మన్సూరాబాద్‌లోని ఓ పరీక్ష కేంద్రంలో ‘సాక్షి’ జేఈఈ మెయిన్స్ మోడల్ టెస్ట్‌కు హాజరైన విద్యార్థులు
సాక్షి, హైదరాబాద్: తెలుగు విద్యార్థుల కోసం ‘సాక్షి మీడియా గ్రూప్, నారాయణ విద్యా సంస్థలు’ సంయుక్తంగా నిర్వహించిన జేఈఈ మెయిన్ మాక్ టెస్ట్‌కు విశేష స్పందన లభించింది. ఆదివారం ఉదయం 9.30 నుంచి 12.30 వరకు 90(హైదరాబాద్‌లో 40, ఏపీలో 50) కేంద్రాల్లో నిర్వహించిన పరీక్షకు తెలంగాణ నుంచి 10 వేల మంది, ఏపీ నుంచి మరో 10 వేల మందికిపైగా విద్యార్థులు హాజరయ్యారు.
పోటీ పరీక్షల నిర్వహణ తీరు, ప్రశ్నపత్రం వంటి అంశాలపై విద్యార్థులు అవగాహన పొందారు. ప్రశ్నపత్రాన్ని సాక్షి విద్యా విభాగం తయారు చేసింది. పరీక్ష ‘కీ’ సోమవారం ఉదయం 11 గంటలకు ‘సాక్షి ఎడ్యుకేషన్.కామ్’ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటుంది. ఏప్రిల్ 15న మాక్ ఎంసెట్(ఇంజనీరింగ్) ఆన్‌లైన్‌లో జరుగుతుంది. 22న మాక్ నీట్ ఆఫ్‌లైన్‌లో జరుగుతుంది. సాక్షి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పరీక్షలకు విజ్ఞాన్ యూనివర్సిటీ కో స్పాన్సర్‌గా వ్యవహరిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment