telugu women
-
మలేషియా కౌలాలంపూర్ లో తెలుగు మహిళ గల్లంతు
-
ఐక్యరాజ్యసమితికి తెలుగు యువ ప్రతిభ
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యాలయంలో రాబోయే డిసెంబర్లో జరిగే 8వ వార్షిక 1ఎమ్1బి (1మిలియన్ ఫర్ 1బిలియన్) యాక్టివేట్ ఇంపాక్ట్ సమ్మిట్‌లో పాల్గొనడానికి తెలంగాణలోని వివిధ కాలేజీలకు చెందిన ఐదుగురు యువ ఆవిష్కర్తలు ఎంపికయ్యారు. వీరిలో నలుగురు అమ్మాయిలు– నారాయణం భవ్య, పెమ్మసాని లిఖిత చౌదరి, సత్యవతి కోలపల్లి, మనల్ మునీర్ కాగా మరొకరు మీత్కుమార్ షా ఉన్నారు. వీరి ఆవిష్కరణలకు ‘1ఎమ్1బి గ్రీన్స్కిల్స్ అకాడమీ’ వేదికయ్యింది. ఐదు నెలలపాటు సాగిన ఈ ప్ర్రక్రియలో 200 మంది పాల్గొనగా ఐదుగురు తెలుగు విద్యార్థులు ఎంపికై యువ ప్రతిభ కు ప్రేరణగా నిలిచారు.పట్టణ సవాళ్ల పరిష్కారం‘మానిఫెస్టింగ్ మ్యాన్ హోల్స్’ పేరుతో పట్టణ వరదలు, సవాళ్లను పరిష్కరించడం లక్ష్యంగాప్రాజెక్ట్ను ఆవిష్కరించాను. భారతీయ నగరాల్లో మౌలిక సదుపాయాల భద్రతను కల్పించడమే దీని ముఖ్య ఉద్దేశం. – నారాయణం భవ్యటెక్.. టూర్‘ఇంటెలినెక్సా’ అనే నాప్రాజెక్ట్ ఎకో–టూరిజంను ఏఆర్, వీఆర్, ఏఐల ద్వారా మార్చేందుకుæవీలుగా ఫీచర్లను అందిస్తోంది. వైల్డ్ లైఫ్ ట్రైల్స్, వీఆర్ అడ్వెంచర్స్, ఎకో కెరీర్ గైడ్స్, ఎకో డైరీస్ ద్వారా మనప్రాంతాల పట్ల సమాజానికి అవగాహన కల్పించడం, గ్లోబల్ ఫోరమ్‌లపై ప్రభావం చూపడమే లక్ష్యంగా దీనిని ఆవిష్కరించాను.– మనల్ మునీర్లక్ష్యానికి మార్గం‘అప్నా ఇంటర్వ్యూ క్రాకర్’ అనే నాప్రాజెక్ట్ మార్కెట్ ట్రెండ్లు, పోర్ట్‌ఫోలియో క్రియేషన్, ఎటిఎస్ రెజ్యూమ్ టెంప్లేట్లు, ఓపెన్ సోర్స్ కంట్రిబ్యూషన్ లను అందించే ఒక వేదిక. దీని ద్వారా ఎంతోమంది తమ లక్ష్యాలు చేరుకోవడానికి మార్గం సుగమం అవుతుంది. – మీత్ కుమార్ షావిద్యార్థులకు ప్రాక్టికల్ స్కిల్స్‘టెక్.వెసాలియస్’ అనే నాప్రాజెక్ట్ లక్ష్యం అనాటమీ విద్యలో ఎఆర్/విఆర్ సాంకేతికత ద్వారా విప్లవాత్మక మార్పులు తీసుకురావడం. విద్యార్థులందరికీ అందుబాటులో ఉండేలా, వారిలోప్రాక్టికల్ స్కిల్స్ పెంపొందించడమే ఈ ఆవిష్కరణ లక్ష్యం. – పెమ్మసాని లిఖిత చౌదరివాస్తవ అనుభూతినారు పోషణలో ఏఐ సాధనాలు, మెటా స్పార్క్ స్టూడియోని ఉపయోగించుకొని వాస్తవ అనుభూతిని ఎలా పొందవచ్చో నాప్రాజెక్ట్ పరిచయం చేస్తుంది. అంతేకాదు కెమెరా ట్రాకింగ్ ద్వారా వినియోగదారులకు వారి మొక్కలను సేంద్రీయంగా, వేగంగా ఎలా పెంచాలనే దానిపై లింక్‌లు, మార్గదర్శకాలను అందిస్తుంది. మొక్కల పెంపకంపై రూపొందించిన ప్రాజెక్ట్ ఇది. – సత్యవతి కోలపల్లి -
అమెరికాలో కిలాడి లేడి తస్మాత్ జాగ్రత్త !
-
ప్రపంచ బ్యాంక్‌లో మన తెలుగమ్మాయి
ఇందుది కృష్ణా జిల్లా పెనమలూరు. సాధారణ మధ్యతరగతి కుటుంబం. తండ్రి గెస్ట్ లెక్చరర్. తల్లి గృహిణి. ఎం.ఎస్. చేయడం కోసం యూఎస్ వెళ్లింది. ప్రపంచ బ్యాంకు ఉద్యోగం తెచ్చుకుంది. చిన్నప్పటి నుంచి కష్టపడి చదివే మనస్తత్వం... స్పష్టమైన గమ్యం... లక్ష్యంపై ఏకాగ్రత... నిండైన ఆత్మవిశ్వాసం ఇందు సొంతం. తల్లిదండ్రులు మాధవి, సత్యనారాయణ. విజయవాడలో బీటెక్ పూర్తి చేసి, అమెరికాలో ఎం.ఎస్. పబ్లిక్ పాలసీ చేసింది. ప్రపంచ బ్యాంకులో ఉద్యోగం సాధించిన వైనాన్ని ఆమె ‘సాక్షి’తో వివరించింది. ► పర్యావరణ పరిరక్షణ ‘‘అమెరికాలో ఎం.ఎస్. చదివి అక్కడే ఉద్యోగం చేయాలని ఉండేది. కోవిడ్ క్లిష్ట పరిస్థితుల్లో అమెరికా వెళ్లాను. అక్కడికి వెళ్లిన తరువాత నా దృక్కోణం విస్తరించింది. ప్రపంచ స్థాయిలో మానవజాతిని ప్రభావితం చేయగల ఐక్యరాజ్యసమితి, ప్రపంచ బ్యాంకు, ఐఎంఎఫ్ సంస్థల్లో పని చేయాలని నిర్ణయించుకున్నా. ‘యూనివర్సిటీ ఆఫ్ విస్కాన్సిన్– మేసన్’లో ఎంఎస్, పబ్లిక్ పాలసీ కోర్సులో చేరాను. యూనివర్సిటీ స్థాయిలో అనేక అంశాలపై అధ్యయనం చేసి అమెరికాలోనే ప్రఖ్యాతి గాంచిన ప్రొఫెసర్ టిమ్ స్మీడింగ్ వద్ద నైపుణ్యాలను మెరుగుపరుచుకున్నాను. యూనివర్సిటీ స్థాయిలో నేను ఇచ్చిన ప్రజెంటేషన్లు, పరిశోధనల ఆధారంగా ప్రపంచ బ్యాంకు ఉద్యోగం ఇచ్చింది. ► దక్షిణ ఆసియా వాతావరణం నాకు ఉద్యోగంలో దక్షిణ ఆసియా దేశాలకు చెందిన వాతావరణ విభాగం బాధ్యతలను కేటాయించారు. వాతావరణ మార్పును అధ్యయనం చేసే నిపుణురాలిగా, జాయింట్ మల్టీ బ్యాంకు డెవలప్మెంట్ మధ్య సమన్వయకర్తగా, విధానాల రూపకల్పనలు, వాటికి సాంకేతికతను అన్వయించడం, అమలు చేయటం, వివిధ దేశాలలో ఉండవలసిన కచ్చితమైన వాతావరణ కాలుష్యం ప్రామాణికతల నిర్ణయం, సంబంధిత దేశాల వాతావరణ కాలుష్య కార్యక్రమాల్లో అమలు తేడాలను విశ్లేషించడం నా విధులు. వీటికి సంబంధించిన నివేదికల తయారీ, ఒప్పందాల అమలు పర్యవేక్షణ, సమావేశాల్లో చర్చించటం మా విభాగం నిర్వర్తించాల్సిన ప్రత్యేక విధులు. అమెరికా ప్రభుత్వం నాకు ప్రత్యేకంగా జీ4 వీసా జారీ చేసింది. విధులకు హాజరుకావాలని ప్రపంచ బ్యాంకు నుంచి ఆదేశాలు వచ్చాయి. త్వరలోనే అమెరికాకు వెళ్లి విధుల్లో చేరాలి’’ అని చెప్పారు ఇందు కిలారు. సాధించిన విజయాలివి ► కంప్యూటర్ ఇంజినీరింగ్‌లో జాతీయ స్థాయి క్యాంపస్ ఇంజినీరు పరీక్షకు హాజరై రాష్ట్రం నుంచి ఎంపికైన ఇద్దరిలో ఇందు ఒకరు. ► యూఎస్ యూనివర్సిటీలో ఏకగ్రీవంగా యూనిటీ అండ్ డైవర్సిటీ సంఘానికి ఏకగ్రీవంగా కోఆర్డినేటర్‌గా ఎన్నిక. ఆ బాధ్యతల్లో విదేశీ విద్యార్థుల సమస్యల పరిష్కారానికి కృషి. విద్యార్థులు, యూనివర్సిటీ అధికారులకు మధ్య వారధిగా పనిచేసి మల్టీ టాస్కింగ్ విజర్డ్‌గా గుర్తింపు. ► క్రిసాలిస్ అనే ఎన్జీఓ సంస్థలో మేనేజ్మెంట్ బోర్డు అడ్వయిజర్‌గా సేవలు అందించడం. ► టాటా ఇన్స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్, టీచ్ ఫర్ చేంజ్ సంస్థలకు సేవలు అందించడం. ► ఎం.ఎస్.లో అత్యుత్తమ గ్రేడ్స్ సాధించి మూడు సెమిస్టర్లలో రూ 65 లక్షల రూపాయల ఉపకార వేతనం పొందడం. ► విదేశీ విద్యార్థినిగా స్నాతకోత్సవ సభలో యూనివర్సిటీ ఫ్లాగ్ బేరర్‌గా ఎన్నిక. ఔట్‌స్టాండింగ్ స్టూడెంట్ అవార్డు, బెస్ట్ స్టూడెంట్ ఎంప్లాయ్‌గా గోల్డెన్ బ్రిక్ అవార్డు, బెస్ట్ పైరో ఫ్రైజ్ విన్నర్, బెస్ట్ పేపర్ ఇన్ సైన్స్ అండ్ పబ్లిక్ పాలిసీ పురస్కారం. ► ప్రతిష్ఠాత్మకమైన యూరోపియన్ యూనియన్ ప్రాజెక్టు. గ్లోబల్ వార్మింగ్‌పై అధ్యయనం ప్రపంచ బ్యాంకు టీమ్‌తో కలిసి దక్షిణ ఆసియా దేశాలలో గ్లోబల్ వార్మింగ్ తగ్గింపుపై ప్రత్యేక ప్రాజెక్టు రూపొందించాలి. ప్రధానంగా భారత్–పాకిస్థాన్ దేశాలలో వాతావరణ పరిస్థితులపై అధ్యయనం చేస్తాను. ఇండియన్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా గ్రౌండ్ లెవల్లో కూలింగ్ సొల్యూషన్స్‌పై సాంకేతికంగా పాలసీని రూపొందించి దాని అమలుకు కృషి చేస్తాను. ఉష్ణోగ్రతలు 1.5–2 డిగ్రీల వరకు తగ్గించగలిగితే వ్యవసాయం, ఆరోగ్యం, కార్మికులకు అనువైన వాతావరణం నెలకొంటుంది. – ఇందు కిలారు – పోలవరపు వాసుదేవ్, సాక్షి, పెనమలూరు, కృష్ణా జిల్లా. -
విశాఖపట్నం : తెలుగు అమ్మాయి ఆడిషన్స్ (ఫొటోలు)
-
National Service Scheme 2021: గ్రామాల దత్తత: సేవాధీరలు
ఈ నెల 24వ తేదీ, జాతీయ సేవాపథకం ఆవిర్భావ దినోత్సవం. మన దేశరాజధాని నగరంలోని రాష్ట్రపతి భవనం 2020–21జాతీయ స్థాయి అవార్డుల ప్రదానోత్సవానికి వేదికైంది. విశిష్ట సేవలందించిన నేషనల్ సర్వీస్ స్కీమ్ (ఎన్ఎస్ఎస్) కార్యకర్తలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా అవార్డు అందుకుంటున్న ఆనంద తరుణం. ఆ సంతోషంలో మన తెలుగు మహిళలు ఇద్దరున్నారు. ఒకరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, అనంతపురం అమ్మాయి సిరిశ్రీ దేవనపల్లి. మరొకరు తెలంగాణ రాష్ట్రం, కాకతీయ యూనివర్సిటీ ప్రొఫెసర్ సుంకరి జ్యోతి. దేవనపల్లి సిరిశ్రీ సొంతూరు సత్యసాయి జిల్లా (పూర్వపు అనంతపురం జిల్లా) కదిరి. నాన్న పద్మనాభ రెడ్డి ఎల్ఐసీలో హైయ్యర్‌గ్రేడ్ అసిస్టెంట్‌గా రిటైరయ్యారు. అమ్మ అమరావతి గృహిణి. తమ్ముడు నిఖిల్ బీటెక్ ఫైనల్ ఇయర్. ఇదీ ఆమె కుటుంబ నేపథ్యం. ప్రస్తుతం సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా కాగ్నిజెంట్‌లో ఉద్యోగం చేస్తున్న సిరి శ్రీ విద్యార్థి దశ నుంచి సామాజిక సేవా కార్యక్రమాల్లో విస్తృతంగా పాల్గొనేది. తాను పొల్గొన్న ఎన్ఎస్ఎస్ కార్యక్రమాలను గుర్తు చేసుకుంటూ ‘‘ఎస్ఆర్ఐటీ కళాశాలలో నిత్యం జాతీయ సేవా పథకంపై ప్రత్యేక క్యాంపులు నిర్వహించాం. రక్తదానం, మొక్కలు నాటడం, పచ్చదనం– పరిశుభ్రత కార్యక్రమాలు చాలా నిర్వహించాం. రోటరీపురం వద్ద రెండు గ్రామాలు దత్తత తీసుకున్నాం. గ్రామంలో ప్రతి ఇంటికి తిరిగి వివరాలు సేకరించాం. ప్రతిరోజూ కార్యక్రమం నిర్వహించి ప్రభుత్వానికి పంపాం. డేటా సేకరించి నిరక్షరాస్యులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాం. పాఠశాలల్లో విద్యార్థులకు టెక్నాలజీ (సాంకేతిక పరిజ్ఞానం) గురించి వివరించి వారికి అవగాహన కల్పించాం. కాలేజీలో శారో హుండీ మా ఎస్ఆర్ఐటీ కళాశాలలో ‘శారో (సేవ్ ఏ రూపీ ఆర్గనైజేషన్)’ పేరుతో ప్రతి బ్లాక్‌లోనూ హుండీ ఏర్పాటు చేశారు. విద్యార్థులం స్వచ్ఛందంగా ఇందులోకి నగదు జమ చేసేవాళ్లం. ఆరు నెలలకోసారి ఈ మొత్తంతో అనాథ, వృద్ధాశ్రమాల్లో కార్యక్రమాలను నిర్వహించేవాళ్లం. ఈ విధానం నచ్చడంతో జాతీయ సేవా కార్యక్రమాల వైపు ఆకర్షితమయ్యాను. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ డాక్టర్ చిన్నపుల్లయ్య సార్ మాకు ఎంతో తోడ్పాటు అందించారు. జాతీయ సేవా పథకంలో పని చేయడం వల్ల సేవాభావం మాత్రమే కాదు నాయకత్వ లక్షణాలు కూడా పెంపొందుతాయి. ఎన్ఎస్ఎస్ వాలంటీర్‌గా 2019లో గుజరాత్లో జరిగిన ప్రీ–రిపబ్లిక్ పరేడ్ క్యాంప్‌కు ఎంపికయ్యాను. 2020 జనవరి 26న రిపబ్లిక్ డే పరేడ్‌లో పాల్గొనే అవకాశం దక్కింది. ఇక ఇప్పుడు గౌరవనీయులు భారత రాష్ట్రపతి గారి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడాన్ని జీవితకాల సాఫల్యంగా భావిస్తున్నాను. ఇంతకు మించి గొప్ప ఘనత నా జీవితంలో ఉండదేమో! మాటల్లో చెప్పలేని ఆనందం కలుగుతోంది. ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా చేతుల మీదుగా సత్కారం అందుకోవడం గర్వకారణంగా భావిస్తున్నాను’’ అని తన సంతోషాన్ని వ్యక్తం చేశారు సిరి శ్రీ దేవనపల్లి. – బడ శ్రీనివాస రెడ్డి, సాక్షి, అనంతపురం లీడర్షిప్ మాత్రమే ‘‘మాది హన్మకొండ. ఇంటర్ హన్మకొండలోని ప్రభుత్వ పింగిళి కళాశాల, డిగ్రీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలో, పీజీ ఉస్మానియా యూనివర్సిటీలో చేశాను. కాకతీయ యూనివర్సిటీ, కెమిస్ట్రీ విభాగంలో డాక్టరేట్ చేసి, 2007లో అదే యూనివర్సిటీలో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా కెరీర్ ప్రారంభించాను. 2008లో అప్పటి ప్రిన్సిపాల్ నన్ను ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా నియమించారు. నాకు విద్యార్థి దశలో ఎన్ఎస్ఎస్తో పరిచయం లేదు. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా బాధ్యతలను స్వీకరించిన తర్వాత నా టీమ్‌లోని వాలంటీర్ల సామాజిక సేవాపథం, వారు కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్గొనే తీరు నన్ను స్ఫూర్తిమంతం చేశాయి. ఎన్ఎస్ఎస్ వాలంటీర్లతో కుమ్మరిగూడెంలో ప్రత్యేక శిబిరం పెట్టి మొక్కలు నాటాం. సామాజిక రుగ్మతలపై ప్రజల్లో చైతన్య కల్పన కు కృషి చేశాం. అలా 2012వరకు నాలుగేళ్లపాటు ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ ఆఫీసర్‌గా కొనసాగాను. కో ఆర్డినేటర్‌గా... కాకతీయ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ కోఆర్డినేటర్‌గా 2017లో అప్పటి వీసీ ఆచార్య ఆర్ సాయన్న నియమించారు. యూనివర్సిటీ చరిత్రలో ఎన్ఎస్ఎస్ కో ఆర్డినేటర్‌గా ఒక మహిళకు అవకాశం రావడం అదే తొలిసారి. ఆ బాధ్యతలను సమర్థంగా నిర్వహించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేశాను. ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల్లో కలిపి 360 ఎన్ఎస్ఎస్ యూనిట్లు 36 వేలమంది వాలంటీర్లతో పనిచేశాను. హరితహారంలో మొక్కలు నాటాం, పర్యావరణ పరిరక్షణ పట్ల అవగాహన కల్పించాం. రక్తదానం శిబిరాల్లో 25 వేలమంది వాలంటీర్లు, లక్షా 18వేల యూనిట్ల రక్తదానం చేశారు. 975 ఆరోగ్య శిబిరాలు నిర్వహించాం. గుప్పెడు బియ్యం (కప్ ఆఫ్ రైస్) పేరున ఇంటింటికి తిరిగి బియ్యం సేకరించి, నిరుపేదలకు, అనాథలకు పంపిణీ, జలశక్తి అభియాన్ కార్యక్రమం ద్వారా నీటì సంరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై అవగాహన కల్పించడం, శ్రమదానం చేసి యూనివర్సిటీ క్యాంపస్‌లో ఇంకుడు గుంతలు తవ్వడంతోపాటు క్యాంపస్‌లో ఉన్న చెక్ డ్యామ్‌లకు మరమ్మతులు కూడా చేశాం. మేడారం జాతరలో భక్తులకు సేవలందించడం, ఎన్నికల సమయాల్లో పోలింగ్ బూత్‌ల దగ్గర ఓటర్లకు సేవలందించడంలోనూ మా కార్యకర్తలు ముందుండేవాళ్లు. కోవిడ్ సమయంలో శానిటైజర్, మాస్కుల పంపిణీ చేశాం. ఇన్ని సేవల నేపథ్యంలో అందిన ఈ గౌరవం మధురానుభూతిగా మిగులుతుంది’’ అన్నారు సుంకరి జ్యోతి. – డి. రమేశ్, సాక్షి, హన్మకొండ -
ఒమన్ నుంచి ముగ్గురు మహిళలు రాక
గన్నవరం: ఏజెంట్ల మాయమాటలు నమ్మి ఒమన్ వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన రాష్ట్రానికి చెందిన మరో ముగ్గురు మహిళలను రాష్ట్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) గురువారం స్వరాష్ట్రానికి తీసుకొచ్చింది. ఒమన్ రాజధాని మస్కట్ నుంచి ఎయిరిండియా విమానంలో ఈ ముగ్గురు గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. వీరిలో ఇద్దరు పశ్చిమ గోదావరి జిల్లావారు కాగా, మరొకరు కడపకు చెందినవారు. వీరి విమాన టిక్కెట్ ఖర్చులను ఏపీ ప్రభుత్వమే భరించింది. అంతేకాకుండా వారిలో పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఇద్దరికి, కడపకు చెందిన ఒకరికి ప్రయాణం, భోజనం ఖర్చులను కూడా అందించింది. గన్నవరం విమానాశ్రయంలో వీరికి ఏపీఎన్ఆర్టీఎస్ సిబ్బంది స్వాగతం పలికారు. ఒమన్ వెళ్లి చిక్కుకుపోయిన వలస కార్మికులకు ఆ దేశం క్షమాభిక్ష ప్రకటించడంతో తొలి విడత ఈ నెల 14న ఎనిమిది మందిని రాష్ట్రానికి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి మహిళలు కృతజ్ఞతలు తెలియజేశారు. చదవండి: పనిమనిషిపై పైశాచికం.. శరీరంపై 31 గాయాలు ఆస్ట్రేలియా నుంచి రప్పించి మరీ ఎన్నారై అరెస్టు -
పవర్ గర్ల్
పూటగడవని కుటుంబంలో పుట్టిన అనూషకు ఆర్థిక పరిస్థితులు అవరోధంగా నిలిచాయి. అయితే పతకం సాధించి దేశానికి ఖ్యాతి తీసుకురావాలన్న తపన ఆ అవరోధాలను అధిగమించేలా చేసింది. అడుగడుగునా ఆటంకాలు ఎదురవుతున్నా మొక్కవోని ఆత్మ సై ్థర్యంతో పతకాలను సాధిస్తూ పవర్ గర్ల్‌గా, వేమన విశ్వవిద్యాలయ మహిళా శక్తిగా ఖ్యాతి గడించి.. ప్రపంచక్రీడాపటంలో తనకంటూ ఓ స్థానం ఏర్పరచుకుని ముందుకు సాగుతున్నారు అనూష. యోగివేమన విశ్వవిద్యాలయం క్రీడాకారిణి పవర్‌లిఫ్టింగ్ క్రీడలో రాణిస్తూ తెలుగు మహిళల సత్తా ప్రపంచానికి చాటుతోంది. వైవీయూ అనుబంధంగా గల బద్వేలు పట్టణంలోని ఎస్.బి.వి.ఆర్. డిగ్రీ కళాశాలలో తృతీయ సంవత్సరం చదువుతున్న డొంకెన అనూష స్వస్థలం కృష్ణా జిల్లా మైలవరం మండలం పొందగల గ్రామం. ఫిబ్రవరి 16 నుంచి 18వ (నేడు) వరకు కేరళలోని కాలికట్లో నిర్వహించనున్న అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొనేందుకు వెళ్లే ముందు అనూషను ‘సాక్షి’ పలకరించినప్పుడు.. ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయని.. ఆర్థిక చేయూతనిస్తే కామన్వెల్త్లో పతకం సాధించి దేశఖ్యాతిని ప్రపంచక్రీడాపటంలో చాటిచెబుతానని ఆమె ఆత్మవిశ్వాసంతో అన్నారు. ఆ వివరాలు ఆమె మాటల్లోనే...‘‘నాన్న కల్లుగీత కార్మికుడు. ఎంత కష్టమైనా సరే నన్ను చదివించాలనుకున్నారు. నాకు మాత్రం చదువుతో పాటు ఆటలంటే ఎంతో ఆసక్తి. చిన్నతనం నుంచి రకరకాల ఆటల్లో పాల్గొనేదాన్ని పాఠశాలస్థాయిలో కబడ్డీ క్రీడలో రాణించాను కూడా. మగరాయుడిలా వేషాలేంటన్నారు మా ఊర్లో ఆడపిల్లలంటే చిన్నచూపు. దానికి కారణం నిరక్షరాస్యత అయితే.. రెండో కారణం ఆటలపై అవగాహన లేకపోవడమే. నేను పదోతరగతి చదువుతున్నప్పుడు మైలవరంలో ఓ శిక్షణ శిబిరం జరిగింది. అక్కడకు వెళ్లినప్పుడు నాకు పవర్‌లిఫ్టింగ్ మీద ఆసక్తి పెరిగింది. నాకూ శిక్షణ తీసుకోవాలనిపించింది. దీని కోసం ప్యాంట్లు వేసుకోవాల్సి వచ్చేది. మా గ్రామంలో చాలామందికి నచ్చలేదు. నేను అలా వేసుకుని వెళ్లినప్పుడల్లా మగరాయుడిలా ఆ బట్టలేంటి.. వేషాలేంటి.. ఆటలేంటి అని అనేవారు. నేనేదో చేయకూడని పని చేస్తున్నట్లుగా చూసేవారు. దాంతో మానసికంగా కుంగిపోయేదాన్ని. రాత్రిళ్లు నిద్రపట్టేది కాదు. ఎవరేమనుకుంటే నాకేం అనే పరిణతి చాలా రోజులకు వచ్చింది. ఎంతకష్టమైనా సరే ఆట, చదువుని నిర్లక్ష్యం చేయకూడదనుకున్నా. నా కోసం.. నా తమ్ముడు కూలీపనులకు వెళ్లాడు పదోతరగతి పరీక్షల కోసమని కొన్నాళ్లు పవర్‌లిఫ్టింగ్ నుంచి విరామం తీసుకోవాల్సి వచ్చింది. ఇంటర్లో చేరాక శిక్షణ మీద దృష్టి పెట్టాను క్రమంగా జిల్లాస్థాయి పోటీలకు వెళ్లాను. పతకాలు వచ్చేవి. శిక్షణ తీసుకోవడం తేలికైంది. కానీ.. ఆ సమయంలో ఆర్థికంగా సమస్యలు తప్పలేదు. పవర్‌లిఫ్టింగ్ కోసం ఫిట్‌గా ఉండాలి. మంచి పౌష్టికాహారం తీసుకోవాలి.. నిపుణుల ఆధ్వర్యంలో వ్యాయామాలు చేయాలి. ఇంట్లో చూస్తేనేమో నాన్న మా పోషణకు, చదువులకే కష్టపడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్లను అడగడం భావ్యం కాదనిపించింది. అందుకే పవర్‌లిఫ్టింగ్ వదిలేసి.. ఓ ప్రైవేట్ స్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయురాలిగా చేరా. నా మనసు మాత్రం పవర్‌లిఫ్టింగ్‌పై ఉండేది. కొన్నాళ్లకు అమ్మానాన్నలకి విషయం చెప్పా, వాళ్లు అప్పులైనా ఫర్వాలేదు.. నువ్వు అనుకున్నది చెయ్ అంటూ ప్రోత్సహించారు. అయితే కొన్ని రోజులకే నాన్న (శ్రీనివాసరావు) కు పక్షవాతం వచ్చింది. ఏమి చేయాలో అర్థం కాలేదు. అప్పుడే మా తమ్ముడు వంశీ నా గురించి ఆలోచించి చదువు మానేశాడు. కూలీ పనులకు వెళ్లడం మొదలుపెట్టాడు. అమ్మ మల్లేశ్వరి కూడా నా కోసం పనులకు వెళ్లేది. అలా కుటుంబసభ్యుల సహకారంతో 2016లో మళ్లీ పవర్ లిఫ్టింగ్ వైపు వెళ్లా. చదువుకుంటూనే.. తొలుత హైదరాబాద్‌లోని ఉస్మానియాలో ఎల్ఎల్బీ చదివేందుకు వెళ్లినా.. ఇబ్బందుల దృష్ట్యా వెనుదిరగాల్సి వచ్చింది. అదే సమయంలో ఎవరో శ్రేయోభిలాషులు చెప్పడంతో వైవీయూలో పతకాలు సాధించిన క్రీడాకారులకు ఉచితంగా విద్యనందిస్తారని తెలిసి కృష్ణా జిల్లా నుంచి వైవీయూకు వచ్చాను. వైవీయూ పరిధిలోని బద్వేలులోని ఎస్.బి.వి.ఆర్. డిగ్రీ కళాశాలలో 2016లో డిగ్రీ బీఏ (హెచ్ఈపీ)లో చేరిపోయా. కళాశాల యాజమాన్యం ఉచిత విద్యతో పాటు నెలకు రూ.5 వేలు నా భోజన ఖర్చులకు వెచ్చిస్తూ చక్కటి ప్రోత్సాహం ఇస్తున్నారు. దీంతో పాటు మెరుగైన శిక్షణ కోసం చెన్నైలోని అంజుకర్ పవర్‌లిఫ్టింగ్ అకాడమీలో చేరా. కోచ్ ప్రోత్సాహంతో జాతీయస్థాయి పోటీలకు వెళ్లగలిగా. దక్షిణాఫ్రికాలో 2018 సెప్టెంబర్ 2 నుంచి 10వ తేదీ వరకు ప్రపంచ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీలు నిర్వహించారు. దాదాపు 50 దేశాల నుంచి క్రీడాకారులు పాల్గొన్నారు. మనదేశం నుంచి 18 మంది వెళితే అందులో నేను ఉన్నా. జూనియర్స్ 84 కిలోల విభాగంలో పోటీపడ్డా. స్క్వాట్ విభాగంలో 190 కిలోలు, బెంచ్ ప్రెస్ విభాగంలో 110 కిలోలు, డెడ్‌లిఫ్ట్ విభాగంలో 182.5 కిలోలు ఎత్తి మొత్తం మీద 482.25 కిలోల బరువు ఎత్తి రజత పతకం సాధించా. ఈ పోటీలకు వెళ్లడానికి ముందు నా చేతిలో చిల్లిగవ్వ లేదు. నా గురించి తెలిసి చాలా మంది దాతలు ఆర్థికంగా సాయం చేశారు. పతకం సాధించాలి.. అప్పులూ తీర్చాలి.. ప్రస్తుతానికి నా ముందు రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి కామన్వెల్త్లో దేశానికి పతకం తీసుకురావడం ఒక లక్ష్యమైతే నాకోసం మా కుటుంబసభ్యులు చేసిన అప్పులు తీర్చడం మరో లక్ష్యంగా భావిస్తున్నా. ప్రపంచ పతకం సాధించిన సమయంలో ప్రభుత్వం రూ.10 లక్షలు, డీఎస్పీ స్థాయి ఉద్యోగం ప్రకటించింది. అయితే అది ఇంకా చేతికి అందలేదు. వస్తే నా కష్టాలు తీరతాయని భావిస్తున్నా. నాగరాజు, సాక్షి, కడప వైవీయూ అధికారుల ప్రోత్సాహం అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో పాల్గొనేందుకు సన్నద్ధమవుతున్న డొంకెన అనూషకు వైవీయూ అధికారులు అండగా నిలిచారు. ఆమె సాధన చేసుకునేందుకు ప్రపంచస్థాయి పరికరాలను అందుబాటులో ఉంచడంతో పాటు ఆమెకు ఉచితంగా వసతి కల్పించారు. దీంతో పాటు అఖిల భారత అంతర్ విశ్వవిద్యాలయ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో రాణించడంతో పాటు పతకం సాధిస్తే రూ. 30 వేలు నగదు ప్రోత్సాహకంతో పాటు నెలకు రూ.5 వేలు చొప్పున ఉపకార వేతనం ఇచ్చేందుకు వైవీయూ అధికారులు సిద్ధంగా ఉన్నారు. దీంతో పాటు పరీక్షల్లో సైతం 20 శాతం మేర మార్కులు కలిపి ప్రోత్సహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు వైవీయూ అధికారులు స్పష్టం చేశారు’’ అని అనూష తెలిపారు. అనూష సాధించిన పతకాలు ►2012లో ఉదయ్‌పూర్‌లో నిర్వహించిన సబ్‌జూనియర్ పవర్‌లిఫ్టింగ్ పోటీల్లో స్వర్ణం. ►ఎస్జీఎఫ్ నేషనల్ పవర్‌లిఫ్టింగ్‌లో రజతం ►జూనియర్ నేషనల్ పవర్‌లిఫ్టింగ్‌లో రజతం ►2014, 15, 16 జూనియర్ నేషనల్స్‌లో వరుసగా స్వర్ణం సాధించి చాంపియన్‌గా గుర్తింపు ►2014 గోవాలో నిర్వహించిన సీనియర్ నేషనల్స్‌లో కాంస్యం. ►2014లో పఠాన్‌కోట్‌లో నిర్వహించిన ఆలిండియా అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో కాంస్యం ►2016లో చండీగఢ్‌లో నిర్వహించిన ఆలిండియా అంతర్ విశ్వవిద్యాలయ పోటీల్లో కాంస్యం ►2016లో జమ్మూకశ్మీర్‌లో నిర్వహించిన ఫెడరేషన్ కప్‌లో కాంస్యం. ►2018లో శ్రీకాకుళం రాజాంలో నిర్వహించిన జూనియర్ వరల్డ్ చాంపియన్‌షిప్ క్యాంపులో ప్రతిభ.. ప్రథమ స్థానంలో నిలవడంతో దేశానికి ప్రాతినిధ్యం వహించే అవకాశం. ►2018 సెప్టెంబర్ 2 నుంచి 10వ తేదీ వరకు దక్షిణాఫ్రికాలోని కొచెస్ట్రామ్లో నిర్వహించిన ప్రపంచ జూనియర్ పవర్‌లిఫ్టింగ్ చాంపియన్‌షిప్ పోటీల్లో రజత పతకం. -
రైలులో భర్త మృతి... భాష రాక ఇబ్బందులు
హైదరాబాద్: రైలులో ప్రయాణిస్తుండగా భర్త అనారోగ్యంతో కన్నుమూశాడు. భాష తెలియని ప్రాంతంలో.. విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని స్థితిలో అతని భార్య నరకయాతన అనుభవిస్తోంది. ఈ హృదయ విదారక ఘటన కాన్పూర్‌లో చోటుచేసుకుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన రమేష్ అనే వ్యక్తి గోరఖ్‌పూర్ వెళ్తుండగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో అనారోగ్యంతో రైలులోనే మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని రైల్వే సిబ్బంది కాన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని భార్య లీలా భాష తెలియక, వివరాలు సరిగ్గా చెప్పలేక నరకయాతన అనుభవిస్తోంది. భర్త మృతదేహాన్ని ఖమ్మం తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ అర్థిస్తోంది. మరోవైపు రమేష్ మరణ వార్త తెలుసుకుని అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు. స్పందించిన కేటీఆర్: మృతుడి కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందిచాలని మృతుడి స్నేహితుడు ట్విట్టర్ ద్వారా ఐటీ శాఖా మంత్రి కె తారకరామారావును కోరారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బాధితులకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. యూపీలోని అధికారులతో ఫోన్లో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామమని హామీ ఇచ్చారు. -
మక్కాలో సిరిసిల్ల వాసి మృతి
సిరిసిల్ల: సిరిసిల్ల పట్టణానికి చెందిన మహిళ మక్కా మదీనాలో మృతిచెందింది. స్థానిక పోస్టాఫీసు వద్ద నివసించే అహ్మది బేగం తన స్నేహితురాలితో కలిసి పది రోజుల క్రితం మక్కా మదీనాకు వెళ్లారు. అక్కడ యాత్ర పూర్తి చేసుకుని ఆదివారం సాయంత్రం తిరుగు ప్రయాణం కావాల్సి ఉంది. ఇంతలోనే ఉదయం ఆమె గుండె పోటుతో మరణించారు. ఈమేరకు ఆమె మృతి సమాచారం అందిందని కుటుంబ సభ్యులు తెలిపారు. -
రాజన్నకు రక్షాబంధన్!
సోదరీ సోదరుల అనురాగం, అప్యాయతలు, అనుబంధం, రక్షణకు ప్రతీక... రాఖీ పౌర్ణమి (రాక్షాబంధన్). ఆ పర్వదినం నేడే. ఈ నేపథ్యంలో మహానేత, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిని తెలుగునేలపై ఉన్న ప్రతి మహిళ స్మరించుకుంటుంది. కుటుంబంలో ఓ మహిళ ఆర్థికాభివృద్ధి సాధిస్తే కుటుంబం మొత్తం ప్రగతి పథంలో పయనిస్తుందని మనసా వాచా కర్మణ నమ్మె వ్యక్తి వైఎస్ఆర్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, ఓ సోదరుడిగా ఆయన తెలుగునేలపై ఉన్న ప్రతి మహిళ ముఖంలో చిరునవ్వులు చిందించాలని ఆకాంక్షించారు. అందుకు మహిళల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టారు. అందులోభాగంగా అభయహస్తం, పావల వడ్డీకే రుణాలు, వితంతువులకు పెన్షన్లు, విద్యార్థులకు ఫీజురీయింబర్స్మెంట్తోపాటు పలు పథకాలను ప్రవేశపెట్టారు. ఈ పథకాల ద్వారా రాష్ట్రంలోని లక్షలాది మంది మహిళలు లబ్ది పొందారు. ఆ మహిళల ఇంట ఆనందం తాండవమాడింది. అంతలో ఆ మహానేత ఆకస్మికంగా మరణించారు. ఆ తర్వాత వచ్చిన నాయకులు ఆ పథకాలను నిర్లక్ష్యం చేశారు. దాంతో మహిళల ఇళ్లలో చీకట్లు అలముకున్నాయి. వైఎస్ఆర్ ఉండిఉంటే ఆయన ప్రవేశపెట్టిన పథకాలు తమకు కొండంత అండగా ఉండేవని మహిళలంతా అనుకుంటున్నారు. ఓ సోదరుడిగా తమ కుటుంబాలలో వెలుగులు నింపినందుకు రాఖీ పౌర్ణమి రోజైన ఈ రోజు (ఆదివారం) తెలుగునేలపై ఉన్న మహిళలంతా ఆ మహానేత వైఎస్ఆర్ చిత్రపటానికి తిలకం పెట్టి, రక్షాబంధన్ ఉంచారు. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఇడుపులపాయలోని దివంగత మహానేత వైఎస్ఆర్ సమాధి వద్దకు ఆదివారం అధిక సంఖ్యలో మహిళలు విచ్చేశారు. ఈ సందర్బంగా ఆయన సమాధి వద్ద రాఖీలని ఉంచి ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం రాష్ట్రానికి మహానేత చేసిన సేవలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు.