
తెలుగు తేజాలకు వైఎస్ జగన్ అభినందనలు
హైదరాబాద్ : సివిల్స్లో విజయ కేతనం ఎగురవేసిన రెండు రాష్ట్రాల తెలుగు విద్యార్థులకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అభినందనలు తెలిపారు. తెలుగు తేజాలకు అభినందనలతో పాటు ఆయన ఆల్ ది బెస్ట్ అంటూ బుధవారం ట్విట్ చేశారు. కాగా దేశంలోనే ప్రతిష్టాత్మకమైన అఖిల భారత సర్వీసు అధికారుల ఎంపిక పరీక్ష ‘సివిల్స్’లో తెలంగాణ, ఏపీ విద్యార్థులు విజయం సాధించారు. దేశవ్యాప్తంగా 1,078 మందిని సివిల్ సర్వీసులకు ఎంపిక చేయగా.. అందులో దాదాపు 80 మంది తెలుగు విద్యార్థులే కావడం విశేషం.