చెన్నై : చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ కొద్దిసేపటి క్రితం చెన్నై అంతర్జాతీయ విమానశ్రయానికి చేరుకున్నారు. ఎయిర్‌పోర్టులో ఆయనకు తమిళనాడు గవర్నర్ బన్వరిలాల్ పురోహిత్, సీఎం పళనిస్వామిలు ఘన స్వాగతం పలికారు. ఎయిర్‌పోర్ట్‌లో ఏర్పాటు చూసిన పలు సాంస్కృతిక ప్రదర్శనలను ఆసక్తిగా తిలకిస్తూ జిన్‌పింగ్ ముందుకు సాగారు. జిన్‌పింగ్ ఎయిర్‌పోర్ట్ నుంచి నేరుగా ఐటీసీ చోళ హోటల్‌కు వెళ్లనున్నారు. అక్కడ కాసేపు విశ్రాంతి తీసుకున్న అనంతరం సాయంత్రం 4 గంటల ప్రాంతంలో ఆయన మహాబలిపురం బయలుదేరుతారు. నేడు, రేపు రెండు రోజులపాటు చెన్నై సమీపంలోని మహాబలిపురం వేదికగా ఆయన ప్రధాని నరేంద్ర మోదీ చర్చలు జరపనున్నారు. ఇది మోదీ, జిన్‌పింగ్‌ల మధ్య జరుగుతున్న రెండో అనధికారిక సమావేశం.
చెన్నైకి చేరుకున్న జిన్‌పింగ్
Published Fri, Oct 11 2019 2:38 PM | Last Updated on Thu, Mar 21 2024 11:35 AM
Advertisement
Advertisement
Advertisement