german tourist
-
Picture of the Year award: అమానుష ఫొటోకు అవార్డా!
వాషింగ్టన్: ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతాలపై హమాస్ మిలిటెంట్ల మెరుపుదాడి ఘటనలో ఒక యువతిని అపహరించి అర్ధనగ్నంగా ఊరేగించిన ఫొటోకు అంతర్జాతీయ అవార్డ్ ఇవ్వడం వివాదాస్పదమైంది. ఫొటోలో యువతిని బ్లర్ చేయకుండానే ఇంటర్నెట్లో పెట్టడంతో అవార్డుల సంస్థపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గత అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్న సంగీత విభావరిపై హమాస్ మిలిటెంట్లు దాడి చేయడం, దాదాపు 360 మందిని చంపేయడం తెలిసిందే. జర్మనీకి చెందిన 22 ఏళ్ల పర్యాటకురాలు షానీ లౌక్తో పాటు పలువురిని కిడ్నాప్ చేశారు. ఆమెను అపహరించి అర్ధనగ్నంగా గాజా వీధుల్లో ఊరేగిస్తుండగా ‘ది అసోసియేటెడ్ ప్రెస్’ వార్తాసంస్థ పలు ఫొటోలు తీసింది. నాటి దారుణానికి సజీవ సాక్ష్యంగా నిలిచిందంటూ ఈ ఫొటోకు ‘ టీమ్ పిక్చర్ స్టోరీ ఆఫ్ ది ఇయర్’ కేటగిరీ కింద ప్రథమ బహుమతి ప్రకటించారు. అమెరికాలోని కొలంబియాలో ఉన్న మిస్సోరీ స్కూల్ ఆఫ్ జర్నలిజం విభాగమైన డొనాల్డ్ రేనాల్డ్స్ జర్నలిజం ఇన్స్టిట్యూట్ ఈ అవార్డును ప్రకటించింది. ఊరేగింపు ఘటన జరిగిన కొద్ది రోజులకు గాజాలో షానీ లౌక్ పుర్రె భాగం ఇజ్రాయెల్ బలగాలకు దొరికింది. దీంతో హమాస్ మూకలు ఈమెను చిత్రవధ చేసి చంపేశాయని ఇజ్రాయెల్ అక్టోబర్ 30న ప్రకటించింది. ఆమె మృతదేహం ఇంకా గాజాలోనే ఉంది. నాటి నరమేధానికి బలైన అభాగ్యురాలిని ఇలా అవార్డు పేరిట అవమానిస్తారా? అంటూ ప్రపంచవ్యాప్తంగా నెటిజన్లు మండిపడుతున్నారు. అయితే ఈ ఫొటోలను అసోసియేటెడ్ ప్రెస్ తీయలేదని, హమాస్ మిలిటెంట్లలో ఒకరు తీసిన ఫొటోలను అసోసియేటెడ్ ప్రెస్ సంపాదించిందని కొందరు వ్యాఖ్యానించారు. -
యూపీలో మరో విదేశీ టూరిస్టుపై దాడి
వారణాసి : భారత్‌లో మరో విదేశీ పర్యాటకుడిపై దాడి సంచలనంగా మారింది. ఉత్తరప్రదేశ్‌లోని సోన్‌భద్ర జిల్లాలోని రాబర్ట్స్‌గంజ్ రైల్వే స్టేషన్లో శనివారం ఈ ఘటన జరిగింది. ఇటీవలే ఆగ్రాలో తమతో సెల్ఫీ దిగలేదన్న సాకుతో కొందరు యువకులు స్విట్జర్లాండ్‌కు చెందిన జంటను చితక్కొట్టిన సంగతి తెలిసిందే. ఆ ఉదంతం ఇంకా చల్లారకముందే యూపీలోనే మరో టూరిస్టుపై దాడి జరగడం గమనార్హం. అసలేం ఏం జరిగింది? : జర్మనీ రాజధాని బెర్లిన్‌కు చెందిన హాల్గర్ ఎరిక్ మిస్చ్.. ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నాడు. యూపీ సోన్‌భద్ర జిల్లాలోని ప్రఖ్యాత అఘోరి కోటను చూసేందుకు శనివారం రైలులో వెళ్లాడు. రాబర్ట్స్‌గంజ్ స్టేషన్లో దిగిన తర్వాత, అక్కడినుంచి కోటకు వెళ్లే దారి సూచనల కోసం వెతికాడు. ఆ సమయంలో సహాయం సాకుతో అమన్ కుమార్ అనే వ్యక్తి ఎరిక్ దగ్గరికొచ్చి వేధింపులు మొదలుపెట్టాడు. ఒక దశలో ఎరిక్‌ను కొట్టి, కిందపడేశాడు. గలాటా జరుగుతోందన్న సమాచారంతో అక్కడికొచ్చిన పోలీసులు ఇద్దరినీ స్టేషన్‌కు తీసుకెళ్లారు. వెల్కమ్ టు ఇండియా అంటే కొట్టాడు : ఎరిక్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసుకున్న పోలీసులు.. ‘ఎందుకు కొట్టావ’ని నిందితడు అమర్ కుమార్‌ని ప్రశ్నించగా.. ‘నేను కాదు.. అతనే నాపై దాడి చేశాడు. ఆ టూరిస్టు(ఎరిక్) రైలుదిగి వస్తున్నప్పుడు వెల్కమ్ టు ఇండియా అని స్వాగతం పలికానని, తన మాటలను పట్టించుకోకపోగా, దాడి చేశాడు’’ అని అమన్ రివర్స్ ఫిర్యాదు చేశాడు. ఇతను ఓ ప్రైవేటు కంపెనీలో ఎలక్ట్రిషన్‌గా పనిచేస్తున్నాడు. కేసుకు సంబంధించిన నిజానిజాలను వెలికితీసేందుకు పోలీసులు దర్యాప్తును ప్రారంభించారు. ఈ ఘటనపై యూపీ ఉన్నతాధికారులు, విదేశాంగ మంత్రిత్వ శాఖ, జర్మన్ ఎంబసీలు స్పందించాల్సిఉంది. -
బీచ్‌లో స్నానం చేస్తున్న టూరిస్టుపై రేప్
కంచీపురం: తమిళనాడులో దారుణం చోటుచేసుకుంది. పర్యాటకానికి వచ్చిన ఓ జర్మనీ మహిళా టూరిస్టుపై లైంగిక దాడి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం శనివారం చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 38 ఏళ్ల జర్మనీ మహిళ తమిళనాడులోని మహాబలిపురంలో పర్యటించేందుకు వచ్చింది. ఉదయం 10.30గంటల ప్రాంతంలో కాస్తంత నిర్మానుష్యంగా అనిపించే టైగర్ కేవ్స్ వైపు వెళ్లి అక్కడ బీచ్‌లో సన్ బాత్ చేయడం మొదలుపెట్టింది. ఆ సమయంలోనే అటువైపు వచ్చిన ఓ వ్యక్తి తొలుత ఆమెను లైంగికంగా వేధించి అనంతరం లైంగికదాడి పాల్పడ్డాడు. ఈ విషయాన్ని బాధితురాలే పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాధితురాలిని వైద్యపరీక్షలకు తరలించి విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు ఇద్దరిని అరెస్టు చేశారు.