట పొలాల్లో.. వ్యవసాయంతో పాటు అనుబంధ రంగాల్లో ఉపాధి పొందుతూ సంతృప్తి చెందుతున్న చదువుకున్న యువకుల ‘సాగు’ లాభాల పంట పండిస్తోంది. సాక్షి, జగిత్యాల: ఉద్యోగాలు వదిలి కొందరు, ఉన్నత చదువులు చదివి ఇంకొందరు వ్యవసాయంలోకి దిగుతున్నారు. దాని అనుబంధ రంగాల్లోనూ వస్తున్న కొత్త టెక్నాలజీని ఈ యువ రైతులు అందిపుచ్చుకుంటూ ముందంజలో ఉంటున్నారు. నూతన వ్యవసాయ పద్ధతులను ఇతర రైతులకు సైతం చెబుతూ, వారిని తమ మార్గంలోకి మళ్లేలా ప్రయత్నిస్తున్నారు. ఆయా రంగాల్లోని యువ రైతులు సంయుక్తంగా తమ ఉత్పత్తులను నేరుగా వినియోగదారులకే చేరవేసేలా మార్కెటింగ్ కూడా చేస్తూ లాభాలు గడిస్తున్నారు. ‘సోషల్’ సాగు అంతర్గాంకు చెందిన వామన్‌రెడ్డి బీటెక్ చదివాడు. వ్యవసాయంపై ఉన్న ఇష్టంతో కూరగాయల సాగును చేపట్టాడు. వీటి సాగులో వినూత్న పద్ధతులు పాటిస్తూ.. అధిక దిగుబడులు సాధిస్తూ తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నాడు. ఒక చేయి సరిగ్గా పనిచేయకున్నా.. తానే అన్ని పనులూ చేసుకుంటాడు. కూరగాయలను స్వయంగా మార్కెట్లో విక్రయిస్తూ వినియోగదారుల మనుసు గెలుచుకుంటున్నాడు. రైతులు ఎక్కడ మోసపోయినా అక్కడ గళమెత్తడం కూడా వామన్‌రెడ్డి ప్రత్యేకత. రైతులను చైతన్యం చేసేందుకు ఫేస్బుక్, వాట్సాప్‌లను ఉపయోగిస్తున్నాడు. వారికి సస్యరక్షణ, ఆధునిక సాగు పద్ధతులపై సలహా సూచనలతో పాటు చైతన్యవంతుల్ని చేసేలా వివిధ అంశాలపై అవగాహన కల్పిస్తున్నాడు. బంగారు నాటుకోడి గుడ్డు హైదరాబాద్‌లో బీటెక్ చదివిన సుభాష్ది జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామం. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా పనిచేశాడు. మంచి జీతమే వస్తున్నా.. ఆ జీవితం తృప్తిగా లేకపోవడంతో సొంతూరు తిరిగొచ్చేశాడు. ప్రస్తుతం నాటుకోళ్లను పెంచుతూ ఉపాధి పొందుతున్నాడు. అందరూ కొత్తలో ఇదేం పనని ఆశ్చర్యపోయినా.. ఈ రంగంలో తనదైన ముద్ర వేస్తున్నాడు. కోళ్ల నుంచి వచ్చిన గుడ్లను ప్రత్యేక పద్ధతుల్లో పిల్లలుగా మారుస్తున్నాడు. నాటుకోళ్లను అందరి మాదిరిగా షెడ్లలో కాకుండా, మామిడి, జామ తోటల్లో పెంచుతూ, డిమాండ్‌ను బట్టి కిలో రూ.250–రూ.300కి విక్రయిస్తూ మంచి లాభాలను ఆర్జిస్తున్నాడు. ‘పాడి’తో జోడీ లక్ష్మీపూర్‌కు చెందిన సురేశ్ హైదరాబాద్‌లో ఉంటూ బీటెక్ చదివాడు. కానీ ఎప్పటికైనా స్వయం ఉపాధి కల్పించుకుని తన కాళ్లపై తాను నిలబడాలనేది అతని లక్ష్యం. ఆ మక్కువతోనే స్వగ్రామంలో 30 ఆవులతో డెయిరీ ఫారాన్ని ప్రారంభించాడు. తొలుత నలుగురి భాగస్వామ్యంతో ఫారం నిర్వహించగా నష్టాలు వచ్చాయి. ప్రస్తుతం సురేశ్ ఒక్కడే వినూత్న ఆలోచనలతో ఫారం నిర్వహిస్తూ ఏడాదిలోనే లాభాల బాట పట్టించాడు. ఇప్పుడు ఆవులతో పాటు గేదెల డెయిరీ కూడా నిర్వహించి నేరుగా వినియోగదారులకు పాలు విక్రయించేలా వ్యూహరచన చేస్తున్నాడు. ‘ఇంజనీరింగ్’ సేద్యం లక్ష్మీపూర్‌కు చెందిన స్వామిరెడ్డి ఇంజనీరింగ్ చదివాడు. తల్లిదండ్రులు ఏదో ఒక ఉద్యోగం చూసుకోవచ్చు కదా అని అంటుంటే.. తాను వ్యవసాయం చేస్తానంటూ సేద్యంలోకి దిగాడు. ఇప్పుడు నూతన పద్ధతుల్లో వ్యవసాయం చేస్తూ అత్యధిక దిగుబడులు సాధిస్తుంటే ఆ తల్లిదండ్రులే మురిసిపోతున్నారు. పసుపు పంటకు డ్రిప్‌తో పాటు ప్రతీ పనికి ఆధునిక పరికరాలను ఉపయోగించడం స్వామిరెడ్డి ప్రత్యేకత. వ్యవసాయ పనులకు ట్రాక్టర్‌ను కొనుగోలు చేసి, డ్రైవర్ అవసరం లేకుండా తానే డ్రైవింగ్‌చేస్తూ వ్యవసాయ పనులు చేస్తున్నాడు. అలాగే, తాను ఆచరించే ఆధునిక సాగు పద్ధతులపై ఇతర రైతులకూ అవగాహన కల్పిస్తుంటాడు. -
సీన్ రివర్స్; పట్నం నుంచి పల్లెకు..
సాక్షి, భైంసాటౌన్: గ్రామాల్లో ఉపాధి లేకపోవడం, చిన్నా చితక పనులు చేసుకుందామంటే సమాజంలో చిన్నచూపు, ఉన్నతంగా బతకాలనే ఆశ.. ఇలా కారణమేదైనా.. యువత ఎక్కువగా పట్నం బాట పట్టినవారే.. ఉన్న ఊరిని, తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు అందరినీ విడిచి ఉద్యోగాల కోసం ఊరు విడిచిన వారే.. ఏసీ గదుల్లో ఉద్యోగం.. ఐదంకెల జీతం ఉండడంతో తమపై ఆధారపడిన కుటుంబానికి కొంతైనా సహాయ పడవచ్చని భావించినవారే.. అయితే ప్రస్తుతం వారి ఆలోచన మారుతోంది. ఉద్యోగ భద్రత లేకపోవడం, ఖర్చులు పెరగడం, వేతనం సరిపోకపోవడం, లేదా ఉద్యోగ సంతృప్తి లేకపోవడంతో సొంతూరిలోనే ఏదైనా పని చేసుకుందామని పట్నం వీడి ఊరిబాట పడుతున్నారు. పని ఒత్తిడి, భద్రత కరువు చదువుకున్న యువత ఎక్కువగా తమ అర్హతకు సరిపోయే ఉద్యోగాలు స్థానికంగా ఉండకపోవడంతో హైదరాబాద్, బెంగళూరు, చెన్నైలాంటి మహా నగరాలకు వెళ్లారు. అక్కడ ఐటీ కంపెనీల్లో, సాఫ్ట్వేర్ సంస్థల్లో ఐదంకెల జీతం చేసేవారు. తమ వేతనంలోంచి నెలనెలా కొంత తమ కుటుంబ సభ్యులకు పంపేవారు. పండుగలకు, ప్రత్యేక సందర్భాల్లో మాత్రమే తమ వారిని కలుసుకోవడానికి రావడానికి వీలుంటుంది. ఐటీ, సాఫ్ట్‌వేర్‌లాంటి సంస్థల్లో అధిక వేతనం ఉన్నా.. పని ఒత్తిడి కూడా అలాగే ఉంటుంది. దీంతోపాటు తుమ్మితే ఊడిపోయే ముక్కులాగా.. ఉద్యోగానికి భద్రత కూడా ఉండదు. అంతేగాకుండా మహానగరాల్లో ఇంటి అద్దె, పిల్లల స్కూలు ఫీజులు, ఇతర ఖర్చులు అధికంగానే ఉంటాయి. దీంతో పని ఒత్తిడి ఓవైపు.. పెరుగుతున్న ఖర్చులు మరోవైపు.. ఇలా మహానగరాల్లో పలువురు విసిగి వేశారుతున్నారు. పలకరించేవారు లేక.. కాలంతో పోటీ పడుతున్న ప్రస్తుత సమాజంలో.. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకునే వారే కరువయ్యారు. పట్టణాల్లోనూ ఇప్పుడు ఈ సంస్కృతి ఎక్కువవుతోంది. మహానగరాల్లోనైతే చెప్పాల్సిన పని లేదు. తమ ఇంటిపక్కన ఉండేవారి ముఖమే తెలియదంటే అతిశయోక్తి కాదు. స్మార్ట్ఫోన్ల ప్రభావంతో నలుగురు కలిసినా.. ఎప్పుడు వాట్సాప్, ఫేస్‌బుక్‌పైనే ధ్యాసంతా.. ఇక మనసారా మాట్లాడుకోవడం, కష్టసుఖాలు పంచుకునే తీరిక ఎక్కడిది.. పక్కనే ఉన్నా పలకరించం కానీ.. వాట్సాప్‌లో మాత్రం గుడ్మార్నింగ్లు.. గుడ్ నైట్లకు తక్కువుండదు.. ఎదురుగా ఉన్న పుట్టిన రోజు శుభాకాంక్షలు చెప్పం.. కానీ ఫేస్బుక్లో మాత్రం హ్యాపీ బర్త్‌డేలు.. ఇలా మనవారితో కంటే స్మార్ట్ఫోన్లతోనే ఎక్కువగా గడుపుతున్నాం. దీంతో మనుషుల మధ్య దూరం పెరుగుతోంది. అనుబంధాలకు దగ్గరవ్వాలని.. పెద్ద, పెద్ద నగరాల్లో భార్యాభర్తలు ఇద్దరూ ఉద్యోగం చేసేవారే ఎక్కువగా ఉంటారు. పొద్దున లేచింది మొదలు ఉరుకులు.. పరుగులు.. కాలు బయట పెడితే.. ట్రాఫిక్ తంటా.. సమయానికి ఆఫీసుకు వెళ్లకపోతే బాస్‌తో తంటా.. ఇన్ని తంటాల నడుమ పిల్లల గురించి పట్టించుకోకపోవడంతో వారు పెడదోవ పట్టే అవకాశం ఉంది. ఇప్పటి పిల్లలకు అమ్మానాన్న తప్పితే అమ్మమ్మ, తాతయ్య, పిన్ని, బాబాయ్, ఇతర బంధువుల గురించి తెలియదంటే అతిశయోక్తి కాదు.. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా కుటుంబాలు విడిపోయే పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో కొందరు స్థానికంగా తమవారికి అందుబాటులో ఉంటూ వ్యాపారం, వ్యవసాయంలాంటివి చేసుకుందామని, పిల్లలకు అనుబంధాల విలువ తెలియాలని సొంతూళ్లకు వస్తున్నారు. పాడితో ఉపాధి పొందుతున్నా.. గతంలో ఇక్కడ ఉపాధి సరిగా లేకపోవడంతో గల్ఫ్ దేశాలకు వెళ్లాను. అక్కడ మూడేళ్లు పనిచేశాను. అక్కడి ఆఫీస్‌లో అడ్మిన్‌గా పని చేశాను. నెలకు రూ.40 వేతనం వచ్చేది. వేతనం బాగానే ఉన్నా.. ఎక్కడో వెలితిగా ఉండేది. ప్రతిసారీ ఊరి వైపు మనసు మళ్లేది. సొంతూళ్లోనే ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నాను. ముందునుంచే నాన్న గారు పాలవ్యాపారం చేస్తున్నారు. మాకున్న వ్యవసాయ భూమిలో పాడిపశువులు పెంచుతూ పాల ద్వారా ఉపాధి పొందుతున్నాను. ఇప్పుడు ఇంటి వద్దే ఉంటూ వ్యవసాయం చేసుకుంటుండటం సంతృప్తిగా ఉంది. – సందీప్, భైంసా 35 వేల వేతనం వదులుకున్నా.. నేను ఐదేళ్లు హైదరాబాద్‌లోని ఫైబర్‌నెట్ సంస్థలో నెట్వర్క్ అడ్మిన్‌గా పనిచేశాను. నెలకు రూ.35వేల వరకు వేతనం వచ్చేది. అయితే ఎన్ని రోజులు పనిచేసినా సంతృప్తి లేకపోవడం, దాంతో పాటు ఉద్యోగ భద్రత లేకపోవడంతో సొంతూళ్లోనే ఉపాధి పొందాలని నిర్ణయించుకున్నాను. మన కోసం మనం కష్టపడాలని నిర్ణయించుకున్నాను. అందుకే మాకున్న ఆరెకరాల వ్యవసాయ భూమినే సాగు చేసుకుంటూ ఉపాధి పొందుతున్నాను. ఇటీవలే మల్బరీ సాగు ప్రారంభించాం. పట్టు పురుగుల పరిశ్రమ స్థాపించేందుకు ప్రయత్నాలు ప్రారంభించాను. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింత పురోగతి సాధిస్తాం. – రజిని శేఖర్, భైంసా ఫార్మసీని వదిలి.. ఫార్మర్‌గా మారి.. మాది సారంగపూర్ మండలం కంకెట గ్రామం. ఏడాది క్రితం వరకు హైదరాబాద్‌లోని అపోలో ఫార్మసీలో రూ.25 వేల వేతనంతో ఉద్యోగం చేశాను. కొన్నేళ్ల పాటు అక్కడే ఉన్నా. కానీ పెద్దగా సంపాదన లేదు. వచ్చే వేతనం ఇక్కడితో పోల్చుకుంటే ఎక్కువే. కానీ.. సిటీలో అది చాలా తక్కువ. ఎంత కష్టపడ్డా సంతృప్తి కూడా ఉండేది కాదు. ఈ క్రమంలోనే సొంతూరిలో కష్టపడదామని ఏడాది క్రితం కంకెటకు వచ్చేశాను. భూమిని నమ్ముకుని సాగు చేస్తున్నాను. కాస్త కష్టంగా ఉన్నా.. కన్న ఊరిలో పనిచేసుకోవడం తృప్తిగా ఉంది. – పుస్పూర్ సుభాష్, కంకెట -
నిర్దిష్ట విధానం కావాలి..
ఉపాధి వేటలో ఎడారి దేశాల బాటపడుతున్న నిరుద్యోగ యువత కొందరు నకిలీ ఏజంట్ల చేతుల్లో మోసపోయి నష్టపోతుంటే.. మరికొందరు జీతాలు సరిగా రాక.. అప్పులు తీరక.. అనారోగ్య కారణాలతో ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ప్రవాస భారతీయుల సంక్షేమ, హక్కుల వేదిక వ్యవస్థాపక అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు అన్నారు. ఇక్కడి నుంచి వెళ్లేవారికి స్కిల్ డెవలప్మెంట్ లేకపోవడంతో ఎక్కువ శాతం కూలీ పనులే చేస్తున్నారని అన్నారు. గల్ఫ్ బాధితుల పక్షాన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ కేంద్రంగా పోరాటాలు చేస్తున్న నర్సింహనాయుడు తన అభిప్రాయాలను ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ వివరాలు ఆయన మాటల్లోనే.. – ఆర్మూర్ ఆర్మూర్: గల్ఫ్ దేశాలతో పాటు ఇరాన్, ఇరాక్, అఫ్ఘానిస్తాన్, ఇజ్రాయిల్, సింగపూర్ తదితర దేశాలకు తెలంగాణ నుంచి యువత ఉపాధి కోసం వెళ్తున్నారు. కానీ నిరక్ష్యరాస్యులు, శిక్షణ లేనివారు కావడంతో 90 శాతం మంది కూలీలుగానే వెళ్తున్నారు. కేరళ రాష్ట్రీయులు మాత్రం స్కిల్ డెవలప్మెంట్ శిక్షణలు పూర్తి చేసుకొని గల్ఫ్ దేశాలకు వెళ్లడంతో మంచి ఉద్యోగాల్లో స్థిరపడుతున్నారు. మనవారికి సరైన శిక్షణ లేక పనులు సరిగా దొరకడం లేదు. దీంతో చేసిన అప్పులు తీరక స్వదేశానికి వచ్చిన వారు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. గల్ఫ్ దేశాల్లోని మృతదేహాలను స్వదేశాలకు తరలించడానికి నెలల తరబడి ఎదురు చూసే దయనీయ స్థితిని చూశాము. 2013లో ప్రవాస భారతీయుల సంక్షేమ, హక్కుల వేదికను ఏర్పాటు చేసి గల్ఫ్ బాధితుల కుటుంబాలకు ప్రతి నెల 500 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందజేశాము. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో గల్ఫ్ మృతుల కుటుంబాలకు లక్ష రూపాయల పరిహారాన్ని అందజేసేవారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు పరిహారా న్ని ఐదు లక్షల రూపా యలకు పెంచు తామని ఎన్నికల సమయంలో ప్రకటించినా ఇప్పటికీ అమలు కాలేదు. అంతే కాదు.. గత ప్రభుత్వాలు ఇచ్చిన తరహాలో లక్ష రూపాయలు కూడా ఇవ్వలేదు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన 2 జూన్ 2014 నుంచి 2 అక్టోబర్ 2017 నాటికి 431 మంది తెలంగాణ ప్రజలు గల్ఫ్‌లో మృత్యువాత పడ్డట్లు రాష్ట్ర ప్రభుత్వమే అధికారికంగా ధృవీకరించిం ది. వీరిలో ఒక్క కుటుంబానికి కూడా రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి ఆర్థిక సహాయమూ అందజేయలేదు. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం కలగజేసుకొని మృతదేహాలను వెంటనే స్వగ్రామాలకు చేర్చుతున్నప్పటికీ వారి కుటుంబాలకు భరోసా కల్పించడంలో విఫలమవుతున్నారు. ప్రత్యేక విధానం లేదు.. గల్ఫ్ దేశాల్లో సంక్షోభం గురించి తెలియక ఉపాధి వేటలో ఏడారి దేశాలకు వెళ్లి కష్టాలపాలవుతున్న రాష్ట్ర నిరుద్యోగులను ఆదుకోవడానికి ఒక ప్రత్యేకౖ విధానమంటూ లేదు. రాష్ట్ర ప్రభుత్వం ఈ సమస్యపై విధానపరమైన నిర్ణయాన్ని తీసుకోవాల్సిన అవసరం ఉంది. కేరళ, పంజాబ్ రాష్ట్రాల తరహాలో ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయడం, గల్ఫ్ బాధితులను ఆదుకోవడం కోసం కార్పొరేషన్‌ను ఏర్పాటు చేయడం, ప్రతి ఏటా వంద కోట్ల రూపాయల నిధిని కేటాయించడం లాంటి చర్యలు తీసుకోవాలి. నకిలీ ఏజంట్లను కఠినంగా శిక్షించడంతో పాటు ప్రత్యేక వ్యవస్థ ద్వారా రాష్ట్ర ప్రభుత్వమే విదేశాల్లో ఉద్యోగావకాశాలను తెలియప రచాలి. యువతకు అందుకు తగ్గ శిక్షణ ఇచ్చి ఉపాధి కోసం విదేశాలకు పంపే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. గల్ఫ్ దేశాల్లో అనారోగ్యం, ఉద్యోగపరంగా సమస్యలతో నష్టపోయి తిరిగి స్వదేశానికి వచ్చిన వారికి పావలా వడ్డీతో రుణాలు అందజేసి స్వయం ఉపాధి రంగాల్లో ప్రోత్సహించి వారి జీవితాలకు భరోసా కల్పించాలి. గల్ఫ్ దేశాలలో సంపాదించి తెలంగాణ రాష్ట్రానికి మన వాళ్లు ప్రతీ నెల పంపిస్తున్న డబ్బుపై పన్నుల రూపంలో వందల కోట్ల రూపాయలను ఆర్జిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం గల్ఫ్ బాధితుల సంక్షేమం గురించి కూడా ఆలోచించాలి. గల్ఫ్ మృతులు కుటుంబాలకు పింఛన్‌ను అందజేయాలి. -
తెలుగు విద్యార్థిపై కాలిఫోర్నియాలో కాల్పులు!
అమెరికాలో మళ్లీ కాల్పులు చోటుచేసుకున్నాయి. తెలంగాణకు చెందిన ఓ 26 ఏళ్ల వ్యక్తిపై గుర్తుతెలియని దుండగులు ఆదివారం కాలిఫోర్నియాలో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ముబీన్ అహ్మద్ తీవ్రంగా గాయపడ్డాడు. సంగారెడ్డి జిల్లాకు చెందిన ముబీన్ అహ్మద్ 2015 ఫిబ్రవరి నుంచి అమెరికాలో ఉంటూ ఎంబీఏ చదువుతున్నాడు. అదే సమయంలో ఓ ప్రైవేటు దుకాణంలో పార్ట్ టైం ఉద్యోగం చేస్తున్నాడు. గత ఆదివారం అతను పనిచేస్తున్న దుకాణంలోకి కొంతమంది నల్లజాతీయులు వచ్చారు. ఈ సందర్భంగా ముబీన్‌తో వారికి వాగ్వాదం జరిగిందని, దీంతో బరితెగించిన వారు ముబీన్‌పై కాల్పులు జరిపారని అతని తండ్రి ముజీబ్ అహ్మద్ తెలిపారు. ముబీన్‌ను వెంటనే క్యాస్ట్రో వ్యాలీలోని ఈడెన్ మెడికల్ సెంటర్‌కు తరలించి.. ప్రత్యేక శస్త్రచికిత్స జరిపారని, ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపినట్టు ముజీబ్ వివరించారు. ఆస్పత్రిలో ఉన్న ముబీన్‌ను చూసేందుకు వీలుగా అమెరికాకు వెళ్లేందుకు తమకు సాయం అందజేయాలని ముబీన్ కుటుంబం బుధవారం మంత్రి హరీశ్‌రావును ఆశ్రయించింది. -
మంత్రికి వాట్సప్ మెసేజ్.. టెన్షన్ ఖతమ్
ఎనిమిది నెలల గర్భంతో ఉన్న తన సోదరికి అత్యవరంగా ఆపరేషన్ చేయాలన్నారు. అది కూడా యశోద ఆస్పత్రిలో. ఖర్చు సుమారు నాలుగు లక్షల వరకు వస్తుందని అన్నారు. తనది అంత పెట్టుకోగల ఆర్థిక స్థోమత కాదు. ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో.. రాజన్న సిరిసిల్లా జిల్లా తంగళ్లపల్లి మండలానికి చెందిన గుగ్గిళ్ల రాజు.. తెలంగాణ మంత్రి కేటీఆర్‌కు వాట్సప్‌లో ఒక మెసేజ్ పెట్టాడు. అందులో తన పరిస్థితిని వివరించి, ఆస్పత్రి వాళ్లతో ఏమైనా మాట్లాడే వీలుంటే చూడాలని కోరాడు. ఒక అరగంటలో స్పందించిన కేటీఆర్.. తాను తప్పకుండా చూస్తానని రెండే రెండు ముక్కలతో సమాధానం ఇచ్చారు. కేటీఆర్ ప్రాతినిధ్యం వహించేది కూడా రాజన్న జిల్లా సిరిసిల్లకే కావడంతో రాజు ధైర్యం చేసి మెసేజ్ పెట్టాడు. ఆయన ఏం చేశారో ఏమో తెలియదు గానీ, తమ వద్ద రూపాయి కూడా తీసుకోకుండా ఆస్పత్రి వర్గాలు తమ సోదరికి ఆపరేషన్ చేసి ప్రాణాలు నిలబెట్టారని రాజు తెలిపాడు. బహుశా కేటీఆర్ కార్యాలయం నుంచి ఆస్పత్రికి ఫోన్ చేసి ఉంటారని, డబ్బుల గురించి అడగకుండా ఆపరేషన్ చేయమని చెప్పి ఉండొచ్చని రాజు భావిస్తున్నాడు. తర్వాతి రోజు ఉదయం తనను సచివాలయానికి వచ్చి కలవమన్నారని, ఖర్చుల విషయం తాము చూసుకుంటామని అధికారులు చెప్పారని వివరించాడు. తనకు వేరే అవకాశం ఏమీ లేకపోవడం వల్లే తాను కేటీఆర్‌కు వాట్సప్‌లో సందేశం పంపానని, ఇప్పుడు తన సోదరి, బిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండటంతో తామంతా ఎంతో సంతోషంగా ఉన్నామని రాజు ఆనందబాష్పాలతో చెప్పాడు. -
యువతను మోసగించిన కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ఇంటికో ఉద్యోగం ఇస్తామంటూ తెలంగాణ యువతలో కలలు పెంచి అధికారంలోకి వచ్చిన సీఎం కేసీఆర్.. వారిని నిలువునా మోసం చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి విమర్శించారు. యువజన కాంగ్రెస్ రాష్ట్ర ప్రథమ అధ్యక్షుడిగా ఎన్నికైన ఎం.అనిల్‌కుమార్ యాదవ్ బుధవారం పదవీ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ఏఐసీసీ కార్యదర్శి, రాష్ట్ర పరిశీలకుడు ఆర్.సి.కుంతియా, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లు భట్టివిక్రమార్క, సీనియర్ నేతలు కె.జానారెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో ఉత్తమ్ మాట్లాడారు. తెలంగాణలో ఇంటికో ఉద్యోగం, యువతకు ఉపాధికల్పన అని ఊదరగొట్టిన కేసీఆర్... ఇప్పటిదాకా ఒక్కరికీ ఉద్యోగాన్ని, ఉపాధినీ కల్పించలేదని విమర్శించారు. కేంద్రంలో మోదీకి, రాష్ట్రంలో కేసీఆర్‌కు వ్యతిరేకంగా పోరాడి యువత భవితను మార్చాల్సిన బాధ్యత యువజన కాంగ్రెస్‌పై ఉందని ఉత్తమ్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలను మోసగిస్తున్న కేసీఆర్ కుటుంబ అరాచకాలపై, అవినీతిపై యువత పోరాడాలని ఏఐసీసీ కార్యదర్శి కుంతియా పిలుపు ఇచ్చారు. గత ఎన్నికల్లో కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా ఓట్లేసిన యువత ఇప్పుడు టీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఉందని... కాంగ్రెస్ భావజాలాన్ని, యువత పట్ల అంకితభావాన్ని క్షేత్రస్థాయికి తీసుకుపోవాలని జానారెడ్డి సూచించారు. యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు అనిల్‌కుమార్ యాదవ్ మాట్లాడుతూ... పార్టీ అగ్రనేతల సహకారంతో ప్రభుత్వాలపై పోరాడతానని పేర్కొన్నారు. గ్రేటర్ హైదరాబాద్ కాంగ్రెస్ అధ్యక్షుడు దానం నాగేందర్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో మాజీ కేంద్ర మంత్రి సర్వే సత్యన్నారాయణ, పొంగులేటి సుధాకర్‌రెడ్డి, కేవీపీ రామచంద్రరావు, డీకే అరుణ, గీతారెడ్డి, బలరాం నాయక్, మర్రి శశిధర్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముందు యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ జరిగింది. మాజీ యువజన నేత ఎక్కడ? యువజన కాంగ్రెస్‌లో అంతర్గత విభేదాలు మరోసారి బహిర్గతమయ్యాయి. రాష్ట్ర యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికైన అనిల్‌కుమార్ బాధ్యతల స్వీకార కార్యక్రమానికి మాజీ అధ్యక్షుడు వంశీచంద్‌రెడ్డి హాజరుకాలేదు. ఓడిపోయిన రవికుమార్ యాదవ్, ఆయన ప్యానెల్లో గెలిచిన రాష్ట్ర కార్యవర్గంలోని నేతలు కూడా పాల్గొనలేదు. అయితే యువజన కాంగ్రెస్ కొత్త అధ్యక్షుడి బాధ్యతల స్వీకారం సంగతి తనకు తెలియదని, తనను ఆహ్వానించలేదని వంశీచంద్‌రెడ్డి పేర్కొన్నారు. -
బాబు రాజకీయాలకు పట్టిన తుప్పు
చంద్రబాబు తప్పులు చేసి, నిందలు తమపై వేస్తారా అని తెలంగాణ భారీ నీటిపారుదల శాఖ మంత్రి మంత్రి తన్నీరు హరీశ్ రావు మండిపడ్డారు. తన తప్పులపై ఎవరూ మాట్లాడకూడదన్నట్లుగా ఆయన తీరు ఉందన్నారు. స్టీఫెన్సన్కు రేవంత్ రెడ్డి డబ్బులు ఇవ్వడం తప్పు కాదు గానీ, ఆ తప్పును తాము ఎత్తి చూపించడమే తప్పంటున్నారన్నారు. తన తప్పులను ఎవరైనా వేలెత్తి చూపిస్తుంటే చంద్రబాబు జీర్ణించుకోలేకపోతున్నారని, తెలంగాణ టీడీపీ నేతలతో తమపై కేసు పెట్టించి టీన్యూస్ కు నోటీసులు ఇప్పిస్తారా అంటూ నిలదీశారు. కేసీఆర్ మీద ఏపీలో దాఖలైన కేసులపై సిట్ వేయడం సిల్లీథింగ్ అని ఆయన అన్నారు. ఓటుకు కోట్లు కేసులో మీ అంతట మీరే ఇరుక్కున్నారని, తాము ఇరికించాలనుకుంటే చాలా ఉన్నాయని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఆత్మహత్యలు చేసుకున్న తెలంగాణ బిడ్డలు ఇచ్చిన మరణ వాంగ్మూలాల్లో చంద్రబాబు పేరుందని, అది అన్నింటికంటే పెద్ద సాక్ష్యమని తెలిపారు. చంద్రబాబు వల్లే ఆత్మహత్యలు చేసుకుంటున్నామని వాళ్లు తమ సొంత చేతిరాతతో రాశారన్నారు. తమకు కక్షసాధింపు ఆలోచన లేదని, తెలంగాణ అభివృద్ధి మీదే దృష్టి ఉందని హరీశ్ అన్నారు. ఒక రాష్ట్రంలో మరో రాష్ట్ర పోలీసుల మోహరింపు ఎక్కడైనా ఉందా అని గవర్నర్‌ను తాము అడుగుతామన్నారు. దీనిపై కేంద్రం కూడా స్పందించాలని కోరారు. తెలంగాణలో ఆంధ్రా పోలీసు స్టేషన్లను కూడా పెడతామంటున్నారని, ఇదెక్కడి విడ్డూరమని మండిపడ్డారు. తెలంగాణలోని అన్ని జిల్లాల్లోనూ ఆంధ్రావాళ్లు ఉంటారని, వాళ్ల ధనమాన ప్రాణ రక్షణ బాధ్యత కూడా ఆంధ్రా పోలీసులే తీసుకుంటారా అని ప్రశ్నించారు. నీళ్లు ఎక్కడి నుంచి తెచ్చుకుంటారు.. విజయవాడ నుంచి పైపులైన్లు వేసుకుంటారా అని అడిగారు. విమానంలో శంషాబాద్ విమానాశ్రయంలో్ దిగితే నేరుగా సచివాలయానికి వస్తారా, ఆఫీసుల నుంచి ఇళ్లకు వెళ్లేటప్పుడు రోప్ వేలు వేసుకుంటారా అని మండిపడ్డారు. చంద్రబాబు తమిళనాడు వెళ్లినా, వెంట పోలీసులను తీసుకెళ్తారా.. కర్ణాటకలోను, తమిళనాడులో కూడా పోలీసు స్టేషన్లు పెడతారా? అలా చేస్తే తన్ని తగలేస్తారని స్పష్టం చేశారు. సండ్ర వెంకట వీరయ్యను విశాఖలో దాస్తారు, మత్తయ్యను విజయవాడలో దాస్తారని, ఇలా నిందితులను దాచే సంస్కృతి ఎక్కడిదని ఆయన అడిగారు. ఇంటి నిర్మాణానికి అనుమతి రాకపోతే దాన్ని కూడా ఇష్యూ చేస్తున్నారన్నారు. తొమ్మిదేళ్లు రాష్ట్రం మొత్తానికి సీఎంగా చేసిన అనుభవజ్ఞుడికి.. పాత ఇళ్లు కూల్చాలనుకుంటే జీహెచ్ఎంసీ అనుమతి తీసుకోవాలన్న విషయం తెలియదా అని హరీశ్ రావు అడిగారు. అనుమతి రాకుండా ఇంటి నిర్మాణం మొదలుపెట్టచ్చా? అనుమతి రాకుండా ఎలా మొదలుపెట్టారు? ఇది తప్పా.. ఒప్పా? తప్పయితే ఎందుకు చర్య తీసుకోకూడదని ప్రశ్నించారు. జూబ్లీహిల్స్‌లో 10 మీటర్ల ఎత్తు మాత్రమే ఉండాలంటే 12.5 మీటర్లు పెట్టారు... అది డీవియేషనా కాదా అంటూ నిలదీశారు. దేన్నయినా మేనేజ్ చేయగలనని చంద్రబాబుకు గట్టి నమ్మకం ఉందని, అందులో తాను దిట్ట అనుకుంటారని చెప్పారు. ఆయన ఎలా మేనేజ్ చేశారో, ఎక్కడెక్కడ ఎలా తప్పించుకున్నాడో, మేనేజ్మెంట్లో ఆయనకున్న డాక్టరేట్ల గురించి అందరికీ అవగాహన ఉందన్నారు. దేన్నయినా మేనేజ్ చేయగలరు గానీ మా తెలంగాణ ప్రభుత్వాన్ని, ప్రజలను, మీడియాను మేనేజ్ చేయలేరని గుర్తుంచుకోవాలని స్పష్టం చేశారు. తెలంగాణ మీడియా మీరు చేసిన తప్పులను నగ్నంగా బయటపెడితే అర్ధరాత్రి నోటీసులు ఇస్తారా.. స్థానిక పోలీసులకు చెప్పకుండా ఎలా నోటీసులు ఇస్తారని మండిపడ్డారు. ఏపీ సర్కారు ఒక తప్పు నుంచి తప్పించుకోడానికి పది తప్పులు చేస్తోందన్నారు. తమకు చట్టం మీద గౌరవం ఉందని, మీరు ఎంత కయ్యం పెట్టుకోవాలని చూసినా తమ ప్రభుత్వం చట్ట ప్రకారమే ముందుకు పోతుందని ఆయన అన్నారు. ఒకరోజు ట్యాపింగ్ అన్నారు, ఒకరోజు మార్ఫింగ్ అన్నారు, ఒకరోజు కట్ పేస్ట్ అన్నారు... పూటకో మాట, నాయకుడికో మాట అంటున్నారని ఎద్దేవా చేశారు. ఇంతకీ అసలు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ తో మాట్లాడిన గొంతు చంద్రబాబుదా.. కాదా అన్న విషయాన్ని మాత్రం చంద్రబాబు ఇప్పటికీ స్పష్టంగా చెప్పడంలేదంటూ మండిపడ్డారు. -
’మరణవాంగ్మూలాల్లో బాబు పేరు’
-
'ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేశారు'
హైదరాబాద్: విద్యుత్ కోతల కారణంగానే తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని కాంగ్రెస్ నాయకుడు, మాపీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. కరెంట్ కోతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత బయటపడిందని విమర్శించారు. పావలా రుణమాఫీ చేసి మొత్తం చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి తెలంగాణ యువతను మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు. -
త్వరలో ఉద్యోగాల జాతర!
► పింఛన్ పెంపు, ‘కల్యాణ లక్ష్మి’ సహా వరాలన్నీ దసరా నుంచి అమలు ► 48 మంది మహిళలకు భూమి పట్టాలు అందజేసిన కేసీఆర్ ► తెలంగాణ రాష్ట్రంలో తొలి స్వాతంత్య్ర దినోత్సవం.. గోల్కొండ కోటలో వైభవంగా వేడుకలు సాక్షి, హైదరాబాద్: ప్రత్యేక రాష్ట్రం ఏర్పాటయ్యాక తమకు పెద్ద ఎత్తున ఉద్యోగావకాశాలు వస్తాయని ఎదురుచూస్తున్న తెలంగాణ యువతకు.. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు శుభవార్త ప్రకటించారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీపీఎస్సీ) ద్వారా త్వరలో 50 వేల ఉద్యోగాలను భర్తీ చేస్తామని చెప్పారు. ఇదే సమయంలో ఎంత కష్టమైనా సరే ఇచ్చిన మాటకు కట్టుబడి కాంట్రాక్టు ఉద్యోగులందరినీ క్రమబద్ధీకరిస్తామని... పెన్షన్ల పెంపు, కల్యాణ లక్ష్మి వంటి పథకాలను వచ్చే దసరా నుంచి అమలు చేస్తామని తెలిపారు. హైదరాబాద్‌లో కల్లు డిపోలు సైతం దసరా నుంచి తెరుచుకుంటాయని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత తొలిసారిగా గోల్కొండ కోటలో జరిగిన స్వాతంత్య్ర దినోత్సవాల్లో.. సీఎం కేసీఆర్ జాతీయ జెండాను ఎగురవేశారు. పోలీసు వందనం స్వీకరించిన అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి 23 నిమిషాలు ప్రసంగించారు. సీఎం ప్రసంగంలోని అంశాలు ఆయన మాటల్లోనే.. మహాత్ముడి బాటలోనే.. మహాత్ముడి అడుగుజాడల్లో నడుస్తూ తెలంగాణ ప్రజలు స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారు. తెలంగాణ చరిత్రను సమున్నతంగా చాటిచెప్పే గోల్కొండ కోట వేదికగా స్వాతంత్య్ర దిన వేడుకలు జరుపుతున్నందుకు యావత్ తెలంగాణ ప్రజలు ఎంతో ఆనందపడుతున్నారు. ఆటో, ట్రాక్టర్లపై రవాణా పన్ను రద్దు పేదలు పొట్టకూటికోసం నడుపుకొనే ఆటోలపై రవాణా పన్నును రద్దు చేశాం. వ్యవసాయానికి ఉపయోగించే ట్రాక్టర్లపైనా రవాణా పన్నును మినహాయించాం. నిజామాబాద్‌లో ఎర్రజొన్న రైతుల బకాయిల చెల్లింపు కోసం రూ. 11 కోట్లను మంజూరు చేశాం. తెలంగాణ రైతాంగాన్ని ఆదుకోవడానికి ఇన్పుట్ సబ్సిడీని విడుదల చేశాం. వడగళ్లు, భారీ వర్షాలవల్ల దెబ్బతిన్న పంటలకు నష్టపరిహారం కూడా అందించాలని నిర్ణయించాం. ఇందుకోసం విడుదల చేసిన రూ. 482 కోట్లు రైతుల ఖాతాల్లోనే నేరుగా జమవుతాయి. పవర్‌లూం కార్మికులను ఆదుకొనేందుకు కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఐదున్నర కోట్ల రూపాయలను విడుదల చేశాం. ఎంబీసీలకు ప్రత్యేక పథకాలు.. తెలంగాణలో బీసీలపట్ల ప్రభుత్వం సానుభూతితో ఉంది. ముఖ్యంగా బాగా వెనుకబడిన తరగతుల (ఎంబీసీ) కోసం త్వరలో ప్రత్యేక సంక్షేమ పథకాలను రూపొందిస్తాం. గిరిజన, మైనారిటీలకు 12 శాతం చొప్పున రిజర్వేషన్లు కల్పించే విషయంలో కృత నిశ్చయంతో ఉన్నాం. వక్ఫ్ ఆస్తుల పరిరక్షణ కోసం వక్ఫ్ బోర్డుకు జ్యుడీషియల్ అధికారాలు కల్పిస్తున్నాం. తెలంగాణలోని గిరిజన తండాలు, 500 వరకు గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేస్తాం. అందుబాటులో 35 లక్షల ఎకరాలు తెలంగాణలో సాగుకు పనికిరాని 35 లక్షల ఎకరాల భూమి అందుబాటులో ఉంది. అందులో 10 లక్షల ఎకరాలు పరిశ్రమలకు అనువుగా ఉంది. ఈ భూమిపై పరిశ్రమలు, రెవెన్యూ శాఖల ఆధ్వర్యంలో సర్వే కొనసాగుతోంది. ఇప్పటికే 3 లక్షల ఎకరాలను గుర్తించాం. మరో ఆరేడు లక్షల ఎకరాలు కలిపి మొత్తం 10 ల క్షల ఎకరాల ను పారిశ్రామిక జోన్‌గా ప్రకటిస్తాం. క్రీడాకారులకు ప్రోత్సాహం రాష్ట్రంలో క్రీడలను ప్రోత్సహించడానికి సమగ్ర క్రీడా విధానాన్ని రూపొందిస్తున్నాం. అందులో భాగంగా ఒలింపిక్స్, కామన్వెల్త్, ఏషియన్ గేమ్స్‌లో పాల్గొనే క్రీడాకారులకు ఇకపై ఖర్చుల నిమిత్తం ఒక్కొక్కరికి రూ. 3 లక్షలు ఇవ్వాలని నిర్ణయించాం. ఆయా పోటీల్లో స్వర్ణ పతకం సాధిస్తే రూ. 50 లక్షలు, రజత పతకం సాధిస్తే రూ. 25 లక్షలు, కాంస్య పతకం సాధిస్తే రూ. 15 ల క్షల నగదు ప్రోత్సాహం ఇవ్వాలని విధాన నిర్ణయం తీసుకున్నాం. పతకాలు సాధించిన క్రీడాకారులతో సమానంగా కోచ్‌లకు కూడా నగదు అందజేస్తాం. హైదరాబాద్‌కు బస్సు, రైల్వే టెర్మినల్లు హైదరాబాద్‌లో శాంతిభద్రతల కోసం పోలీస్ వ్యవస్థను పటిష్టపరుస్తున్నాం. 3,600 మంది ఉద్యోగుల నియామకానికి అనుమతినిచ్చాం. హైదరాబాద్‌ను త్వరలోనే వైఫై నగరంగా, ఐటీ ఇంక్యుబేటర్‌గా మార్చేందుకు శరవేగంగా చర్యలు చేపడుతున్నాం. హైదరాబాద్‌కు నలుదిశలా కొత్తగా బస్, రైల్వే టెర్మినల్ల ఏర్పాటుకు ప్రయత్నాలు ప్రారంభించాం. దీంతోపాటు ఫార్మా, స్పోర్ట్స్, సినిమా, మాన్యుఫాక్చరింగ్, ఎడ్యుకేషన్, హెల్త్ హబ్‌లను నగరం నలు దిశలా ఏర్పాటు చేస్తాం. చర్చి నిర్మాణానికి పంచాయతీ అనుమతి దళిత, క్రైస్తవుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తుంది. క్రైస్తవులు చర్చిలు నిర్మించుకోవాలంటే ప్రస్తుతం జిల్లా కలెక్టర్ అనుమతి పొందాల్సి ఉంది. ఇకపై చర్చిల నిర్మాణానికి గ్రామ పంచాయతీ పరిధిలోనే అనుమతి ఇచ్చేలా వెసులుబాటు కల్పిస్తాం. సర్వేపై దుష్ర్పచారం రాష్ట్రంలో ప్రజల పరిస్థితిపై ప్రభుత్వం వద్ద సరైన లెక్కల్లేవు. దీనివల్ల ప్రభుత్వ పథకాలు అనర్హుల చేతుల్లోకి వెళుతున్నాయి. దీనిని అధిగమించేందుకే సమగ్ర సర్వే చేపడుతున్నాం. కానీ దీనిపై కొన్ని దుష్టశక్తులు లేనిపోని ప్రచారం చేస్తున్నాయి. ఇది ప్రభుత్వ నిధులు అర్హులకు మాత్రమే అందాలని చేపట్టిన కార్యక్రమమే తప్ప మరొకటి కాదు. అవినీతి రహిత పాలన అందించేందుకు ప్రజలు, మేధావుల భాగస్వామ్యంతో పథకాలను రూపొందిస్తాం. అందుకు ప్రజలంతా సహకరించాలి. దళితులకు భూ పంపిణీ ప్రారంభం రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ‘పేద దళితులకు మూడెకరాల భూ పంపిణీ’ పథకాన్ని గోల్కొండ కోట నుంచి కేసీఆర్ ప్రారంభించారు. ఇందులో భాగంగా తెలంగాణలోని ఒక్కో జిల్లా నుంచి ఎంపిక చేసిన మొత్తం 48 మంది మహిళలకు సీఎం భూమి పట్టాలను అందజేశారు. మంత్రులు సైతం అన్ని జిల్లాల్లోనూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు కేసీఆర్ తెలిపారు. విజ్ఞానానికి, వైభవానికి ప్రతీక ఇది.. ‘‘తెలుగు జాతి ప్రశస్తిని ప్రపంచానికి సమున్నతంగా చాటిన గోల్కొండ కోటలో స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహించడం సముచిత నిర్ణయం. కాకతీయుల కాలంలో రూపుదిద్దుకున్న గోల్కొండ కోట ఫతేదర్వాజా దగ్గర చప్పట్లు కొడితే బాలాహిస్సార్ దర్వాజా వద్ద ప్రతిధ్వనించే ఏర్పాటు.. ధ్వని శాస్త్ర విజ్ఞానానికి, వాస్తు కౌశలానికి నిదర్శనంగా నిలిచింది. తానీషా ప్రభువుకు శ్రీరామలక్ష్మణులు సాక్షాత్కరించిందీ, భక్త రామదాసు నోట వెలువడిన సుప్రసిద్ధ కీర్తనలెన్నో ప్రతిధ్వనించిందీ ఈ కోటలోనే... ఏటా భద్రాద్రి రామయ్యకు ముత్యాల తలంబ్రాలు స్వయంగా మోసుకెళ్లే సత్సాంప్రదాయం ప్రారంభమైంది కూడా ఈ గోల్కొండ కోటలోనే... మొట్టమొదటి అచ్చ తెలుగు కావ్య చరిత్ర రచించిన పొన్నెగంటి తెలగనార్యుడు ఇక్కడి ఆస్థానకవే.. యక్షగానం సుగ్రీవ విజయం జాలువారిందీ, ఇబ్రహీం కుతుబ్‌షాకు మల్కిభ రాముడిగా బిరుదునిచ్చిందీ ఈ కోటలోనే... సుప్రసిద్ధ కోహినూర్, దరియా, దహూప్ వంటి వజ్రాలకు ఆలవాలంగా విలసిల్లిందీ, హైదరాబాద్ నిర్మాణానికి పురుడుపోసుకుందీ ఈ కోటలోనే... తెలంగాణ ప్రజలు బోనాల పండుగను ప్రారంభించేదీ ఇక్కడి నుంచే... తెలంగాణ చరిత్రకు హైదరాబాద్ మకుటాయమానమైతే.. తెలంగాణ పరిపాలనా అస్తిత్వం, వారసత్వ వైభవం ఎగరేసిన జెండా ఈ గోల్కొండ కోట.’’ అమర జవానులకు ముఖ్యమంత్రి నివాళులు కంటోన్మెంట్: 68వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ ఆవరణలోని ఆర్మీ యుద్ధ స్మారక స్థూపం (వీరుల సైనిక స్మారక స్థూపం) వద్ద రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అమర జవానులకు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రా సబ్ ఏరియా కమాండర్ జీఓసీ-ఇన్-సీ మేజర్ జనరల్ సీఏ పిఠావాలా, ఎయిర్ వైస్ మార్షల్, కాలేజ్ ఆఫ్ ఎయిర్ వార్ఫేర్ కమాండర్ శ్రీనివాస్ కాళిదాస్ తదితరులు పాల్గొన్నారు. స్వాతంత్య్ర దిన వేడుకల నిర్వహణ పరేడ్ గ్రౌండ్ నుంచి గోల్కొండకు మారినప్పటికీ, ముఖ్యమంత్రి పరేడ్ గ్రౌండ్‌లోని అమర వీరుల స్థూపం వద్ద నివాళులు అర్పించే సాంప్రదాయాన్ని కొసాగించడం గమనార్హం. దసరా నుంచి వరాలు వృద్ధులు, వితంతువులకు రూ. వెయ్యి.. వికలాంగులకు రూ. 1,500కు పింఛన్ పెంపును దసరా నుంచి అమలు చేస్తాం. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు హైదరాబాద్‌లో కల్లు దుకాణాలను వచ్చే దసరా నుంచి తెరిపిస్తాం. దీనివల్ల 60 వేల మంది కల్లు గీత కార్మికులకు ఉపాధి దొరుకుతుంది. రుణమాఫీ అమలు వల్ల ప్రభుత్వానికి రూ.18 వేల కోట్ల భారం పడుతున్నా.. 40 లక్షల మంది రైతుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నాం. దళిత, గిరిజన ఆడపిల్లల పెళ్లికి రూ. 50 వేల చొప్పున ఆర్థిక సాయం అందించే ‘కల్యాణ లక్ష్మి’ పథకాన్ని కూడా దసరా నుంచే ప్రారంభిస్తున్నాం. ఆడపిల్ల పుట్టిందనగానే పెళ్లి ఎలా చేయాలా? అని రందిపడే రోజులివి. దళిత, గిరిజన కుటుంబాల్లోనైతే ఆడపిల్ల పుడితే చంపేసే దుర్భర పరిస్థితులున్నాయి. వారిని ఆదుకోవడం కోసం చేపడుతున్న ఇలాంటి పథకం దేశ చరిత్రలో ఎక్కడా అమలు కాలేదు. వచ్చే దసరా నుంచి తెలంగాణలోనే ప్రథమంగా అమలు చేస్తుండటం గర్వ కారణం. -
ఉద్యోగం.. నాయకులకే!
రాష్ట్ర విభజన వల్ల తెలంగాణ యువతకు ఒరిగేదేమీ లేదు బిల్లులో నిబంధనలు చూసి పెదవి విరుస్తున్న తెలంగాణ ఉద్యోగులు సాక్షి, హైదరాబాద్: ‘‘రాష్ట్ర విభజన తర్వాత తెలంగాణలోని యువతకు లక్షల సంఖ్యలో ప్రభుత్వ ఉద్యోగాలొస్తాయి’’ - ఇదీ ఇన్నాళ్లుగా చాలామంది రాజకీయ నాయకులు చెప్పిన మాట. కానీ, విభజన బిల్లులో పేర్కొన్న నిబంధనలు చూస్తే, వారి మాటల్లో పసలేదని అర్థమవుతోంది. కొత్త రాష్ట్రంలో రాజకీయ నేతలు మాత్రమే లబ్ధిపొందుతారని, నిరుద్యోగులకు మాత్రం ఒరిగేదేమీ లేదని తెలుస్తోంది. రాష్ట్ర పునర్వ్యవస్థీకరణ బిల్లులో ఉద్యోగుల పంపిణీకి సంబంధించి పేర్కొన్న క్లాజులతో తెలంగాణలో యువతకు పెద్దగా సర్కారు కొలువులు వచ్చే పరిస్థితి లేదని తెలంగాణ ఉద్యోగులే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో ఎటువంటి మార్పు ఉండదని, రాష్ట్ర విభజన తర్వాత కూడా తెలంగాణ జిల్లాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు అక్కడే ఉంటారని, ఓపెన్ కేటగిరిలో భర్తీ చేసిన 20 శాతం ఇతర ప్రాంత ఉద్యోగులను వారి సొంత జిల్లాలకు పంపేలా బిల్లులో క్లాజు లేదని తెలంగాణకు చెందిన ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. ‘‘తెలంగాణ జిల్లాల్లో రాష్ట్ర కేడర్ పోస్టులు జిల్లాకు 20 నుంచి 25 వరకు ఉంటాయి. ఆ పోస్టుల్లో తెలంగాణ జిల్లాల్లో సీమాంధ్రకు చెందిన ఉద్యోగులు పనిచేస్తుంటే వారిని మాత్రమే సీమాంధ్ర జిల్లాలకు పంపిస్తారు. అలాగే సీమాంధ్ర జిల్లాల్లోని రాష్ట్ర కేడర్ పోస్టుల్లో తెలంగాణకు చెందిన ఉద్యోగులు పనిచేస్తే వారిని తెలంగాణ జిల్లాలకు పంపిస్తారు. ఇది ఉద్యోగుల పంపిణీ కిందకు రాదు. అక్కడివారు ఇక్కడికి, ఇక్కడివారు అక్కడికి వెళ్తారు. దానివల్ల కొత్తగా ఆయా జిల్లాల్లో ప్రభుత్వ ఉద్యోగాలు ఏమీ రావు’’ అని ఆయన వివరించారు. హైదరాబాద్‌లో పనిచేస్తున్న రాష్ట్ర కేడర్‌కు చెందిన ఉద్యోగుల పంపిణీ మాత్రమే జరుగుతుందని, అయితే వీటికి ఆప్షన్లు ఇస్తామని బిల్లులో పేర్కొన్నందున రాష్ట్ర స్థాయి కేడర్‌లో కూడా తెలంగాణలోని యువతకు పెద్దగా ఉద్యోగాలు రావనే అభిప్రాయం సచివాలయ తెలంగాణ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. హైదరాబాద్‌లో అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో దాదాపు 1,10,000 మంది పనిచేస్తున్నారు. ఇందులో 70 వేల మంది రాష్ట్ర ప్రభుత్వ శాఖల్లో ఉండగా, మరో 21 వేల మంది ప్రభుత్వ రంగ సంస్థల్లో పనిచేస్తున్నారు. 4 వేల మంది విశ్వవిద్యాలయాల్లో పనిచేస్తుండగా, జీహెచ్ఎంసీలో 7,500 మంది, ఇతర ఉద్యోగాల్లో 7,300 మంది పనిచేస్తున్నారు. రాష్ట్ర కేడర్ పోస్టులు సచివాలయంలో 5 వేలు, ఇతర డెరైక్టరేట్లలో మరో 5 వేలు మాత్రమే ఉన్నాయని అధికార వర్గాలు లెక్కతేల్చాయి. ఈ 10 వేల పోస్టులను మాత్రమే జనాభా ప్రాతిపదికన పంపిణీ చేయాలని బిల్లు క్లాజులో పేర్కొన్నారు. అయితే సీనియర్లు, భార్య లేదా భర్త ఇరువురూ ఉద్యోగస్తులైతే, కొన్ని రోగాలతో ఆ ఉద్యోగి కుటుంబంలో చికిత్స పొందుతుంటే, అలాంటివారికి ఆప్షన్లు ఇవ్వాలని బిల్లులో ఉంది. సచివాలయంలో సీమాంధ్ర ప్రాంతానికి చెందిన చాలామంది ఉద్యోగులు సీనియర్లే. వారిలో ఎక్కువమంది హైదరాబాద్‌లో స్థిర నివాసాలు కూడా ఏర్పాటు చేసుకున్నారు. దీంతో వారంతా హైదరాబాద్‌లో పనిచేయడానికే మొ గ్గు చూపుతారనే వాదన సచివాలయ తెలంగాణ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. విభజన తర్వాత ఉద్యోగుల పంపిణీ పూర్తయ్యాక ఏ రాష్ట్రంలోనైనా ఉద్యోగుల కొరత ఏర్పడితే డిప్యుటేషన్‌పై పక్క రాష్ట్రం నుంచి తీసుకోవాలనే నిబంధనను కూడా బిల్లులో పొందుపరిచారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విభజన వల్ల రాజకీయ నేతలు ఇన్ని రోజులు చెప్పినట్లు తెలంగాణలో లక్షల సంఖ్యలో ఉద్యోగాలేమీ రావని, వస్తే వందల్లో మాత్రమే ఉంటాయని, రాజకీయ నిరుద్యోగులకు మాత్రం పదవులు వస్తాయని తెలంగాణకు చెందిన అధికారి ఒకరు వ్యాఖ్యానించారు. రాష్ట్ర విభజన వల్ల వెంటనే ముఖ్యమంత్రి, మంత్రి పదవులతోపాటు కొన్ని రకాల కార్పొరేషన్ చైర్మన్ పదవులు వస్తాయని, తెలంగాణలోని యువతకు లక్షల్లో సర్కారు కొలువులేమీ రావని సచివాలయ తెలంగాణ ఉద్యోగ నేతలు కూడా అభిప్రాయపడుతున్నారు. -
కుట్రదారులపై ఆగ్రహం
వరంగల్ సిటీ, న్యూస్‌లైన్: సమైక్యవాదం పేరుతో కుట్రలు చేస్తున్న సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడుపై తెలంగాణవాదులు ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణను అడ్డుకునే నేతలకు ఈ ప్రాంతంలో స్థానం లేదంటూ జిల్లా వ్యాప్తంగా బుధవారం కిరణ్, చంద్రబాబుల దిష్టిబొమ్మలను దహనం చేశారు. టీఆర్ఎస్ యూత్ జిల్లా కమిటీ పిలుపు మేరకు అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు జరిగాయి. హన్మకొండ అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఆరెపల్లి, వార్షికోత్సవానికి తన సతీమణి శాంతితో హాజరయ్యారు. అలాగే నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమాలోని ఫైటింగ్ సీన్ కోసం రామప్పలో జరిగిన షూటింగ్‌కు వచ్చారు. వరంగల్ స్వర్ణా ప్యాలెస్‌లో జరిగిన ఓ కాంగ్రెస్ నాయకుడి కూతురు వివాహానికి హాజరయ్యారు. మాజీ మంత్రి కొండా సురేఖ కూతురు వివాహానికి, మనుమరాలు పుట్టినరోజుకు నగరానికి వచ్చారు. వరంగల్‌లో షూటింగ్, ఇతర పనుల నిమిత్తం వచ్చిన సమయంలో తన అభిమానులను పలకరించేవారు. అభిమానుల కుటుంబ బాగోగులను సైతం అడిగితెలుసుకునేవారు. ఆయన వరంగల్‌కు వచ్చిన సందర్భంలో అభిమానులు రవిపెద్ద, అంకం జ్ఞానేశ్వర్, కొక్కుల సతీష్, దామెర సర్వేష్, గర్దా జయప్రకాష్, ఎర్ర సమ్మయ్య, రవిప్రసాద్లను కలిసేవారు.