
సాక్షి, విజయవాడ : ప్రపంచవ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ లండన్ ఉన్న తెలుగు విద్యార్థులకు ఆంధ్రప్రదేశ్ డీజీపీ గౌతమ్ సవాంగ్ ధైర్యం చెప్పారు. మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లండన్‌లోని తెలుగు విద్యార్థులతో గౌతమ్ సవాంగ్ మాట్లాడారు. విద్యార్థులు ధైర్యంగా ఉండాలని, నిబ్బరం కోల్పోవద్దని వారికి సూచించారు. భారత ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విద్యార్థులకు అండగా ఉంటాయని తెలిపారు.
ఈ సందర్భంగా తాము ఎదుర్కొంటున్న సమస్యలను విద్యార్థులు డీజీపీకి వివరించారు. విద్యార్థుల సమస్యలు విన్న డీజీపీ.. వాటిని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకుని వెళ్లి పరిష్కారిస్తానని భరోసా ఇచ్చారు. విద్యార్థులతో నిరంతరం అందుబాటులో ఉండాలని సీఐడీ(ఎన్‌ఆర్‌ఐ సెల్), ఏపీ ఎన్‌ఆర్‌టీ ప్రతినిధులను ఆదేశించారు. డీజీపీ స్పందనపై లండన్‌లోని తెలుగు విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
చదవండి : ‘నిజంగా మీరు ప్రజా రక్షక భటులు’