
ముంబై చేరుకున్న విద్యార్థులకు స్వాగతం పలుకుతున్న తెలంగాణ అధికారులు
సాక్షి ముంబై: ఉక్రెయిన్‌లో చదువుకుంటున్న విద్యార్థులను తీసుకువస్తున్న మరో ప్రత్యేక విమానం గురువారం ఉదయం ముంబైకి చేరుకుంది. వందకుపైగా విద్యార్థులు ఈ ప్రత్యేక విమానంలో ముంబైకి చేరుకోగా వీరిలో తెలంగాణకు చెందిన తొమ్మిది మంది, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన అయిదుగురు విద్యార్థులు ఉన్నారు.
వీరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నోడల్ అధికారి వి.రామకృష్ణ, తెలంగాణ ప్రభుత్వ అధికారులు డాక్టర్ ఎ.శరత్ (పంచాయితీ రాజ్ కమిషనర్), లాల్‌శంకర్ చవాన్ (ఐపీఎస్)తోపాటు ముంబై కస్టమ్స్ అసిస్టెంట్ కమిషనర్ ఎం.నాగరాజ్ అన్నివిధాలా సహకారమందించారు. నవీముంబైలోని తెలుగు కళాసమితి ప్రధాన కార్యదర్శి మాదిరెడ్డి కొండారెడి, ఎన్జీఓ సంస్థ పదాధికారులు కూరపాటి నరేష్, దోర్నాల రాజు, సురేష్‌కూడా విమానాశ్రయానికి వచ్చి విద్యార్థులను కలిశారు.
ముంబైకి వచ్చిన తెలంగాణ విద్యార్థులు: అభిజిత్‌సింగ్ నేగి (హైదరాబాద్), గోపగల్ల ప్రణయ్ (హైదరాబాద్), ఎం.ఈసాద్‌అలీ బేగ్ (హైదరాబాద్), పాటిల్ అక్షయ్ విజయ్‌కుమార్ (హైదరాబాద్), డి.పవన్‌కళ్యాణ్ (హైదరాబాద్), కె.సిద్దువినాయక్ (హైదరాబాద్), బి.కార్తీక్ నాయక్ (నిజామాబాద్), కె.సొలొమొన్∙రాజ్ (కరీంనగర్), ఐ.కార్తికేయ (హైదరాబాద్)
Comments
Please login to add a commentAdd a comment