నీట్‌లో మెరిశారు | Telugu students top ranks in the NEET | Sakshi

నీట్‌లో మెరిశారు

Published Mon, Jul 3 2017 3:41 AM | Last Updated on Sat, Oct 20 2018 5:44 PM

నీట్‌లో మెరిశారు - Sakshi

నీట్‌లో మెరిశారు

జిల్లాలో పలువురికి ర్యాంకులు
 
కడప ఎడ్యుకేషన్‌: ఇటీవల నీట్‌ ఫలితాల్లో దేశవ్యాప్త ర్యాంకులు సాధించిన వారికి తాజాగా ఆదివారం ప్రభుత్వం రాష్ట్రవ్యాప్త ర్యాంకులను  విడుదల చేసింది. ఇందులో జిల్లాకు చెందిన పలువురు విద్యార్థులు ర్యాంకులు సాధించారు. ఇందులో రాయచోటికి చెందిన ప్రైవేటు వైద్యుడు చంద్రశేఖర్‌రెడ్డి కుమార్తె సాయిచందన ఏపీనీట్‌లో 12వ ర్యాంకు సాధించగా కడపకు చెందిన పశువైద్యుడు డాక్టర్‌ శ్రీధర్‌లింగారెడ్డి,దీపికల కుమారుడు సాయిప్రణవ్‌రెడ్డి 69వ ర్యాంకు, రైల్వేకోడూరుకు చెందిన నర్సరీ యజమాని చల్లా నాగేంద్ర, స్వర్ణలతల కుమారుడు చల్లా దినేష్‌ 86వ ర్యాంకును, చిన్నమండెంకు చెందిన రైతు వెంకటరామిరెడ్డి, లక్ష్మీదేవిల కుమారుడు విççష్ణువర్థన్‌రెడ్డి 399,  కోటింగురువాయపల్లె గ్రామానికి చెందిన కోరా నారాయణరెడ్డి రుక్మిణమ్మల కుమారుడు కోరా వాసుదేవరెడ్డి 77వ ర్యాంకు, జమ్మలమడుగుకు చెందిన వై.రామచంద్రారెడ్డి, తల్లి  శ్రీదేవిల కుమారై  వై.దివ్యప్రీతి 317 ర్యాంకు,   పులివెందులకు చెందిన టీచర్‌ రామానాయుడు, నాగరత్నమ్మల ద్వితీయ కూమార్తె సూదినేని పూజిత  598 ర్యాంకు పొందారు.

అలాగే కడప నగరానికి చెందిన పశువైద్యుడు డాక్టర్‌ శ్రీధర్‌రెడ్డి,దీపికల కుమార్తె సాయిలహరి 1172వ ర్యాంకు, వల్లూరు మండలం బోరెడ్డిపల్లెకు చెందిన మోపూరి చంద్ర ఓబుల్‌రెడ్డి, అనసూయమ్మల కుమార్తె మోపూరి ధన్వికారెడ్డి   1892 వ ర్యాంకును సాధించింది.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement