
ఎప్పటినుంచో చక్కర్లు కొడుతున్న నయనతార-విఘ్నేష్ శివన్ పెళ్లి పుకార్లు ఎట్టకేలకు నిజమయ్యాయి. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా నయనతార, సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా విఘ్నేష్ శివన్ గుర్తింపు పొందిన వీరిద్దరి వివాహంపై అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం (జూన్ 7) వారిద్దరు జూన్ 9న మహాబలిపురంలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు విఘ్నేశ్ అధికారికంగా ప్రకటించాడు.
ఎప్పటినుంచో చక్కర్లు కొడుతున్న నయనతార-విఘ్నేష్ శివన్ పెళ్లి పుకార్లు ఎట్టకేలకు నిజమయ్యాయి. సౌత్ ఇండస్ట్రీలో లేడీ సూపర్‌స్టార్‌గా నయనతార, సక్సెస్ఫుల్ డైరెక్టర్‌గా విఘ్నేష్ శివన్ గుర్తింపు పొందిన వీరిద్దరి వివాహంపై అనేక వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. మంగళవారం (జూన్ 7) వారిద్దరు జూన్ 9న మహాబలిపురంలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నట్లు విఘ్నేశ్ అధికారికంగా ప్రకటించాడు. అత్యంత సన్నిహితుల మధ్య ఈ వేడుక జరగనుందని కూడా తెలిపాడు.
తాజాగా ఈ నయన్-విఘ్నేష్ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో నెట్టింట గింగిరాలు తిరుగుతోంది. ఈ యానిమేటేడ్ వీడియోలో వధువు, వరుడు తమిళ సాంప్రదాయ దుస్తులు ధరించి కలిసి నడుస్తున్నట్లుగా చూపించారు. ఇందులో నయనతార, విఘ్నేష్ తల్లిదండ్రుల పేర్లు, పెళ్లి తేది, జరిగే సమయం, వేదికను పొందుపర్చారు. ఇదిలా ఉంటే పెళ్లి జరిగే మహాబలిపురంలోని రిసార్ట్‌లో ఇప్పటికే భద్రత ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ వేడుకకు వచ్చే అతిథులందరూ ప్రత్యేక డ్రెస్ కోడ్‌లో హాజరుకానున్నట్లు తెలుస్తోంది.
చదవండి: అయోమయంగా నయనతార.. నవ్వుతున్న పృథ్వీరాజ్ సుకుమారన్