హైదరాబాద్: రైలులో ప్రయాణిస్తుండగా భర్త అనారోగ్యంతో కన్నుమూశాడు. భాష తెలియని ప్రాంతంలో.. విపత్కర పరిస్థితుల్లో ఏం చేయాలో తెలియని స్థితిలో అతని భార్య నరకయాతన అనుభవిస్తోంది. ఈ హృదయ విదారక ఘటన కాన్పూర్‌లో చోటుచేసుకుంది. తెలంగాణలోని ఖమ్మం జిల్లాకు చెందిన రమేష్ అనే వ్యక్తి గోరఖ్‌పూర్ వెళ్తుండగా ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాన్పూర్ సమీపంలో అనారోగ్యంతో రైలులోనే మృతి చెందాడు.
దీంతో మృతదేహాన్ని రైల్వే సిబ్బంది కాన్పూర్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అతని భార్య లీలా భాష తెలియక, వివరాలు సరిగ్గా చెప్పలేక నరకయాతన అనుభవిస్తోంది. భర్త మృతదేహాన్ని ఖమ్మం తీసుకొచ్చేందుకు సాయం చేయాలంటూ అర్థిస్తోంది. మరోవైపు రమేష్ మరణ వార్త తెలుసుకుని అతడి కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతున్నారు.
స్పందించిన కేటీఆర్: మృతుడి కుటుంబానికి తగిన సహాయ సహకారాలు అందిచాలని మృతుడి స్నేహితుడు ట్విట్టర్ ద్వారా ఐటీ శాఖా మంత్రి కె తారకరామారావును కోరారు. దీనిపై మంత్రి కేటీఆర్ స్పందించారు. బాధితులకు సహాయ సహకారాలు అందిస్తామన్నారు. యూపీలోని అధికారులతో ఫోన్‌లో మాట్లాడి తగిన చర్యలు తీసుకుంటామమని హామీ ఇచ్చారు.
రైలులో భర్త మృతి... భాష రాక ఇబ్బందులు
Published Sat, Jun 17 2017 10:45 AM | Last Updated on Tue, Sep 5 2017 1:52 PM
Advertisement