
బీచ్‌లో స్నానం చేస్తున్న టూరిస్టుపై రేప్
ఉదయం 10.30గంటల ప్రాంతంలో కాస్తంత నిర్మానుష్యంగా అనిపించే టైగర్ కేవ్స్ వైపు వెళ్లి అక్కడ బీచ్‌లో సన్ బాత్ చేయడం మొదలుపెట్టింది. ఆ సమయంలోనే అటువైపు వచ్చిన ఓ వ్యక్తి తొలుత ఆమెను లైంగికంగా వేధించి అనంతరం లైంగికదాడి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్యపరీక్షలకు తరలించి విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.