జమ్మూకశ్మీర్‌లో ఉద్రిక్తతల నేపథ్యంలో శ్రీనగర్ నిట్‌కి సెలవులు ప్రకటించడంతో.. తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు చేరుకుంటున్నారు. 31మంది నిట్ తెలుగు విద్యార్థులు తాజాగా ఢిల్లీ రైల్వే స్టేషన్‌కి చేరుకున్నారు. ఢిల్లీ రైల్వే స్టేషన్‌లో వీరిని ఏపీ భవన్ రెసిడెంట్ కమిషన్ ప్రవీణ్ ప్రకాశ్ రిసీవ్ చేసుకున్నారు. వారికి ఆహార పొట్లాలు అందజేశారు. ఢిల్లీ నుంచి తెలుగు విద్యార్థులు స్వస్థలాలకు తరలేందుకు ఏపీ భవన్ అన్ని ఏర్పాట్లు చేసింది.