చెన్నై: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తాను మాటలు మాత్రమే చెప్పే వ్యక్తిని కాదని నిరూపించుకున్నారు. ఎప్పుడు స్వచ్ఛత జపం చేసే ప్రధాని స్వయంగా శ్రామికుడిలా మారి చెత్తను ఎత్తారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో తెగ వైరలవుతోంది. చైనా అధ్యక్షుడు జీ జిన్‌పింగ్, భారత ప్రధాని నరేంద్ర మోదీల మధ్య అనధికార భేటీ శుక్రవారం మహాబలిపురంలో ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండో రోజు భేటీ ప్రారంభానికి ముందు మోదీ దేశ ప్రజలకు క్లీన్ అండ్ ఫిట్ సందేశాన్ని ఇచ్చారు. శనివారం ఉదయం మోదీ మహాబలిపురం బీచ్‌లో జాగింగ్ చేయడానికి వెళ్లారు. ఆ సమయంలో ఓ సాధారణ వ్యక్తిలో సముద్రం తీరంలో అరగంటపాటు తిరిగిన మోదీ... అక్కడున్న చెత్తను స్వయంగా ఆయనే శుభ్రం చేశారు. బీచ్‌లో పడి ఉన్న ప్లాస్టిక్ కవర్లను, బాటిళ్లను ఆయన చెత్తో క్లీన్ చేశారు. మన పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలంటూ ప్రజలకు పిలుపునిచ్చారు.
ఇందుకు సంబంధించిన ఫోటోలను, వీడియోలను ట్విటర్‌లో పోస్ట్ చేస్తూ.. ‘మహాబలిపురం బీచ్‌లో అరగంట పాటు తిరిగాను. అక్కడ నేను సేకరించిన నా కలెక్షన్‌ను హోటల్ సిబ్బందిలో భాగమైన జయరాజ్‌కు అప్పగించాను. మన బహిరంగ ప్రదేశాలు శుభ్రంగా మరియు చక్కగా ఉండేలా చూద్దాం. మనం ఆరోగ్యంగా ఉండేలా చూసుకుందాం’ అంటూ మోదీ ట్వీట్ చేశారు. ప్రధాని ట్వీట్‌కు లక్షల్లో లైకులు వస్తున్నాయి. మీరు గ్రేట్ సార్.. కేవలం మాటలకే పరిమితం కారు.. చేతల్లో చూపిస్తారు అంటూ.. నెటిజన్లు ఆయనను ప్రశంసంలతో ముంచెత్తుతున్నారు.
(చదవండి: తమిళ.. చైనా మీడియాలో)
Comments
Please login to add a commentAdd a comment