mahabalipuram
-
మహాబలిపురం బీచ్‌లో తెలుగు విద్యార్థుల గల్లంతు
-
మహాబలిపురం బీచ్‌లో తెలుగు విద్యార్థుల గల్లంతు
చిత్తూరు, సాక్షి: తమిళనాడు మహాబలిపురం బీచ్ వద్ద ఆందోళనకర వాతావరణం నెలకొంది. ముగ్గురు తెలుగు విద్యార్థులు సముద్రంలో గల్లంతు అయ్యారు. దీంతో గజ ఈతగాళ్లు రంగంలోకి దిగారు. ఈ ముగ్గురూ చిత్తూరు జిల్లా పలమనేరు ప్రభుత్వ కాలేజ్‌లో చదివే విద్యార్థులుగా తెలుస్తోంది. కాలేజీ తరఫున తమిళనాడు టూర్‌కి వెళ్లింది 18 మంది విద్యార్థుల బృందం. సరదాగా ఈత కోసం సముద్రంలో దిగారు విద్యార్థులు. ఇందులో మౌనిష్, విజయ్, ప్రభు అనే ముగ్గురు ఒక్కసారిగా గల్లంతైనట్లు తోటి విద్యార్థులు చెబుతున్నారు. గల్లంతైన విద్యార్థుల ఆచూకీ కోసం గజ ఈతగాళ్లు ప్రయత్నిస్తున్నారు. ఈ ముగ్గురి స్వస్థలాలు.. మౌనిష్-బంగారుపాలెం, విజయ్- సదుం, ప్రభు-పులిచెర్ల గ్రామంగా తెలుస్తోంది. విద్యార్థుల గల్లంతు సమాచారంతో తల్లిదండ్రుల్లో..బంధువుల్లో ఆందోళన నెలకొంది. -
ప్రపంచ వింతల్లో మహాబలిపురం
సాక్షి, చెన్నై: ప్రముఖ పర్యాటక, ఆధ్యాత్మిక కేంద్రంగా ఉన్న మహాబలిపురం ప్రపంచ వింతల్లో చేరటమే కాకుండా పర్యాటకుల సందర్శనలో తాజ్ మహల్‌నే అధిగమించి తమిళనాడుకే గర్వకారణంగా నిలిచింది. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా భారత ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ విడుదల చేసిన ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్ 2022 పేరుతో భారత పురావస్తు శాఖ నివేదిక ప్రకారం మన దేశంలో విదేశీయులు ఎక్కువగా సందర్శించే స్మారక చిహ్నాల జాబితాలో తమిళనాడులోని మహాబలిపురం అగ్రస్థానంలో ఉందని ప్రకటించారు. పల్లవ రాజులు నిర్మించిన 7వ, 8వ శతాబ్దపు సముద్రతీర దేవాలయాలు, శిల్పా సౌందర్యంతో కూడిన దేవాలయాలు ప్రపంచ ప్రసిద్ధి చెందినవి. వందల ఏళ్ల క్రితం మహేంద్రవర్మ నిర్మించిన రాతి రథాలు, ఆలయాలు కాలంతో పాటు సగర్వంగా నిలుస్తున్నాయి. యునెస్కో జాబితాలో సైతం చోటు సంపాదించింది. ఈ అద్భుతాన్ని చూసేందుకు ఏటా లక్షల మంది ప్రజలు, పర్యాటకులు, విదేశీయులు ఇక్కడికి వస్తుండటం విశేషం. ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్ 2022 పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన ఇండియా టూరిజం స్టాటిస్టిక్స్ 2022 ప్రకారం, యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్‌గా వర్గీకరించిన మహాబలిపురానికి విదేశీ సందర్శకుల సంఖ్యలో తాజ్ మహల్‌ను అధిగమించింది. సెప్టెంబరు 27న న్యూఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్లో ప్రపంచ పర్యాటక దినోత్స వం సందర్భంగా ఉపాధ్యక్షుడు జగదీప్ ధన్కర్ దీనిని విడుదల చేశారు. పర్యాటక మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నివేదిక ప్రకారం చెన్నైకి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న మామల్లపురం (మహాబలిపురం)ను 2021–22లో 1,44,984 మంది విదేశీ పర్యాటకులు సందర్శించారు. 45.50 శాతం మంది విదేశీయులు పర్యటించి మొదటి స్థానంలో నిలువుగా, ఆగ్రాలోని తాజ్ మహల్‌ను 38,922 మంది విదేశీ సందర్శకులతో రెండో స్థానంలో నిలిచి 12.21 శాతంగా నిలిచింది. మహాబలిపురం విశేషాలు ఈ ప్రదేశంలో 7వ , 8వ శతాబ్దపు హిందూ మతపరమైన స్మారక చిహ్నాల సేకరణ ఉంది. 40 పురాతన దేవాలయాలు, స్మారక కట్టడాల్లో గంగా అవరోహణ, పంచ రథాలు, ఏకశిలా పిరమిడ్ నిర్మాణాలు, 7వ శతాబ్దానికి చెందిన 10 రాక్–కట్ గుహ దేవాలయాలు, ఒక బీచ్ టెంపుల్‌తో సహా కళాత్మక రాతి నిర్మాణాలు పర్యటకులను మంత్రముగ్ధులను చేస్తున్నాయి. భారత పర్యాటక శాఖ ప్రచురించిన జాబితాలోని మొదటి 10 స్మారక చిహ్నాలలో ఆరు తమిళనాడులో ఉండటం విశేషం. మహాబలిపురంలో అనేక అద్భుత క్షేత్రాలతో పాటు సీషెల్, మారిటైమ్ హెరిటేజ్ మ్యూజియం, 40,000 పైగా అరుదైన సీషెల్ నమూనాలు, ముత్యాలు, అక్వేరియంలు, డైనోసార్ శిలాజాలు పర్యటకులను సంమ్మోహన పరుస్తాయి. మామల్లపురం సముద్రపు గవ్వలతో చేసిన కళాఖండాలు మనకంటే విదేశీయులు ఎక్కువగా కొనుగోలు చేసి ఆనందిస్తారు. మొత్తానికి మహాబలిపురం ప్రాంతం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా నిస్సందేహంగా రుజువు చేస్తుంది. -
విషాదం నింపిన పుట్టిన రోజు వేడుక
సాక్షి, హైదరాబాద్: స్నేహితులతో కలిసి పుట్టిన రోజు వేడుకలు ఉత్సాహంగా జరుపుకునేందుకు వెళ్లిన ఓ యువకుడు సముద్రంలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. చెన్నై ప్రాంతంలోని ఐఐటీలో ఉన్నత చదువు చదువుకునేందుకు వెళ్లి పుట్టిన రోజు నాడే తనువు చాలించడం ఆ తల్లిదండ్రులకు పుట్టెడు దుఃఖాన్ని మిగిల్చింది. ఆలస్యంగా ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. బౌద్ధనగర్‌కు చెందిన గంజి ఉమాపతి, భాగ్యలక్ష్మి దంపమతులకు కుమారుడు నితిన్ (21), ఒక కుమార్తె ఉన్నారు. కుమారుడు నితిన్ దార్వాడిలోని ఐఐటీలో మూడో సంవత్సరం చదువుతున్నాడు. ఈ నెల 23న శుక్రవారం నితిన్ పుట్టిన రోజు కావడంతో మహాబలిపురంలో సముద్ర స్నానానికి స్నేహితులతో కలిసి వెళ్లారు. సముద్రస్నానం చేస్తుండగా నితిన్‌తో పాటు మరో ఇద్దరు స్నేహితులు సముద్రం లోపలికి వెళ్లగా బలమైన అలలు రావడంతో సముద్రం లోపలికి కొట్టుకుని పోయారు. ఇద్దరు స్నేహితులు ఎలాగో బయటపడగా నితిన్ మాత్రం శవమై బయటకు వచ్చాడు. స్థానిక పోలీసులు వచ్చి మృతదేహాన్ని శంగర్‌పట్టు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని ఆదివారం ఉదయం బౌద్ధనగర్‌కు తీసుకుని వచ్చారు. కన్నీరు మున్నీరుగా తల్లిదండ్రులు.. చెట్టంత కొడుకు త్వరలోనే ప్రయోజకుడై వస్తాడని ఎదురు చూస్తుండగా శవమై ఇంటికి రావడంతో వారి బాధ వర్ణనాతీతం. మధ్యాహ్నం స్థానిక శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. బీజేపీ సికింద్రాబాద్ నియోజకవర్గ నాయకులు రవిప్రసాద్‌గౌడ్, పద్మశాలి సంఘం అధ్యక్షుడు నరేందర్, దేవదాసు, భాస్కర్, నవీన్, శ్రీకాంత్‌లు మృతుడికి నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. చదవండి: ఆత్మహత్య చేసుకోవడం ఎలా? నటిస్తూ.. పాఠశాల విద్యార్థి మృతి -
Chess Olympiad: నా అత్యుత్తమ ప్రదర్శన ఇస్తా: హరికృష్ణ
చెన్నై: స్వదేశంలో తొలిసారి జరుగుతున్న ప్రతిష్టాత్మక చెస్ ఒలింపియాడ్‌లో తన అత్యుత్తమ ప్రదర్శన ఇస్తానని భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్ ప్లేయర్ పెంటేల హరికృష్ణ తెలిపాడు. ఈనెల 28 నుంచి ఆగస్టు 8 వరకు తమిళనాడులోని మహాబలిపురంలో చెస్ ఒలింపియాడ్ జరగనుంది. 187 దేశాల నుంచి ఓపెన్, మహిళల విభాగాల్లో కలిపి మొత్తం 343 జట్లు పతకాల కోసం పోటీపడతాయి. గత నెలలో ప్రాగ్ మాస్టర్స్ టోర్నీలో విజేతగా నిలిచిన 36 ఏళ్ల హరికృష్ణ తన కెరీర్లో పదోసారి చెస్ ఒలింపియాడ్‌లో భారత్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ‘2000 నుంచి నేను చెస్ ఒలింపియాడ్‌లో పోటీపడుతున్నాను. సుదీర్ఘకాలం నుంచి దేశానికి ప్రాతినిధ్యం వహించడం గర్వంగా ఉంది. సీనియర్ ప్లేయర్‌గా మెరుగ్గా రాణించాలనే బాధ్యత ఉంది. నా అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా’ అని హరికృష్ణ వ్యాఖ్యానించాడు. ‘ఆతిథ్య దేశం హోదాలో భారత్ ఓపెన్ విభాగంలో మూడు, మహిళల విభాగంలో మూడు జట్లను బరిలోకి దించనుంది. ఇప్పటికైతే పతకాల గురించి ఆలోచించడంలేదు. టోర్నీ మొత్తం నిలకడగా రాణిస్తే పతకాలు వాటంతట అవే వస్తాయి’ అని ప్రపంచ 25వ ర్యాంకర్ హరికృష్ణ అన్నాడు. -
నయనతార-విఘ్నేష్ శివన్ పెళ్లి ఆహ్వాన వీడియో.. నెట్టింట వైరల్
ఎప్పటినుంచో చక్కర్లు కొడుతున్న నయనతార-విఘ్నేష్ శివన్ పెళ్లి పుకార్లు ఎట్టకేలకు నిజమయ్యాయి. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా నయనతార, సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా విఘ్నేష్ శివన్ గుర్తింపు పొందిన వీరిద్దరి వివాహంపై అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం (జూన్ 7) వారిద్దరు జూన్ 9న మహాబలిపురంలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు విఘ్నేశ్ అధికారికంగా ప్రకటించాడు. అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనుందని కూడా తెలిపాడు. తాజాగా ఈ నయన్-విఘ్నేష్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో నెట్టింట గింగిరాలు తిరుగుతోంది. ఈ యానిమేటేడ్ వీడియోలో వధువు, వరుడు తమిళ సాంప్రదాయ దుస్తులు ధరించి కలిసి నడుస్తున్నట్లుగా చూపించారు. ఇందులో నయనతార, విఘ్నేష్ తల్లిదండ్రుల పేర్లు, పెళ్లి తేది, జరిగే సమయం, వేదికను పొందుపర్చారు. ఇదిలా ఉంటే పెళ్లి జరిగే మహాబలిపురంలోని రిసార్ట్‌లో ఇప్పటికే భద్రత ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ వేడుకకు వచ్చే అతిథులందరూ ప్రత్యేక డ్రెస్ కోడ్‌లో హాజరుకానున్నట్లు తెలుస్తోంది. చదవండి: అయోమయంగా నయనతార.. నవ్వుతున్న పృథ్వీరాజ్ సుకుమారన్ View this post on Instagram A post shared by Hanoosh🧿❤Narin🧿 (@hanaz_worldmusic) -
Its Official: నయనతారతో పెళ్లిపై స్పందించిన విఘ్నేష్ శివన్..
Its Official: Vignesh Shivan About His Wedding With Nayanthara: సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా కీర్తి గడించింది నయనతార. ఆమె ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారన్న వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవల తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌కు కలిసిన నయన్-విఘ్నేష్ జంట వారి వివాహ ఆహ్వాన పత్రికను అందజేసిన విషయం తెలిసిందే. దీంతో వారి పెళ్లి ఖరారు అయిందని కన్ఫర్మ్ చేసుకుంది సినీ లోకం. కానీ వీరి ఇద్దరి నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన రాలేదు. తాజాగా వీరి వివాహంపై స్పందించాడు విఘ్నేష్ శివన్. 'నా ప్రేయసి నయనతారను పెళ్లిని చేసుకోబోతున్నాను. జూన్ 9 (గురువారం) నేను, నయనతార మహాబలిపురంలో పెళ్లి చేసుకోబోతున్నాం. మా ఇరువురి కుటుంబాలతో పాటు సన్నిహితులు, స్నేహితులు మాత్రమే మా వివాహానికి హాజరు కానున్నారు. నిజానికి ముందుగా తిరుపతిలో పెళ్లి చేసుకోవాలనుకున్నాం. చదవండి: అయోమయంగా నయనతార.. నవ్వుతున్న పృథ్వీరాజ్ సుకుమారన్ కానీ అక్కడ ప్రయాణపరంగా కొన్ని సమస్యలు ఉంటాయనిపించడంతో మా వివాహ వేదికను మహాబలిపురానికి మార్చాం. జూన్ 9న ఉదయం పెళ్లి జరుగుతుంది. వాటికి సంబంధించిన ఫొటోలను మధ్యాహ్నం షేర్ చేస్తాం. జూన్ 11న నేను, నయన్ మీ అందరినీ ప్రత్యేకంగా కలుస్తాం. ఇప్పుడు వృత్తిపరంగానే కాకుండా వ్యక్తిగతంగా కూడా మీ అందరి ఆశీర్వాదాలు ఉండాలని కోరుకుంటున్నాను.' అని తెలిపాడు విఘ్నేష్ శివన్. చదవండి: సీఎంను కలిసిన నయనతార.. ఫొటో వైరల్.. -
సీఎంను కలిసిన నయనతార.. పెళ్లిపై లవ్‌బర్డ్స్ క్లారిటీ
Nayanthara Vignesh Wedding: సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా కీర్తి గడించింది నయనతార. ఆమె ప్రముఖ డైరెక్టర్ విఘ్నేష్ శివన్‌తో వివాహ బంధంతో ఒక్కటి కానున్నారన్న వార్తలు హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే. దక్షిణాదిన వీరిద్దరి పెళ్లి హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈ పెళ్లి వార్తలు నిజమేనని ఈ జంట తాజాగా స్పష్టం చేసింది. శుక్రవారం (జూన్ 3) సాయంత్రం తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్‌ను కలిసిన ఈ లవ్ బర్డ్స్ తమ వెడ్డింగ్ ఇన్విటేషన్‌కు అందజేసింది. తమ వివాహానికి హాజరు కావల్సిందిగా కోరారు. వారిని అభినందించిన సీఎం స్టాలిన్ శుభాకాంక్షలు తెలిపారు. స్టాలిన్‌తో పాటు ఆయన కుమారుడు హీరో, ఎమ్మెల్యే ఉదయనిధి స్టాలిన్ కూడా ఉన్నాడు. దీనికి సంబంధించిన ఫొటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఏడేళ్లుగా ప్రేమలో ఉన్న నయనతార, విఘ్నేష్ శివన్‌ల నిశ్చితార్తం కుటుంబసభ్యుల సమక్షంలో గతేడాది జరిగింది. తాజాగా మహాబలిపురంలోని మహబ్ హోటల్లో జూన్ 9న వీరి పెళ్లి వేడుక జరగనుంది. ఈ వివాహానికి బంధువులు, సన్నిహితులు మాత్రమే హాజరు కానున్నట్లు సమాచారం. ఇప్పటికే కొందరు గెస్ట్‌లకు 'డిజిటల్ వీడియో ఇన్విటేషన్ కార్డ్' పంపించినట్లు తెలుస్తోంది. కాగా వీరి పెళ్లి తిరుమలలో జరగుతుందని అంతా అనుకున్నారు. కానీ చివరి నిమిషంలో మహాబలిపురంలోని మహబ్ హోటల్లో హిందూ సాంప్రదాయాల ప్రకారం నయన్, విఘ్నేష్ వివాహం జరగనుంది. అయితే ఇదే వేదికపై జూన్ 8న సాయంత్రం సౌత్ ఇండియా సినీ పరిశ్రమలోని ప్రముఖులు, రాజకీయవేత్తల మధ్య రిసెప్షన్ గ్రాండ్‌గా నిర్వహించనున్నట్లు సమాచారం. ఈ రిసెప్షన్‌కు రజనీ కాంత్, కమల్ హాసన్, విజయ్, అజిత్, సూర్య, కార్తీ, శివకార్తికేయన్, విజయ్ సేతుపతికి ఆహ్వానం అందినట్లు టాక్. చదవండి: కాస్ట్లీ గిఫ్ట్‌తో సమంతను సర్ప్రైజ్ చేసిన నయనతార -
మహాబలిపురంలో విశాఖ యువకుడి మృతి
సాక్షి, పెదగంట్యాడ (గాజువాక): గాంధీనగర్‌కు చెందిన ఓ విద్యార్థి చెన్నై సమీపంలోని మహాబలిపురం బీచ్‌లో మంగళవారం మృతి చెందాడు. మృతుని బంధువులు, స్నేహితులు తెలిపిన వివరాల ప్రకారం.. జీవీఎంసీ 76వ వార్డు పరిధిలోని గాంధీనగర్‌లో కాతా బాలకృష్ణ, వెంకటలక్ష్మి పద్మ దంపతులు నివాసం ఉంటున్నారు. బాలకృష్ణ ‘వర్షు’ ఆక్వా ప్రింట్స్ పేరిట ప్రింటింగ్ వ్యాపారం నిర్వహిస్తున్నారు. ఈ దంపతులకు ఒకే ఒక్క కుమారుడు కాతా వర్షు (18) చెన్నైలోని ఓ కళాశాలలో బీటెక్ ప్రథమ సంవత్సరం చదవుతున్నాడు. చెన్నై నుంచి స్నేహితులతో కలసి మహాబలిపురం బీచ్‌కు వెళ్లాడు. అక్కడ బీచ్‌లో దిగిన తర్వాత కెరటాల ఉధృతికి కొట్టుకుపోయాడు. గల్లంతైన వర్షు కోసం అక్కడి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. చివరకు ఆ విద్యార్థి మృతదేహాన్ని కనుగొన్నారు. వెంటనే అతని తల్లిదండ్రులకు సమాచారం అందించారు. దీంతో తల్లిదండ్రులు, బంధువులు, స్నేహితులు గుండెలవిసేలా రోదించారు. మూడు రోజుల క్రితం చెన్నైకు దగ్గరుండి దించి వచ్చిన తల్లి వెంకట లక్ష్మి .. కుమారుడి మృతి వార్త విని కుప్పకూలిపోయింది. తల్లిదండ్రులు, బంధువుల మహాబలిపురానికి బయలుదేరి వెళ్లారు. మృతదేహాన్ని బుధవారం ఇక్కడకు తీసుకురానున్నారు. చదవండి: (సచివాలయంలో విషాదం.. రూ. 10 లక్షలు ఎక్స్‌గ్రేషియో ప్రకటించిన సీఎం స్టాలిన్) -
ఆ కుర్చీలు ఎవరికి!?
సాక్షి ప్రతినిధి, చెన్నై: అనధికార భేటీ సందర్భంగా శుక్రవారం మహాబలిపురంలో పాండవ రథాల ప్రాంగణంలో ప్రధాని నరేంద్రమోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కూర్చుని కొబ్బరి బోండాలు తాగుతూ సేద తీరిన విషయం గుర్తుంది కదా! వారిద్దరూ కూర్చున్న ఆ కుర్చీలకు ఇప్పుడు భారీ డిమాండ్ వచ్చింది. ఆ ఇరువురు దేశాధినేతలు అక్కడ కాసేపు కూర్చోవాలనేది అకస్మాత్తుగా, ఆ కార్యక్రమానికి రెండు గంటల ముందు తీసుకున్న నిర్ణయం. దాంతో అప్పటికప్పుడు రాష్ట్ర ప్రజా పనుల శాఖ అధికారులు గిండిలోని ఫర్నిచర్ షోరూం వారిని సంప్రదించి ఇద్దరు అగ్రనేతలు వసతిగా కూర్చునేందుకు రెండు టేకు కుర్చీలు, ఒక టీపాయ్, అనువాదకులు కూర్చునేందుకు మరో రెండు కుర్చీలను హుటాహుటిన తెప్పించారు. వాటికి డబ్బులను కూడా తరువాత ఇస్తామని ఆ షోరూం ఓనర్‌కు చెప్పారు. ఇప్పుడు అగ్రనేతలు కూర్చున్న ఆ రెండు కుర్చీల కోసం రాష్ట్ర ప్రజా పనుల శాఖ, కేంద్ర ప్రభుత్వ అధికారులు పోటీ పడుతున్నారు. అగ్రనేతల పర్యటనకు గుర్తుగా వాటిని తమ వద్దే ఉంచుకోవాలని ప్రజాపనుల శాఖ భావిస్తుండ గా, చరిత్రాత్మక భేటీ స్కృతిచిహ్నంగా ఆ ఫర్నిచర్‌ను తమకు అప్పగించాలని కేంద్ర ప్రభుత్వ అధికారులు కోరుతున్నారు. మరోవైపు, ‘ఆ ఫర్నిచర్‌కు డబ్బులు వద్దు.. నాకే తిరిగివ్వండి.. నా దగ్గరే గుర్తుగా పెట్టుకుంటా’ అని ఫర్నిచర్ షోరూం ఓనర్ కోరుతున్నారట. -
నవశకం
-
‘చెన్నై కనెక్ట్’
సాక్షి ప్రతినిధి, చెన్నై/మామల్లపురం: విభేదాలను సామరస్యపూర్వకంగా పరిష్కరించుకుంటూ సహకారంలో నూతన అధ్యాయం ప్రారంభించాలని భారత్, చైనాలు నిర్ణయించాయి. భారత్, చైనా సంబంధాల్లో ‘చెన్నై కనెక్ట్’ కొత్త ఊపునిస్తుందని ప్రధాని మోదీ అభివర్ణించారు. మామల్లపురంలో ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ల మధ్య ముఖాముఖి రెండోరోజు కొనసాగింది. ద్వైపాక్షిక చర్చలకు వేదికైన మహాబలిపురం సమీపంలోని కోవలం బీచ్ తాజ్ ఫిషర్మన్ కోవ్ రిసార్టుకు ఉదయం 9.30 గంటలకు చేరుకున్న జిన్‌పింగ్‌కు మోదీ స్వాగతం పలికారు. అనంతరం ఇద్దరు నేతలూ గోల్ఫకార్ట్లో తిరిగారు. బీచ్‌లో నడిచారు. అక్కడి ప్రాంగణంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన అద్దాల గదిలో ఇద్దరు నేతలు ఏకాంతంగా 90 నిమిషాలసేపు చర్చలు జరిపారు. అనువాదకులు ఆ సమయంలో వారితో ఉన్నారు. తర్వాత భారత విదేశాంగ మంత్రి జైశంకర్, చైనా విదేశాంగ కార్యదర్శి వాంగ్యూ సహా ఇరుదేశాలకు చెందిన 8 మంది అధికారులతో కలిసి మోదీ, జిన్‌పింగ్ సమావేశమయ్యారు. రెండు రోజుల్లోనూ సుమారు 7 గంటలపాటు జరిపిన ముఖాముఖిలో రెండు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడుల పెంపునకు ఉన్నతస్థాయి యంత్రాంగం ఏర్పాటు వంటి కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీంతోపాటు ప్రతిపాదిత ప్రాంతీయ సమగ్ర ఆర్థిక భాగస్వామ్యం (ఆర్సీఈపీ)పై జరుగుతున్న చర్చల్లో భారత్ అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకునేందుకు, భద్రతలో సహకారం, సరిహద్దుల్లో శాంతికి మరిన్ని చర్యలు తీసుకునేందుకు చైనా హామీ ఇచ్చింది. మూడో భేటీకి చైనా రావాలన్న జిన్‌పింగ్ ఆహ్వానాన్ని ఈ సందర్భంగా మోదీ అంగీకరించారు. ఇద్దరు నేతలు ఏమన్నారంటే.. ‘వూహాన్ సమ్మేళనంతో ప్రారంభమైన రెండు దేశాల మధ్య సంబంధాల్లో ‘చెన్నై కనెక్ట్’తో కొత్త ఊపు వచ్చింది. చైనా అధ్యక్షుని రాకతో మహాబలిపురం గ్రేట్ వే ఆఫ్ ఫ్రెండ్షిప్గా చరిత్రపుటల్లో నిలిచిపోయింది’ అని మోదీ అన్నారు. ప్రధాని మోదీ, నేను మంచి స్నేహితులం. ఈ రెండు రోజుల్లో ఇద్దరం మనసువిప్పి మాట్లాడుకున్నాం’ అని చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అన్నారు. తమిళనాడులో తాను పొందిన ఆతిథ్యాన్ని ఎన్నటికీ మరువజాలనని జిన్‌పింగ్ అన్నారు. డ్రాగన్, ఏనుగు నాట్యం కేవలం చైనా, భారత్‌ల విషయంలోనే సాధ్యమని జిన్‌పింగ్ పేర్కొన్నారు. ‘రెండుదేశాల మధ్య విభేదాలు దైపాక్షిక సహకారంపై ప్రభావం చూపజాలవు. ఏనుగు, డ్రాగన్ నాట్యం చేయడం భారత్, చైనాల విషయంలో మాత్రమే నప్పుతాయి. రెండు దేశాల కీలక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని, ఏళ్లుగా నానుతున్న సమస్యలను విభేదాలను జాగ్రత్తగా పరిష్కరించుకోవాలి’ అని అన్నారు. ప్రస్తావనకు రాని కశ్మీర్ భేటీ అనంతరం విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే మీడియాతో మాట్లాడారు. ‘సరిహద్దుల్లో తరచూ తలెత్తే వివాదాలను పరిష్కరించుకునేందుకు, శాంతిని నెలకొల్పేందుకు పరస్పరం విశ్వాసం పాదుకొల్పే మరిన్ని చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు. వాణిజ్యంలో సమతూకం సాధించేందుకు, వాణిజ్య, వ్యాపార సంబంధాలను విస్తృతం చేసుకునేందుకు ప్రత్యేకంగా ఉన్నత స్థాయి యంత్రాంగాన్ని ఏర్పాటు చేయాలని, తయారీ రంగం భాగస్వామ్యం, పెట్టుబడుల పెంపుపై ఏకాభిప్రాయానికి వచ్చారు. ఈ చర్చలకు చైనా ఉప ప్రధాని హు చిన్హువా, భారత్ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వం వహిస్తారని తెలిపారు’ అని ఆయన తెలిపారు. ఇద్దరు నేతల మధ్య కశ్మీర్ అంశం చర్చకు రాలేదని, ఆ ప్రస్తావనే లేదని తెలిపారు. భారత్, చైనా దౌత్య సంబంధాలకు వచ్చే ఏడాది 70 ఏళ్లు నిండుతున్న సందర్భంగా రెండు దేశాల మధ్య సాంస్కృతిక, ప్రజా సంబంధాలను మరింత విస్తృతం చేసుకునేందుకు జిన్‌పింగ్ అంగీకరించారని చైనా అధికార వార్తా సంస్థ జిన్హువా తెలిపింది. ఇలా ఉండగా, జిన్‌పింగ్ పర్యటనను పురస్కరించుకుని చైనా పర్యాటకుల కోసం ప్రత్యేకంగా ఐదేళ్ల ఈ వీసా సౌకర్యం కల్పిస్తున్నట్లు బీజింగ్‌లోని భారత రాయబార కార్యాలయం ప్రకటించింది. మధ్యాహ్నం 12.55 గంటలకు జిన్‌పింగ్ కోవలం బీచ్ హోటల్ నుంచి చెన్నై విమానాశ్రయానికి చేరుకుని ప్రత్యేక విమానంలో నేపాల్ వెళ్లిపోయారు. బీచ్‌లో మోదీ ప్లాగింగ్ చెత్తా చెదారాన్ని ఎత్తివేసి ప్రజల్లో స్ఫూర్తిని నింపిన ప్రధాని మహాబలిపురం సముద్ర తీరంలో మోదీ అరగంట సేపు స్వచ్ఛభారత్ నిర్వహించారు. అక్కడ పరిసరాలు చెత్తా చెదారంతో నిండిపోవడంతో ఆయన వాటన్నింటిని ఎత్తేశారు. స్వచ్ఛభారత్ అభియాన్, ఫిట్ ఇండియా ఉద్యమం స్ఫూర్తిని ఏకకాలంలో ప్రజల్లో రగిల్చేలా చేశారు. నల్లని రంగు కుర్తా, పైజామా ధరించిన ప్రధాని మోదీ ఒక పెద్ద ప్లాస్టిక్ బ్యాగ్‌ని పట్టుకొని ఇసుక తిన్నెల్లో నడుస్తూ తాగి పారేసిన ప్లాస్టిక్ బాటిల్స్, క్యారీ బ్యాగ్స్ , స్ట్రాలు ఇతర చెత్తలన్నీ ఏరారు. బీచ్‌లో చెత్తను తీసి బ్యాగ్‌లో వేస్తూ.. ఇలా చేయడం వల్ల వంటికి వ్యాయామానికి వ్యాయామం జరుగుతుంది. పరిసరాలు శుభ్రానికి శుభ్రం అవుతాయి. దీనికి సంబంధించిన మూడు నిమిషాల వీడియోను ప్రధాని తన ట్విట్టర్ అకౌంట్లో పోస్టు చేశారు. ‘‘మహాబలిపురం తీరంలో ప్లాగింగ్ చేశాను. దాదాపుగా 30 నిమిషాల సేపు చెత్తలన్నీ ఏరి దానిని హోటల్ యజమాని జయరాజ్‌కు అందజేశాను. ప్రజలందరూ బహిరంగ ప్రదేశాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. అదే సమయంలో ఫిట్‌గా, ఆరోగ్యంగా ఉండాలి’’అని ప్రధాని ట్వీట్ చేశారు. అంతకు ముందు సముద్రం నీళ్లలో తడుస్తూ, అక్కడి సూర్యోదయం అందాలను వీక్షిస్తూ ప్రధాని చాలా సేపు బీచ్‌లో గడిపి సేద తీరారు. రోడ్లపై జాగింగ్ చేస్తూ చెత్తా చెదారాన్ని ఎత్తేపారేసే ప్రక్రియని ప్లాగింగ్ అని పిలుస్తారు. జిన్‌పింగ్ ముఖచిత్రంతో చేనేత పట్టు శాలువా చైనా అధినేతకు మోదీ అపూర్వ కానుక భారత్‌కు రెండు రోజుల పర్యటన కోసం వచ్చిన చైనా అ«ధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అపురూపమైన కానుకని బహూకరించారు. చేతితో తయారు చేసిన ఎర్ర రంగులో ఉన్న ఈ శాలువాపై జిన్‌పింగ్ ముఖ చిత్రాన్ని డిజైన్‌గా వేయించారు. బంగారు రంగు అంచుల జరీతో మెరిసిపోతున్న ఈ శాలువా ఎన్నో ప్రత్యేకతలు కలిగి ఉంది. తమిళనాడులో కోయంబత్తూరు జిల్లాలోని సిరుముగైపుడూర్కి చెందిన శ్రీ రామలింగ సౌదాంబిగై చేనేత సహకార సంఘం మల్బరీ పట్టుతో ఎర్ర శాలువాని తయారు చేసింది. ఎరుపు రంగు ఎంచుకోవడానికి ఓ కారణం ఉంది. తన ఫొటో ఉన్న జ్ఞాపికను జిన్‌పింగ్ నుంచి స్వీకరిస్తున్న మోదీ చైనా జాతీయ జెండా రంగు, అధికార పార్టీ జెండా రంగు ఎరుపే. అంతేకాదు చైనా సంస్కృతిలో ఎరుపు రంగుని శుభసూచికంగా పరిగణిస్తారు. ఈ రంగుతో అదృష్టం కలిసివస్తుందని, జీవితం ఆనందోత్సాహాల్లో నిండిపోతుందని వారి నమ్మకం. ఈ శాలువాపై జిన్‌పింగ్ ముఖ చిత్రాన్ని డిజైన్‌గా వేయడానికి ఎలక్ట్రానిక్ ఫ్యాబ్రిక్‌ని వినియోగించారు. ఆ తర్వాత దానిపై బంగారు రంగు దారాలతో అల్లారు. చేతి వృత్తుల పరిశ్రమ, చేనేత కళలకు తమిళనాడు పెట్టింది పేరు. దశాబ్దాలుగా ఎందరో చేనేత కార్మికులు చేతితో తయారు చేసే వస్త్రాలతో అద్భుతాలు సృష్టించారు. కంచి, ఆరణి, మదురై, కోయంబత్తూరు వంటివి పట్టు వస్త్రాల ప్రపంచంలో తమకంటూ ఒక గుర్తింపుని సాధించాయి. మామల్లపురం బీచ్‌లో సేదతీరుతున్న మోదీ -
జిన్‌పింగ్‌కు బహుమతులు ఇవ్వనున్న మోదీ
మామల్లాపురం : ప్రధాని నరేంద్ర మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు విలువైన బహుమతులు ఇవ్వనున్నారు. తమిళనాడులోని మహాబలిపురం వేదికగా వీరి బేటీ అనధికారికంగా జరగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో జిన్‌పింగ్‌కు ప్రధాని మోదీ భారతీయ సంప్రదాయం ఉట్టిపడే కళాకండాలను బహుమతిగా ఇవ్వనున్నారు. ఆరుగడుల ఎత్తుండే దీపపు స్తంబాలు, మూడడగుల ఎత్తుండే తంజావూరు పెయింటింగ్‌లను కానుకగా అందజేస్తారని అధికారిక వర్గాలు వెల్లడించాయి. ఈ బహుమతులు తమిళనాడు హస్తకళ నైపుణ్యం ఉట్టిపడే విధంగా ఉండనున్నాయి. బంగారం పూత పూసిన ఇత్తడి దీపపు స్తంబాలు ఆరుగడుల ఎత్తు, 108 కేజీల బరువు ఉంటాయి. వీటిని తయారు చేయడానికి 12 రోజులు పట్టింది. కలపతో తయారు చేసిన మూడు అడుగుల ఎత్తున్న తంజావూరు పెయింటింగ్‌లో నాట్యం చేస్తున్న సరస్వతి దేవితో పాటు, సంగీతం ప్రాముఖ్యాన్ని తెలియజేసే పరికరాలను ఉంచారు. దీనిని తయారు చేయడానికి 45 రోజులు పట్టినట్లు తెలిసింది. -
బీచ్‌లో చెత్త ఎత్తిన ప్రధాని మోదీ
-
మాటల్లో కాదు చేతల్లో చూపించారు
చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను మాటలు మాత్రమే చెప్పే వ్యక్తిని కాదని నిరూపించుకున్నారు. ఎప్పుడు స్వచ్ఛత జపం చేసే ప్రధాని స్వయంగా శ్రామికుడిలా మారి చెత్తను ఎత్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య అనధికార భేటీ శుక్రవారం మహాబలిపురంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజు భేటీ ప్రారంభానికి ముందు మోదీ దేశ ప్రజలకు క్లీన్ అండ్ ఫిట్ సందేశాన్ని ఇచ్చారు. శనివారం ఉదయం మోదీ మహాబలిపురం బీచ్‌లో జాగింగ్ చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో ఓ సాధారణ వ్యక్తిలో సముద్రం తీరంలో అరగంటపాటు తిరిగిన మోదీ... అక్కడున్న చెత్తను స్వయంగా ఆయనే శుభ్రం చేశారు. బీచ్‌లో పడి ఉన్న ప్లాస్టిక్ కవర్లను, బాటిళ్లను ఆయన చెత్తో క్లీన్ చేశారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ట్విటర్లో పోస్ట్ చేస్తూ.. ‘మహాబలిపురం బీచ్‌లో అరగంట పాటు తిరిగాను. అక్కడ నేను సేకరించిన నా కలెక్షన్‌ను హోటల్ సిబ్బందిలో భాగమైన జయరాజ్‌కు అప్పగించాను. మన బహిరంగ ప్రదేశాలు శుభ్రంగా మరియు చక్కగా ఉండేలా చూద్దాం. మనం ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాం’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని ట్వీట్‌కు లక్షల్లో లైకులు వస్తున్నాయి. మీరు గ్రేట్ సార్.. కేవలం మాటలకే పరిమితం కారు.. చేతల్లో చూపిస్తారు అంటూ.. నెటిజన్లు ఆయనను ప్రశంసంలతో ముంచెత్తుతున్నారు. (చదవండి: తమిళ.. చైనా మీడియాలో) -
పల్లవించిన స్నేహగీతం
సాక్షి ప్రతినిధి, చెన్నై: బంగాళాఖాతం తీరంలో, ఏడవ శతాబ్దపు అద్భుత శిల్పకళా నిర్మాణాల నేపథ్యంలో మామల్లపురం(మహాబలిపురం)లో చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య రెండో అనధికార భేటీ శుక్రవారం సానుకూల వాతావరణం మధ్య ప్రారంభమైంది. చెన్నై నుంచి ప్రత్యేక వాహన శ్రేణిలో మామల్లపురం వచ్చిన జిన్‌పింగ్‌కు మోదీ సాదర స్వాగతం పలికారు. అనంతరం ఇరువురు నేతలు పల్లవ రాజులు నిర్మించిన అత్యద్భుత కట్టడాలను సందర్శించారు. సంప్రదాయ తమిళ వస్త్రధారణలో ఉన్న మోదీ.. జిన్‌పింగ్‌కు ప్రపంచ పురావస్తు నిర్మాణాలుగా యునెస్కో గుర్తింపు పొందిన ఆ శిల్పకళా సంపద చారిత్రక ప్రాధాన్యతను, పౌరాణిక ప్రాశస్త్యాన్ని, నిర్మాణ కౌశలాన్ని ఒక గైడ్ తరహాలో వివరించారు. అర్జునుడు తపస్సు చేసినట్లుగా భావిస్తున్న ప్రాంతంలో ఏకశిలపై నిర్మితమైన కట్టడాన్ని, పంచ రథ రాతి(పాండవ రథాలు) నిర్మాణాన్ని, శ్రీకృష్ణుడి వెన్నముద్ద బంతి(గుండ్రని పెద్దబండరాయి)ని సందర్శించారు. వీటి వివరాలను జిన్‌పింగ్ ఆసక్తిగా విన్నారు. పంచ రథ నిర్మాణ ప్రాంతంలో కొబ్బరి నీరు తాగి కాసేపు సేద తీరారు. ఆ సమయంలో అనువాదకుల సాయంతో ఇరువురు నేతలు ముచ్చటించుకున్నారు. అనంతరం సముద్ర తీరంలో నిర్మితమైన శివ విష్ణు రాతి దేవాలయాన్ని సందర్శించారు. సూర్యాస్తమయం వేళ అక్కడి ప్రకృతి దృశ్యాలను కాసేపు ఆస్వాదించారు. చైనా అధ్యక్షుడు, భారత ప్రధాని సందర్శన సందర్భంగా ఆ దేవాలయాన్ని దీపకాంతులతో ఆకట్టుకునేలా తీర్చిదిద్దారు. ఆ ఆలయ నేపథ్యంలో ఏర్పాటు చేసిన వేదికపై కళాక్షేత్ర ఫౌండేషన్ కళాకారుల బృందం ప్రదర్శించిన భరతనాట్యం, కథాకళి నృత్య ప్రదర్శనలను వీక్షించారు. ఇరువురు నేతలు పలు సందర్భాల్లో షేక్‌హ్యాండ్ ఇచ్చుకోవడం, నవ్వుతూ మాట్లాడుకోవడం కనిపించింది. అన్ని సందర్భాల్లోనూ ఇరువురి నేతల మధ్య నెలకొన్న స్నేహానుబంధం స్పష్టంగా కనిపించింది. నేడు(శనివారం) ఇరువురు నేతలు, రెండు దేశాల ప్రతినిధి బృందాల మధ్య కీలక చర్చలు జరగనున్నాయి. ఉగ్రవాదంపై పోరు, వాణిజ్యం, 3500 కి.మీల సరిహద్దు వెంబడి ఉన్న ఇరుదేశాల సైనిక సహకారం.. తదితర అంశాలు చర్చకు వచ్చే అవకాశముందని అధికార వర్గాలు వెల్లడించాయి. సాంస్కృతిక ప్రదర్శనలు ముగిసిన తరువాత, చైనా అధ్యక్షుడి గౌరవార్థం ఆలయ ప్రాంగణ ప్రాంతంలోనే మోదీ విందు ఏర్పాటు చేశారు. చెన్నైలో ఘన స్వాగతం అంతకుముందు, శుక్రవారం మధ్యాహ్నం చెన్నై విమానాశ్రయంలో తమిళనాడు గవర్నర్ భన్వరిలాల్, ముఖ్యమంత్రి పళనిసామి, ఉపముఖ్యమంత్రి పన్నీరు సెల్వం, చైనాలో భారత రాయబారి విక్రమ్ మిస్రీ తదితరులు జిన్‌పింగ్‌కు స్వాగతం పలికారు. జిన్‌పింగ్‌తో పాటు 90 మంది సభ్యులతో చైనా ప్రతినిధి బృందం కూడా చెన్నై చేరుకుంది. అదే సమయంలో ‘వెల్కమ్ ఇండియా.. ప్రెసిడెంట్ జిన్‌పింగ్’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. విమానాశ్రయంలో జిన్‌పింగ్‌కు స్వాగతం పలుకుతూ కళాకారులు తమిళ సంప్రదాయాన్ని ప్రతిబింబించే చిన్న సాంస్కృతిక ప్రదర్శన ఇచ్చారు. అనంతరం, చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్‌కు జిన్‌పింగ్ వెళ్లారు. అక్కడ కాసేపున్న తరువాత సాయంత్రం మహాబలిపురం బయల్దేరారు. జిన్‌పింగ్ కాన్వాయ్ సాగిన మార్గంలో దారిపొడవునా విద్యార్థులు, ప్రజలు భారత్, చైనా జాతీయ పతాకాలను ప్రదర్శిస్తూ స్వాగతం పలికారు. ప్రకటన ఉండొచ్చు గత సంవత్సరం చైనాలోని వుహాన్‌లో జరిగిన అనధికార భేటీ తరహాలోనే.. ఈ భేటీ అనంతరం ఇరుదేశాలు వేరువేరుగా ప్రకటనలు విడుదల చేస్తాయని అధికార వర్గాలు తెలిపాయి. శనివారం ఉదయం నుంచి దాదాపు ఆరు గంటల పాటు ఇరువురు నేతలు ముఖాముఖి, ప్రతినిధి స్థాయి చర్చలు జరుపుతారని పేర్కొన్నాయి. ‘భవిష్యత్తు ద్వైపాక్షిక సంబంధాలకు నూతన మార్గం చూపే పరస్పర ఆమోదిత మార్గదర్శకాలు ఈ భేటీ ద్వారా నిర్ణయమయ్యే అవకాశముంది’ అని భారత్‌లో చైనా రాయబారి సున్ వీడాంగ్ పేర్కొన్నారు. విందు సందర్భంగా చర్చలు విందు సందర్భంగా ప్రధాని మోదీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ పలు అంశాలపై చర్చలు జరిపారని విదేశాంగ శాఖ కార్యదర్శి విజయ్ గోఖలే తెలిపారు. ఇరువురు నేతలు వాణిజ్య లోటుపై చర్చించారని, ఇరుదేశాల మధ్య వాణిజ్య లోటును తగ్గించే దిశగా చర్యలు చేపట్టాలని నిర్ణయించారని గోఖలే వెల్లడించారు. ఉగ్రవాదం, తీవ్రవాదంపై ఇద్దరూ ఆందోళన వ్యక్తం చేశారని చెప్పారు. అన్ని అంశాలపై ప్రధాని మోదీతో కలసి పనిచేసేందుకు ఆసక్తిగా ఉన్నానని జిన్‌పింగ్ తెలిపారని గోఖలే పేర్కన్నారు. విందు సమయంలో ఇద్దరు నేతలు రెండున్నర గంటల పాటు మాట్లాడుకున్నారని, ద్వైపాక్షిక సంబంధాలను మరింత శక్తిమంతం చేసుకోవాలని, వివాదాస్పద అంశాల కన్నా సంబంధాల బలోపేతానికే ప్రాధాన్యత ఇవ్వాలని ఇరువురు నేతలు నిర్ణయించారని విదేశాంగ శాఖ వర్గాలు తెలిపాయి. అయతే, వారిమధ్య కశ్మీర్ అంశం ప్రస్తావనకు వచ్చినదా? లేదా? అన్న విషయం తెలియలేదు. ‘తొలిరోజు అనధికార సమావేశం ఫలప్రదంగా జరిగింది’ అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రవీశ్ ట్వీట్ చేశారు. జిన్‌పింగ్‌కు తమిళ రుచులు చెన్నైలోని ఐటీసీ గ్రాండ్ చోళ హోటల్లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు ఆయనకు ఇష్టమైన మాంసాహార వంటకాలతో పాటు సంప్రదాయ తమిళ వంటకాలను అందించారు. జిన్‌పింగ్‌కు ఇష్టమైన మాంసం, ఉల్లిగడ్డలతో ఓ కర్రీ.. క్యారెట్, క్యాబేజీ, లివర్లతో మరో కూర, నూడుల్స్, సూప్‌లను అందించారు. అవికాకుండా, అన్నం, బిర్యానీ, సాంబారు, టమాట రసం, చపాతీ, బటర నాన్, పులావ్, టమాటా–క్యారెట్ సూప్‌లను కూడా ఆ మెనూలో చేర్చారు. శనివారం ఉదయం బ్రేక్‌ఫాస్ట్‌లో ఇడ్లీ, దోశ, వడ, సాంబారు, చట్నీ, పొంగల్ తదితర తమిళ రుచులను ఆయనకు చూపనున్నారు. శుక్రవారం మధ్యాహ్నం జిన్‌పింగ్ కోసం మోదీ ఏర్పాటు చేసిన విందులోనూ తమిళ రుచులను ఏర్పాటు చేశారు. పప్పు, మసాలాలు, కొబ్బరి వేసి చేసిన తమిళ ప్రత్యేక సాంబారును జిన్‌పింగ్ కోసం ప్రత్యేకంగా తయారు చేశారు. టమాట రసం, కూర్మా, హల్వాలను మెనూలో చేర్చారు. జిన్‌పింగ్‌కు ఇష్టమైన మాంసాహార వంటకాలనూ అందించారు. తమిళ వస్త్రధారణలో మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మామల్లపురం(మహాబలిపురం) పర్యటన సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సంప్రదాయ వస్త్రధారణలో కనిపించారు. పొట్టి చేతుల తెలుపు రంగు చొక్కా, దానిపై అంగవస్త్రం, ఆకుపచ్చ బోర్డరున్న సంప్రదాయ తమిళ లుంగీని ధరించారు. జిన్‌పింగ్ వైట్ షర్ట్‌ను డార్క్ కలర్ ప్యాంట్‌లోకి ఇన్ చేసుకుని సింపుల్‌గా కనిపించారు. మహాబలిపురంలోని సముద్ర తీరంలోని రాతి దేవాలయం, పంచ రథాలు, అర్జునుడు తపస్సు చేశాడని భావించే ప్రదేశంలోని 73 అడుగుల ఎత్తైన భారీ కళాత్మక నిర్మాణం.. తదితరాలను వారు సందర్శించారు. ఆ సందర్భంగా ఆ ప్రాంత ప్రాముఖ్యతను, ఆ దేవాలయ చరిత్రను, నిర్మాణ విశిష్టతను జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు. అనంతరం వారిరువురు కొబ్బరి బోండాలను సేవించి సేదతీరారు. తమిళ సంప్రదాయ వస్త్రాలను మోదీ ధరించడంపై పలు తమిళ పార్టీలు హర్షం వ్యక్తం చేశాయి. ‘తమిళ సంప్రదాయాన్ని ప్రధాని ప్రపంచానికి చూపారు’ అని పట్టలి మక్కల్ కచ్చి వ్యవస్థాపకుడు ఎస్ రామ్‌దాస్ ట్వీట్ చేశారు. ‘ఏ ప్రాంతానికి వెళ్తే, ఆ ప్రాంత సంప్రదాయాలను గౌరవించడం ప్రధాని మోదీకి బాగా తెలుసు. తమిళ పంచెకట్టులో ఆయన సౌకర్యవంతంగా కనిపించారు’ అని తమిళనాడు మంత్రి సీటీ రవి వ్యాఖ్యానించారు. జిన్‌పింగ్‌కు ఆలయ గొప్పదనాన్ని వివరిస్తున్న మోదీ మామల్లపురంలో సముద్ర తీరంలో వారసత్వ కట్టడం -
ప్రధాని మోదీతో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్
-
జిన్‌పింగ్‌తో భేటీ : సంప్రదాయ వస్త్రధారణలో మోదీ
-
జిన్‌పింగ్‌తో భేటీ : పంచెకట్టులో మోదీ
చెన్నై : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో భేటీ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ తమిళ సంప్రదాయ వస్త్రధారణతో ఆకట్టుకున్నారు. మోదీ క్రీమ్ కలర్ పంచెపై తెల్లటి షర్ట్‌ను ధరించారు. జిన్‌పింగ్ విడిది చేసిన మహాబలిపురంలో చైనా అధ్యక్షుడితో కలిసి మోదీ చారిత్రక కట్టడాలను సందర్శించారు. శోర్ ఆలయ ప్రాంగణాన్ని ఇరువురు నేతలు చుట్టివచ్చారు. వెయ్యేళ్ల ఆలయ చరిత్రను, చారిత్రక కట్టడాలను ఈ సందర్భంగా జిన్‌పింగ్‌కు మోదీ వివరించారు. మోదీ జిన్‌పింగ్‌లు ఆలయ ప్రాంగణంలో భేటీ అయ్యారు. కొబ్బరి నీరు సేవిస్తూ వారు కొద్దిసేపు సేదతీరారు. అంతకుముందు మహాబలిపురంలో అర్జునుడు తపస్సు చేసిన ప్రాంతం, పంచరథాలు కొలువుతీరిన ప్రదేశాలను వారు సందర్శించారు. ఆలయ ప్రాంగణంలో జరిగిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. ఇక మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య శనివారం ఫిషర్మెన్ కోవ్ రిసార్ట్స్‌లో ద్వైపాక్షిక చర్చలు జరుగుతాయి. చర్చల అనంతరం ప్రధాని మోదీ చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ గౌరవార్ధం లంచ్ ఏర్పాటు చేస్తారు. విందులో దక్షిణాది రుచులు.. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌కు శుక్రవారం రాత్రి ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చే విందులో దక్షిణాదిలో పేరొందిన ప్రముఖ తమిళ వంటకాలు ఏర్పాటు చేస్తున్నారు. రసం, సాంబార్, కడై కుర్మా, కవనరసి హల్వాతో పాటు చెట్టినాడ్ నుంచి కరైకుడి వరకూ అన్ని ప్రాంతాల రుచులనూ మెనూలో చేర్చారు. -
చెన్నైకి చేరుకున్న జిన్‌పింగ్
-
చెన్నైకి చేరుకున్న జిన్‌పింగ్
చెన్నై : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కొద్దిసేపటి క్రితం చెన్నై అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామిలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చూసిన పలు సాంస్కృతిక ప్రదర్శనలను ఆసక్తిగా తిలకిస్తూ జిన్‌పింగ్ ముందుకు సాగారు. జిన్‌పింగ్ ఎయిర్పోర్ట్ నుంచి నేరుగా ఐటీసీ చోళ హోటల్‌కు వెళ్లనున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన మహాబలిపురం బయలుదేరుతారు. నేడు, రేపు రెండు రోజులపాటు చెన్నై సమీపంలోని మహాబలిపురం వేదికగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరపనున్నారు. ఇది మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక సమావేశం. ఇప్పటికే ప్రధాని నరేంద్ర మోదీ మహాబలిపురం చేరుకున్నారు. పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ ఆలోచనలు పంచుకునేందు ఈ సమావేశాలు వీలు కల్పిస్తాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది. జిన్‌పింగ్ పర్యటన నేపథ్యంలో ప్రభుత్వం భారీగా భద్రత ఏర్పాట్లు చేసింది. -
మహాబలిపురంలో మహాభేటీ
-
చెన్నైవాసులకు చుక్కలు చూపించిన ‘సూపర్‌కార్’
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇటీవలి వరకు అది మహాబలిపురం. కానీ ప్రస్తుతం మహా‘బందోబస్తు’పురంగా మారిపోయింది. మరో రెండురోజులపాటు ఇదే పరిస్థితి కొనసాగుతుంది. ప్రధాని మోదీ, చైనా అధ్యక్షులు జి. జిన్‌పింగ్ ఈనెల 11, 12 తేదీల్లో ప్రపంచ ప్రసిద్ధి పర్యాటక కేంద్రమైన మహాబలిపురంలో పర్యటించడమే ఇందుకు కారణం.ఇందులో భాగంగా భారత్–చైనా దేశాల మధ్య రెండో శిఖరాగ్ర సమావేశానికి తమిళనాడులోని మహాబలిపురం ముస్తాబైంది.ప్రధాని నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు చైనా అధ్యక్షులు జి.జిన్‌పింగ్ నేడు మధ్యాహ్నం 1.30 గంటలకు చెన్నై విమానాశ్రయానికి చేరుకుంటారు. చెన్నై గిండిలోని ఐటీసీ గ్రాండ్చోళాలో జిన్‌పింగ్, కోవలం బీచ్ సమీపంలోని తాజ్ హోటల్లో ప్రధాని మోదీ బసచేస్తారు. శుక్రవారం సాయంత్రం 4 గంటలకు చెన్నైకి సుమారు 50 కిలోమీటర్ల దూరంలోని మహాబలిపురం సముద్రతీర ఆలయంలో ఇరువురు అగ్రనేతలు భేటీ కానున్నారు. దేశాల మధ్య వర్తక, వాణిజ్యపరమైన చారిత్రాత్మక ఒప్పందాలపై సంతకాలు జరుగుతాయని తెలుస్తోంది. 12వ తేదీన ఇరువురు నేతలు మరోసారి సమావేశం అవుతారు. జిన్‌పింగ్ కోసం సూపర్‌కార్ చైనా దేశాధ్యక్షుని రెండురోజుల పర్యటన నిమిత్తం ఆదేశ జాతీయపతాకాన్ని అమర్చిన రష్యాలో తయారైన హాంగీ అనే బుల్లెట్ర్ పూఫ్కారు చెన్నైకి చేరుకుంది. సుమారు 18 అడుగుల పొడవు, 6.5 అడుగుల వెడల్పు, 5 అడుగుల ఎత్తుతో 3,152 కిలోల బరువుంటుంది. కళ్లు మిరుమిట్లుగొలిపే కారు చైనా నుంచి చెన్నైకి చేరుకోగా, ఈ కారు ప్రజలను విశేషంగా ఆకర్షిస్తోంది. కేవలం 10 సెకండ్లలో 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకునేలా ఈ కారు తయారైంది. చైనా అధ్యక్షుడు రాక సందర్భంగా నగరంలో మాక్‌డ్రిల్, కాన్వాయ్ వాహనాల ట్రయల్ రన్ గురువారం నిర్వహించారు. ట్రయల్ రన్ కోసం నగరంలో వాహనాలను నిలిపివేయడంతో ప్రజలు అష్టకష్టాలు పడ్డారు. శుక్రవారం నుంచి రెండు రోజుల పాటు నగరంలో పలు చోట్ల వాహనాల రాకపోకల్లో మార్పులు చేశారు. చిన్నమలై – మీనంబాక్కం మధ్య మెట్రో రైలు సేవలను నిలిపివేయనున్నారు. అగ్రనేతల రాక సందర్భంగా 15వేల మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా మూడు సబ్మెరైన్లను సముద్రతీరంలో సిద్ధం చేశారు. చెన్నై గిండిలోని ఐటీసీ గ్రాండ్ చోళా హోటల్, మహాబలిపురం మధ్యలోని ఇంజినీరింగ్ కళాశాలలకు రెండు రోజులపాటు సెలవు ప్రకటించారు. భద్రతా ఏర్పాట్ల పర్యవేక్షణకు 9 మంది ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం నియమించింది.మహాబలిపురంలోని బుల్లెట్ర్çపూఫ్ ఆడిటోరియంలో ఇద్దరు అగ్రనేతలు భేటీ అయ్యే ఏర్పాట్లను చేశారు. వారిద్దరి భేటీ కోసం రెండు ఆడిటోరియంలను సిద్ధం చేశారు. సముద్రతీరంలో ఏడంచల భద్రతా ఏర్పాట్లను, 24 గం టలు నిఘాను పెట్టారు. మహాబలిపురం పరిసరాల్లోని 42 గ్రామాల్లో చేపలవేటను నిషేధించారు. చైనా అధ్యక్షుడు రాక సందర్భం గా రిమాండ్ ఖైదీలను కోర్టులో హాజరుపరచడంలో మినహాయింపు ఇవ్వాల్సిందిగా చెన్నై పోలీసు కమిషనర్ ఏకే విశ్వనాథన్ కోర్టుకు లేఖ రాశారు. మహాబలిపురంతో చైనా అనుబంధం తమిళనాడులో అందునా కాంచీపురం జిల్లా మహాబలిపురంలో ఇరుదేశాల అగ్రనేతలు భేటీ కావడం వెనుక ప్రత్యేక ప్రాధాన్యత ఉంది. రాజేంద్రచోళ మహారాజు చైనాతో వాణిజ్యం సాగించినప్పటి నుంచి భారతదేశంతో స్నేహసంబంధాలున్నాయి. భారత్‌కు చెందిన ప్రఖ్యాత బౌద్ధ్దగురువు చైనాకు వెళ్లి అక్కడ ప్రబలంగా వ్యాపించి ఉన్న ప్రాణాంతకమైన వ్యాధికి మందుకనుగొని ప్రజల ప్రాణాలను కాపాడడంతో ఇరుదేశాల మధ్య సఖ్యత నెలకొంది. భారత్ నుంచి వ్యాపించిన బౌద్ధ్దమతం చైనా సంస్కృతికి మారింది. అయితే 1949లో మా చే తుంగ్ కమ్ యూనిస్ట్ పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాతనే భారత్–చైనా దేశాల మధ్య సంబంధాలు ఏర్పడ్డాయని చరిత్రకారులు చెబుతున్నారు. కొత్త చైనా ప్రభుత్వాన్ని అంగీకరించిన వామపక్షేతర దేశాల్లో భారత్ ప్రథమంగా నిలిచింది. అయినా ఆనాటి నుంచే భారత్–చైనా దేశాల మధ్య సరిహద్దు సమస్య కొనసాగుతోంది. కశ్మీర్లో ఒక భాగమైన అగ్సై చిన్ చైనా కట్టుబాటులోనే ఉండగా, భారత్ హక్కు కోరుతోంది. అరుణాచల్‌ప్రదేశ్‌లోని తవాంగ్ అనే ప్రాంతాన్ని చైనా కోరుతోంది. ఇలా ఇరుదేశాల మధ్య లెక్కలేనన్ని సమస్యలున్నాయి. ఇలాంటి అనేక సమస్యల పరిష్కారానికి మహాబలిపురంలో జరిగే శిఖరాగ్ర సమావేశం బాటలు వేస్తుందని ఆశిస్తున్నారు. మోదీ – జిన్‌పింగ్ రాక ప్రాధాన్యత గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు బీజేపీ రాష్ట్ర శాఖ తరఫున కేంద్ర మాజీ మంత్రి పొన్ రాధాకృష్ణన్ ఒక ప్రచార వాహనాన్ని ప్రారంభించారు. చైనా అధ్యక్షుడు రాక పుణ్యమా అని నగరంలో పారిశుధ్యం మెరుగుపడిందని హైకోర్టు న్యాయమూర్తులు ఎస్.వైద్యనాధన్, సి.శరవణన్ వ్యాఖ్యానించారు. నగరం బాగుపడాలంటే అగ్రనేతలు రాక తప్పదా అంటూ వ్యాఖ్యానించారు. చెన్నై నగరానికి తరచూ ఇలాంటి నేతలు వస్తూ ఉంటే చెన్నై బాగుపడగలదని వారన్నారు. 63 ఏళ్ల తరువాత మహాబలిపురానికి మరోసారి.. చైనా అగ్రనేత 63 ఏళ్ల తరువాత మరోసారి మహాబలిపురానికి రావడం గమనార్హం. 1956, డిసెంబర్ 5వ తేదీ అప్పటి చైనా ప్రధాని సూఎన్లాయ్ రెండు రోజుల పర్యటన నిమిత్తం చెన్నై విమానాశ్రయానికి రాగా అప్పటి తమిళనాడు గవర్నర్ శ్రీప్రకాశ్, ముఖ్యమంత్రి కామరాజర్ ఆయనకు స్వాగతం పలికారు. చెన్నై కార్పొరేషన్ మైదానం, ప్రస్తుత నెహ్రూ స్టేడియంలో ఆయనకు స్వాగత సత్కారాలు జరిగాయి. జెమినీ స్టూడియో అధినేత ఎస్ఎస్ వాసన్ కొందరు పారిశ్రామిక వేత్తలతో కలిసి చైనా ప్రధానికి స్వాగతం పలుకగా, నటి పద్మిని నృత్యప్రదర్శన జరిగింది. ఆ తరువాత పెరంబూరులో ఐసీఎఫ్ ప్రాంతాలను సందర్శించారు. తర్వాత రోజు ప్రస్తుత ఈసీఆర్ అని చెప్పబడే ఈస్ట్‌కోస్ట్ రోడ్డు మార్గంలో మహాబలిపురానికి వెళ్లి అక్కడి పల్లవులనాటి శిల్ప సంపదలను సందర్శించి ఆశ్చర్యానుభూతికిలోనైనారు. దాదాపు 63 ఏళ్ల తర్వాత మరలా చైనా అధ్యక్షుడు మహాబలిపురాన్ని సందర్శించడం విశేషం. మహాబలిపురానికే ఎందుకంటే... సహజంగా విదేశీయులు భారతదేశానికి వస్తే ఢిల్లీకి పరిమితమై ప్రధాని, రాష్ట్రపతి, విదేశాంగ మంత్రులను కలవడం సహజంగా వస్తోంది. అయితే, మోదీ ప్రధాన మంత్రి అయిన తర్వాత విదేశీ అతిథుల విషయంలో కొత్త విధానాన్ని ప్రవేశపెట్టారు. దేశ రాజధాని కంటే పలు రాష్ట్రాల్లో కార్యక్రమాలు ఏర్పాటు చేయడం ద్వారా అక్కడి సంస్కృతి, సంప్రదాయాలను విదేశీయులు తెలుసుకునే అవకాశం కలుగుతుందని ఆయన ఆలోచించారు. విదేశీ నేతలకు కూడా ఈ మార్పు ఎంతో ఆకర్షణీయంగా మారింది. ముఖ్యంగా విదేశీ ప్రతినిధుల రాకతో ఆయా రాష్ట్రాలు శోభాయమానంగా మారడం కలిసొచ్చే అంశమైంది. మోదీ ప్రధానిగా ఎంపికైన తరువాత జర్మనీ ప్రధానమంత్రి ఏంజలా మెర్కల్‌ను 2015 అక్టోబర్‌లో ఇండియాకు వచ్చినప్పుడు బెంగళూరులో భేటీ అయ్యారు. 2017 జులైలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఇండియాకు వచ్చినప్పుడు అహ్మదాబాద్‌లో సమావేశమయ్యారు. అదే ఏడాది సెప్టెంబర్‌లో జపాన్ ప్రధాని షింజో అబే భారత్‌కు వచ్చినప్పుడు అహ్మదాబాద్‌లోనే భేటీ అయ్యారు. 2018, మార్చిలో ఫ్రాన్స్ దేశ అధినేత మెక్రాన్ భారత్‌కు వచ్చినప్పుడు వారణాశిలో సమావేశమయ్యారు. మోదీ – జిన్‌పింగ్ తొలిసారిగా శిఖరాగ్ర సమావేశం చైనాలోని ఊగన్ నగర్లో గత ఏడాది ఏప్రిల్ 27, 28 తేదీల్లో భేటీ అయ్యారు. చైనా – భారత్ మధ్య శిఖరాగ్ర సమావేశానికి ప్రధాని మోదీ ప్రాతినిథ్యం వహిస్తున్న వారణాశిని తొలుత ఎంపిక చేశారు. అయితే, అక్కడి విమానాశ్రయం సౌకర్యవంతం కానందున చెన్నైని ఎన్నుకున్నారు. అంతేకాక, మహాబలిపురానికి చైనాకు మధ్య అనాథిగా చారిత్రాత్మక సంబంధాలు ఉన్నందున ఇది వేదికగా మారింది. ఈ కోవలో ప్రస్తుతం చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో మోదీ రెండవ సారి సమావేశాన్ని మహాబలిపురంలో ఏర్పాటుకున్నారు. మహాబలిపురంలో ఇద్దరు అగ్రనేతలు సమావేశం కావడం సంతోషదాయకమైనా తమిళనాడులో అనేక అభివృద్ధి చెందిన జిల్లాలు ఉన్న తరుణంలో కాంచీపురం జిల్లా పరిధిలోని మహాబలిపురాన్నే ఎంచుకోవడం గమనార్హం. మహాబలిపురానికి ఉన్న చారిత్రాత్మక ప్రతిష్ట సాంస్కృతిక ప్రతిష్ట ఉండడమే ఇందుకు ప్రధాన కారణం. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన పర్యాటక ప్రాంతాలలో మహాబలిపురం కూడా ఒకటిగా 1984లోనే చేరింది. ఇన్ని ప్రత్యేకతలు కూడి ఉన్నందునే ఇద్దరు అగ్రనేతల చర్చలకు మహాబలిపురం వేదికైంది. భారత్ – చైనా శిఖరాగ్ర సమావేశాల కారణంగా తమిళనాడు ప్రతిష్ఠ ప్రపంచ స్థాయికి ఎదిగిందని ముఖ్యమంత్రి ఎడపాడి పళనిస్వామి పేర్కొన్నారు. మోదీ – జిన్ పింగ్లకు ప్రజలను ఘనస్వాగతం పలకాలని ఆయన విజ్ఞప్తి చేశారు. -
సంయుక్త ప్రకటనలు, ఒప్పందాలు ఉండవ్
న్యూఢిల్లీ/సాక్షి ప్రతినిధి, చెన్నై: చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్రమోదీల మధ్య సమావేశానికి సన్నాహాలు పూర్తయ్యాయి. అక్టోబరు 11, 12వ తేదీల్లో చెన్నై సమీపంలోని మహాబలిపురం వేదికగా ఇరుదేశాల నేతల సమావేశం జరుగుతుందని భారత్, చైనా విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖలు ప్రకటించాయి. పలు ద్వైపాక్షిక, ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై ఇరువురు నేతలు తమ ఆలోచనలను పంచుకునేందుకు ఈ సమావేశాలు వీలు కల్పిస్తాయని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇది జిన్‌పింగ్‌ది అనధికార పర్యటన కావడంతో ఎలాంటి ద్వైపాక్షిక ఒప్పందాలు, సంయుక్త ప్రకటనలు, పత్రికా ప్రకటనలు ఉండవు. కేవలం ఇరువురు నేతల మధ్య వ్యక్తిగత సంబంధాల బలోపేతమే ఈ పర్యటన ఉద్దేశం. జిన్‌పింగ్ గడిపే 24 గంటల్లో మోదీతో కనీసం నాలుగుసార్లు సమావేశమయ్యే అవకాశాలున్నాయి. చారిత్రక ప్రాంతమైన మహాబలిపురంలో జరిగే సాంస్కృతిక ఉత్సవాలకు జిన్‌పింగ్, మోదీలు హాజరవుతారు. బంగాళాఖాతం సముద్ర అందాలను వీక్షిస్తూ చెన్నైలో రిసార్ట్‌లో ఇరువురు నేతలు అంతరంగిక చర్చలు జరుపుతారు. ఈ సందర్భంగా ప్రభుత్వం భారీ భద్రతా ఏర్పాట్లు చేసింది. కశ్మీర్ ద్వైపాక్షిక అంశం: చైనా జిన్‌పింగ్ భారత్ పర్యటన నేపథ్యంలో కశ్మీర్ అంశంపై చైనా తన అభిప్రాయాన్ని బహిరంగ పరిచింది. ఇన్నాళ్లూ పాక్‌కు మద్దతుగా నిలిచిన చైనా ఆ దేశానికి షాక్ ఇచ్చింది. కశ్మీర్ ద్వైపాక్షిక అంశమని, ఆ రెండు దేశాలే దానిని పరిష్కరించుకోవాలని చెబుతూ పాక్‌ను అంతర్జాతీయంగా ఏకాకిని చేసింది. చైనా ప్రభుత్వ అధికార ప్రతినిధి గెంగ్ విలేకరులతో మాట్లాడుతూ అంతర్జాతీయ ఆకాంక్షలకు అనుగుణంగా భారత్, పాక్‌లు కశ్మీర్లు సమస్య ద్వైపాక్షిక చర్చల ద్వారా పరిష్కరించుకోవాలన్నారు. అయితే చైనా తన మాట మీద ఎంతవరకు నిలబడుతుందన్నది ప్రశ్నార్థకమే. టూర్ షెడ్యూల్ ఇదీ మామల్లపురం (మహాబలిపురం) పాండవుల రథాల దగ్గర శుక్రవారం సాయంత్రం జరిగే సాంస్కృతిక కార్యక్రమాల్లో మోదీ, జిన్‌పింగ్ పాల్గొంటారు. అదే రోజు రాత్రి జిన్‌పింగ్ గౌరవార్థం సముద్ర తీర ప్రాంతంలో విందు ఉంటుంది. విందు చివర్లో ఇరుదేశాలకు చెందిన సీనియర్ అధికారులు పాలుపంచుకుంటారు.ఆ తర్వాత జిన్‌పింగ్ చెన్నైలో తను బస చేసే హోటల్‌కు వెళ్లిపోతారు.అక్టోబర్ 12 శనివారం ఉదయం 10 గంటలకు సముద్ర తీర ప్రాంతంలోని ఫైవ్‌స్టార్ రిసార్ట్‌లో మోదీ, జిన్‌పింగ్ 40 నిముషాల సేపు మాట్లాడుకుంటారు. తర్వాత ఇరువైపు దౌత్యబృందాలు అధికారిక చర్చలు జరుపుతాయి. అది పూర్తయ్యాక భోజనం సమయంలో మళ్లీ మోదీ , జిన్‌పింగ్‌లు చర్చిస్తారు. చర్చకు వచ్చే అంశాలు కశ్మీర్ స్వయంప్రతిపత్తిని నిర్వీర్యం చేసే 370 ఆర్టికల్‌ను కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడంతో భారత్, పాక్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న సమయంలోనే చైనా అధ్యక్షుడి భారత్ రాక ప్రాధాన్యతను సంతరించుకుంది. చైనాకు సరిహద్దుగా ఉన్న లద్దాఖ్‌ను కశ్మీర్ 370 అధికరణం రద్దు చేయడం ద్వారా కేంద్ర పాలిత ప్రాంతం చేయడంతో ఈ అంశం ప్రముఖంగా చర్చకు వచ్చే అవకాశం ఉంది. అరుణాచల్ ప్రదేశ్‌కు 100 కి.మీ. దూరంలో ఉన్న వాస్తవాధీన రేఖ వెంబడి భారత్ నిర్వహిస్తున్న సైనిక కసరత్తులు, ఉగ్రవాద వ్యతిరేక పోరాటం, ఆర్థిక సంబంధాలు, విదేశాంగ విధానాలు, చైనా 5జీ నెట్వర్క్ విధానం తదితర అంశాలపై ఇరు దేశాధినేతలు తమ మనోభావాలను పంచుకుంటారు. -
మహాబలిపురంలో మస్తీ!
ఎక్కడో పుట్టారు! ఎక్కడో పెరిగారు! కలిసింది మాత్రం ఇక్కడే... కళామతల్లి ఒడిలో, వెండితెర వెలుగుల్లో! అప్పట్నుంచి స్నేహంగా మెలుగుతూ మరింత ఎత్తుకు ఎదిగారు... ప్రేక్షకుల్లో ప్రేమాభిమానాల్ని సొంతం చేసుకుని పెరిగి పెద్దయ్యారు. అయినా సరే... ఏడాదికొకసారి కలవడం మాత్రం మరువలేదు. 1980లలో సౌత్ స్టార్లు అందరూ కలిసి ‘ఎయిటీస్ సౌత్ యాక్టర్స్’ పేరుతో ఓ క్లబ్ ఏర్పాటు చేసుకున్నారు. రజనీకాంత్, మోహన్‌లాల్, చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేశ్, భాగ్యరాజ, అర్జున్, జాకీ ష్రాఫ్, సీనియర్ నరేశ్, సత్యరాజ్, సుమన్, ప్రభు, రమేశ్ అరవింద్, భానుచందర్, సురేశ్ తదితర హీరోలతో పాటు రేవతి, రమ్యకృష్ణ, రాధిక, సుహాసిని, నదియా, రాధ, మేనక తదితర హీరోయిన్లు ఈ ఎయిటీస్ క్లబ్లో సభ్యులు. ఎనిమిదేళ్లుగా వీళ్లందరూ ‘ఎయిటీస్ సౌత్ యాక్టర్స్–రీయూనియన్’ పేరుతో ఏదొక చోట కలుస్తుంటారు. ఈ ఏడాది మహాబలిపురంలో కలిశారు. ఈ నెల 17, 18వ తేదీల్లో గెట్ టుగెదర్ పార్టీ జరిగింది. ఈ పార్టీల స్పెషాలిటీ ఏంటంటే... ప్రతి ఏడాది ఏదొక థీమ్ ప్రకారం చేసుకుంటారు. అందరూ ఒకే రంగు దుస్తులు ధరిస్తారు. ఈసారి ఊదా రంగు థీమ్‌తో డ్రస్సులు ప్లాన్ చేసుకున్నారు. ఐ–ఫీస్ట్ కదూ! ఈ తారలు గత 17వ తేదీన ఊదా రంగు దుస్తుల్లో మహాబలిపురంలో మీట్ అయ్యారు. తాము బస చేసిన హోటల్‌ను ఊదా రంగుతో అలంకరించారు. అలనాటి నటీమణులు సుహాసినీ, లిసీ, పూర్ణిమా భాగ్యరాజ్, ఖుష్బూ, నటుడు రాజ్‌కుమార్ సేతుపతిలు గెట్ టుగెదర్కి వచ్చిన వారికి ఆహ్వానం పలికారు. అందరూ ఆనందంగా అలనాటి జ్ఞాపకాలను పంచుకుని, ఫొటోలు దిగారు. తర్వాత పాటల పోటీ నిర్వహించారు. 1960 – 70 కాలంలో విడుదలైన ప్రముఖ హిందీ పాటలను నటీనటులు రేవతి, ఖుష్బూ, సురేశ్, రమ్య, సుమలత, నరేష్, రాధిక, శరత్‌కుమార్ ఆలపించారు. విజేతలు రేవతి, ఖుష్బూలకు బహుమతులు అందించారు. ర్యాంప్ వాక్: మొదటి రోజు పురుషులు, మహిళలకు ర్యాంప్ వాక్ పోటీ నిర్వహించారు. చిరంజీవి అధ్యక్షత జరిగిన ఈ షోలో పురుషుల బృందం గెలుపొందింది. రెండో రోజు ఆధ్యాత్మిక అంశాలపై చర్చా వేదికలు నిర్వహించారు.