
సాయికృష్ణ
మహబూబాబాద్ రూరల్ : మానుకోట జిల్లా కేంద్రానికి చెందిన ఓ యువకుడు అమెరికాలోని మెచిగాన్ రాష్ట్రంలోని ఫార్మెంటన్‌హిల్స్ ప్రాంతంలో గాయపడిన ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. కాల్పులు జరిగాయని కొందరు అంటుండగా కారు ప్రమాదంలో గాయపడ్డాడని బాధితుడి తండ్రికి అమెరికా నుంచి ఫోన్ వచ్చింది. ప్రస్తుతం ఈ సంఘటన కలకలం రేపుతోంది. మానుకోట జిల్లా కేంద్రంలోని శ్రీవేణుగోపాలస్వామి దేవాలయ సమీపాన ఉన్న డాక్టర్ ప ర్కాల సోమసుందర్‌రెడ్డి నివాసంలో పూస ఎల్లయ్య, శైలజ కుటుంబం నివాసం ఉంటోంది. వీరికి కుమారుడు సాయికృష్ణ, కుమార్తె మౌనిక ఉన్నారు. ఎల్లయ్య మానుకోట జిల్లాలోని కురవి మండలం లింగ్యాతండా ఎంపీపీఎస్‌లో ఎల్‌ఎఫ్‌ఎల్ హెచ్‌ఎంగా పనిచేస్తున్నారు.
భార్య శైలజ గృహిణి. కుమార్తె మౌనిక హైదరాబాద్‌లో ఎంబీఏ చదువుతోంది. కుమారుడు సాయికృష్ణ నర్సరీ నుంచి 10వ తరగతి వరకు మానుకోట హోలీ ఏంజిల్స్ హైస్కూల్‌లో చదువుకున్నాడు. ఆ తార్వత హైదరాబాద్‌లోని నారాయణ కళాశాలలో ఇంటర్ పూర్తిచేశాడు. చేవెళ్లలోని కేఎస్‌రాజు ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో ట్రిపుల్‌ఈ(ఈఈఈ) చదువుకున్నాడు. 2015 మే నెలలో చదువు పూర్తయ్యాక ఎంఎస్ చేయడానికి అమెరికాకు వెళ్లాడు. అక్కడి మెచిగాన్ రాష్ట్రంలో ఉండి లారెన్స్ యూనివర్సిటీలో ఎంఎస్ 2017 ఆగస్టులో పూర్తి చేశాడు. నెల రోజుల క్రితం మెచిగాన్ రాష్ట్రంలోని ఫార్మెంటన్‌హిల్స్ ప్రాంతంలోని ఆటోమోటివ్ కంపెనీలో ఎలక్ట్రికల్ ఇంజినీర్‌గా చేరాడు. విధి నిర్వహణలో భాగంగా ఉదయం, సాయంత్రం ఉద్యోగా>నికి వెళ్లివస్తున్నాడు.
తండ్రికి అమెరికా నుంచి ఫోన్..
సాయికృష్ణ కారు ప్రమాదంలో గాయపడ్డాడని ఈనెల 4వ తేదీ అర్ధరాత్రి 12 గంటలకు అమెరికా నుంచి వైద్యులు అతడి తండ్రి ఎల్లయ్యకు ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. వెంటనే ఆ విషయాన్ని ఆయన బంధువులకు, సాయికృష్ణ మిత్రులకు తెలియజేశారు. సాయికృష్ణకు రక్తం అవసరం ఉందని, అత్యవసరంగా ఆపరేషన్ కూడా చేయాలని, ఇందుకు తండ్రిగా అంగీకారం తెలపాలని వైద్యులు కోరగా ఎల్లయ్య సరే అన్నారు. శనివారం, ఆదివారం గంటకు ఒకసారి అమెరికా నుంచి సాయికృష్ణ మిత్రులు, మానుకోటకు చెందిన మరో మిత్రుడు ధార అరుణ్‌కుమార్ ద్వారా తండ్రికి సమాచారం ఇస్తున్నారు.
ఆందోళనలో కుటుంబ సభ్యులు
తన కుమారుడికి ప్రమాదం జరిగిందని తెలియగానే సాయికృష్ణ తల్లి శైలజ మూడు రోజులుగా అన్నపానీయాలు మానేసి రోధిస్తూనే ఉంది. ఆమెను ఓదార్చటం ఎవరివల్ల కావటం లేదు. సా యికృష్ణకు వైద్య సహాయం అందించే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చొరవచూపాలని తండ్రి ఎల్లయ్య కోరాడు. ఆమెరికా ప్రభుత్వంతో మాట్లాడి తమ కుమారుడిని ఎలాగైనా కాపాడాని వేడుకున్నారు. కుమారుడిని చూసేందుకు సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
ఘటనపై అనుమానాలు..
కారు ప్రమాదంలో సాయికృష్ణ గాయపడ్డాడని అమెరికాలోని ఆస్పత్రి వర్గాలు చెబుతుండగా కొందరు అతడి సన్నిహితులు మాత్రం మానుకోటవాసిపై అమెరికాలో కాల్పులు జరిగి ఉంటాయని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల వరుస సంఘటనలు జరుగుతుండడంతో ఈ రకమైన ప్రచారం కలకలం రేపుతోంది. అసలు వాస్తవం ఏం జరిగిందనేది ఇప్పటి వరకు ఇక్కడున్న వారికెవరికీ తెలియదు.
ఫండ్ రైంజింగ్ లింక్‌తో
మీడియాకు సమాచారం..
అమెరికాలో ప్రమాదంలో గాయపడిన సాయికృష్ణ ఆపరేషన్ కోసం, మెడికల్ ఇన్సూరెన్స్ లేక వైద్య బృందం అతడి మిత్రులకు సమాచారం ఇచ్చారు. దీంతో అందరూ కలిసి కొత్తగా ఫండ్ రైజింగ్ లింక్ క్రియేట్ చేయటంతో ఆ విషయం మీడియాకు తెలిసింది.
రెగ్యులర్‌గా ఫోన్ చేస్తుంటాడు..
నేను, సాయికృష్ణ నర్సరీ నుంచి 10వ తరగతి వరకు ఇతర మిత్రులు శ్రీకాంత్, సాయి, కౌశిక్, రంజిత్ కలిసి మానుకోట హోలీ ఏంజిల్స్ హైస్కూల్‌లో చదువుకున్నాం. హైదరాబాద్‌లో ఇంటర్, చేవెళ్లలో బీటెక్ చేశాం. అనంతరం ఎంఎస్ చదవడానికి అమెరికాకు సాయికృష్ణ వెళ్లాడు. అక్కడ ఏంజరిగిందో తెలియదు కానీ.. కారు ప్రమాదమని అమెరికా నుంచి అతడి రూం చుట్టుపక్కల వారు, ఆస్పత్రి వైద్యులు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. సాయికృష్ణకు ఆపరేషన్ చేసే విషయంలో మెడికల్ ఇన్సూరెన్స్ లేక ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తడంతో మిత్రులంతా డబ్బుల కోసమని ఠీఠీఠీ. జౌజunఛీఝ్ఛ.ఛిౌఝతో టupఞౌట్ట ట్చజీజుటజీటజిn్చ ద్వారా ఆర్థిక సాయం అందజేయవచ్చని ఫండ్ రైజింగ్ లింక్ ప్రారంభించాం. ఆపరేషన్‌కు 2.50 లక్షల డాలర్లు(సుమారు 2 కోట్లు) అవసరం ఉన్నాయి. ఫండ్ రైజింగ్ లింక్ ద్వారా కేవలం ఒక్క రోజులో 1.10 లక్షల డాలర్లు(సుమారు రూ.70 లక్షలు) జమయ్యాయి.
– దార అరుణ్‌కుమార్, మానుకోట, సాయికృష్ణ స్నేహితుడు

ఎల్లయ్యను పరామర్శిస్తున్న ఉపాధ్యాయులు

సాయికృష్ణ తల్లి శైలజను పరామర్శిస్తున్న స్థానికులు, మానుకోటలోని సాయికృష్ణ నివాసం
Comments
Please login to add a commentAdd a comment