
(ఫైల్ ఫోటో)
సాక్షి, హైదరాబాద్ : ఉన్నత విద్య కోసం కజకిస్తాన్ వెళ్లిన తెలంగాణ విద్యార్థులకు కష్టాలు మొదలయ్యాయి. కరోనా కారణంగా యూనివర్సిటీలు తాత్కాలికంగా యూసివేయడంతో తిరిగి సొంత రాష్ట్రాలకు వెళ్లాలనుకునే తెలుగు విద్యార్థులకు రవాణా సదుపాయాలు లేకపోడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో కజకిస్తాన్‌లోని ఓ ఏజెన్సీ తెలంగాణకు పంపిస్తామని తమ వద్ద 45 వేల రూపాయలు కట్టించుకొని తర్వాత తమకు ఎలాంటి రవాణా సదుపాయం కల్పించలేదని మెడికల్ విద్యార్థులు ఆందోళన చేపట్టారు. తమను సొంత రాష్ట్రానికి తరలించేందుకు తెలంగాణ ప్రభుత్వ అధికారులు ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉన్నత చదువులు అభ్యసించేందుకు 300 మంది విద్యార్థులు కజకిస్తాన్‌కు వెళ్లారు. కజకిస్తాన్ ఎయిర్‌పోర్టు వద్ద ఏషియన్ మెడికల్ ఇనిస్టిట్యూట్‌కు చెందిన తెలంగాణ విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేశారు. (టిక్‌టాక్ అవుట్; స్వదేశీ పరిజ్ఞానంతో ‘పాప్-ఇన్’ యాప్)
Comments
Please login to add a commentAdd a comment