
'ఇంటికో ఉద్యోగం అని చెప్పి మోసం చేశారు'
హైదరాబాద్: విద్యుత్ కోతల కారణంగానే తెలంగాణలో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని కాంగ్రెస్ నాయకుడు, మాపీ ఎంపీ సిరిసిల్ల రాజయ్య అన్నారు. కరెంట్ కోతలతో ముఖ్యమంత్రి కేసీఆర్ అసమర్థత బయటపడిందని విమర్శించారు.
పావలా రుణమాఫీ చేసి మొత్తం చేశామని చెప్పుకోవడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఇంటికో ఉద్యోగం అని చెప్పి తెలంగాణ యువతను మోసం చేశారని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని ఆయన డిమాండ్ చేశారు.