నీట్ ఫలితాలు.. సత్తా చాటిన తెలుగు విద్యార్థులు!
న్యూఢిల్లీ: అనేక వాయిదాల తర్వాత సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్‌ఈ) శుక్రవారం నీట్ ఫలితాలను విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్, డెంటల్ కాలేజీల్లో ప్రవేశాల కోసం ఉద్దేశించిన నీట్ (జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష)ను 12 లక్షలమంది రాశారు.
ఈసారి నీట్ ఫలితాలలో పంజాబ్‌లోని ముక్త్‌సర్‌కు చెందిన నవదీప్‌సింగ్ అనే విద్యార్థి అలిండియా టాప్ ర్యాంకు సాధించగా.. మధ్యప్రదేశ్ ఇండోర్‌కు చెందిన అర్చిత్ గుప్తా రెండో ర్యాంకు సాధించాడు. మూడో ర్యాంకు కూడా ఇండోర్ విద్యార్థికే దక్కింది. ఇక తెలుగు విద్యార్థులు కూడా నీట్‌లో సత్తా చాటారు. కడపకు చెందిన మన్వీత కు నీట్ లో 14వ ర్యాంక్ సాధించి.. బయాలజీలో ఏపీలో టాపర్ గా నిలిచింది. హైదరాబాద్ కూకట్‌పల్లికి చెందిన ఎం దీపిక ఆలిండియా 24వ ర్యాంకు సాధించి సత్తా చాటింది.
ఈ వెబ్‌సైట్ లింకుల్లో నీట్ ఫలితాలను చూసుకోవచ్చు. http://cbseresults.nic.in/neet17rpx/neetJ17.htm లేదా cbseneet.nic.in.