
చిత్తూరు, సాక్షి: తమిళనాడు మహాబలిపురం బీచ్ వద్ద ఆందోళనకర వాతావరణం నెలకొంది. ముగ్గురు తెలుగు విద్యార్థులు సముద్రంలో గల్లంతు అయ్యారు. దీంతో గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. ఈ ముగ్గురూ చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ కాలేజ్‌లో చదివే విద్యార్థులుగా తెలుస్తోంది.
కాలేజీ తరఫున తమిళనాడు టూర్‌కి వెళ్లింది 18 మంది విద్యార్థుల బృందం. సరదాగా ఈత కోసం సముద్రంలో దిగారు విద్యార్థులు. ఇందులో మౌనిష్, విజయ్, ప్రభు అనే ముగ్గురు ఒక్కసారిగా గల్లంతైనట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు ప్రయత్నిస్తున్నారు.
ఈ ముగ్గురి స్వస్థలాలు.. మౌనిష్-బంగారుపాలెం, విజయ్- సదుం, ప్రభు-పులిచెర్ల గ్రామంగా తెలుస్తోంది. విద్యార్థుల గల్లంతు సమాచారంతో తల్లిదండ్రుల్లో..బంధువుల్లో ఆందోళన నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment